Pawan Kalyan : పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. కచ్చితంగా పూర్తిచేయాల్సిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా. ‘హరిహర వీర మల్లు’ ‘ఓజి’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి సినిమాలు పవన్ కళ్యాణ్ కంప్లీట్ చేయాలి. ఇందుకోసం పవన్ కళ్యాణ్ వారానికి రెండు రోజుల చొప్పున డేట్స్ ఇస్తున్నారు. నిర్మాతలు కూడా పవన్ కళ్యాణ్ ట్రావెలింగ్ టైం వేస్ట్ అవ్వకుండా అమరావతి పరిసర ప్రాంతాల్లో సెట్స్ వేసి టైం సేవ్ చేయడానికి డిసైడ్ అయ్యారు. అలాగే సెట్స్ వేసి పవన్ కళ్యాణ్ తో చేయాల్సిన సీన్లు, మిగిలిన సీన్లు కూడా చాలా వరకు కంప్లీట్ చేశారు.ఈ మూడు సినిమాల్లో ముందుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా ‘హరిహర వీరమల్లు’ అనే చెప్పాలి. ఇది పాన్ ఇండియా సినిమా. కొంత భాగం క్రిష్ డైరెక్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ వల్ల షూటింగ్ ఆలస్యం అవ్వడంతో క్రిష్ అనుష్క సినిమాకి షిఫ్ట్ అయిపోయారు. తర్వాత నిర్మాత ఏ.ఎం.రత్నం కొడుకు అయిన జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. ఇక రెండు భాగాలుగా ‘హరిహర వీరమల్లు’ ని అనౌన్స్ చేశారు కానీ.., ఇప్పుడు ఆలోచన విరమించుకుని ఎక్కువ రన్ టైంతో ఒక్కటే సినిమాగా రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు డిసైడ్ అయ్యారు. ఇక ఈ సినిమాని మార్చి 28న విడుదల చేస్తున్నట్టు కూడా అనౌన్స్ చేశారు. ‘మరి ఆ డేట్ కి వస్తుందా?’ అంటే అనుమానమే. ఎందుకు అంటే షూటింగ్ పార్ట్ చాలా బ్యాలన్స్ ఉంది. హీరోయిన్ నిథి అగర్వాల్ పోర్షన్ కూడా చాలా బ్యాలన్స్ ఉంది. కథలో ఆమెది కూడా కీలక పాత్ర.
ఏది ఏమైనా ‘హరిహర వీరమల్లు’ ప్రమోషన్స్ అయితే చిత్ర బృందం మొదలుపెట్టేసింది. ఇందులో భాగంగా ‘మాట వినాలి’ అనే లిరికల్ సాంగ్ ను.. విడుదల చేసింది. ఈ పాట ఆరంభంలో వచ్చే పవన్ కళ్యాణ్ డైలాగులు ఫ్యాన్స్ ని అలరించాయి. ఇది చిన్న పాటే అయినా.. సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతుంది. 5 భాషల్లో ఈ పాటని విడుదల చేశారు. అన్ని వెర్షన్లలోనూ పవన్ కళ్యాణ్ పాడటాన్ని అంతా విశేషంగా చెప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ ఇన్ని భాషల్లో(తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం,కన్నడ) పాడటం అనేది నిజంగా గొప్ప విషయమే. కానీ దీని వెనుక అసలు కథ వేరు ఉంది అనేది ఇండస్ట్రీ టాక్. విషయం ఏంటంటే.. ‘మాట వినాలి’ అనే పాట తెలుగు వెర్షన్ మాత్రమే పవన్ కళ్యాణ్ పాడారట. మిగిలిన వెర్షన్లు పవన్ పాడలేదట. ఏఐ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో పవన్ గొంతుని మిగిలిన వెర్షన్లకి పెట్టేశారట. ఇదంతా దర్శకుడు రత్నం కృష్ణ అలియాస్ జ్యోతి కృష్ణ ఐడియా అని టాక్. ఒక్క పాట విషయంలోనే కాదు సినిమాలోని చాలా సన్నివేశాల విషయంలో ఏఐని వాడారట. జ్యోతి కృష్ణకి టెక్నికల్ నాలెడ్జ్ బాగా ఎక్కువ. అందుకే బడ్జెట్, టైం ఆదా చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారని వినికిడి.