KTR: కాళేశ్వరం వల్ల రాష్ట్రంలో వ్యవసాయ విస్తరణ పెరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
‘గత 15 నెలలుగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ నాయకులు మాట్లాడిందే మాట్లాడుతున్నారు. రాష్ట్రం దివాళ తీసిందని మాట్లాడే ఇలాంటి సీఎం ఎక్కడా లేరు. ఫిబ్రవరి 17న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణ స్టేట్ స్టాటిస్టకల్ అబ్‌స్ట్రాక్ట్ రిలీజ్ చేశారు. ఇందులో కొన్ని వాస్తవాలు చెప్పారు. ఇన్ని రోజులు సీఎం మాట్లాడిన అబద్దాలను తిప్పకొడుతూ ఈ అట్లాస్ లో వాస్తవాలు తెలియజేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మీ సహచరుడు భట్టి విక్రమార్క విడుదల చేసిన అట్లాస్ చదువుకోండి’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ALSO READ: Jobs in Indian Railways: శుభవార్త.. రైల్వేలో 32,438 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోనివారికి మరో అవకాశం..
‘డిప్యూట సీఎం భట్ట విక్రమార్క విడుదల చేసిన అబ్ స్ట్రాక్ట్ లో 2014లో తలసరి ఆదాయంలో తెలంగాణ పదో స్థానంలో ఉండగా.. 2022-23 నాటికి నెంబర్ వన్ స్థానంలో ఉందని పేర్కొంది. 2014లో రాష్ట్ర తలసరి ఆదాయం 1,24,00 ఉండగా.. ఇప్పుడు రాష్ట్ర తలసరి ఆదాయం 3,56,00 ఉంది. దేశ జీడీపీలో 5.1 శాతం తెలంగాణ నుంచే వస్తోంది. 2014లో రాష్ట్ర జీస్‌డీపీ రూ.5లక్షల కోట్లు ఉండగా.. ప్రస్తుతం రూ.15లక్షల కోట్లకు పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్, రైతుబంధు స్కీం వల్ల రైతులకు మేలు జరిగింది’ అని రిపోర్టులో ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.
కురుమ సోదరులు, యాదవ సోదరులకు గొర్రెల పంపిణీ స్కీం ప్రారంభించి దేశంలోనే గొర్రెల సంఖ్యలో ప్రథమ స్థానం సాధించాం. 2014 నుంచి 2023 వరకు విద్యుత్ సామర్థ్యం పెరిగింది. పదేళ్ల కింద ధాన్యం ఉత్పత్తి 68లక్షల టన్నులు ఉంటే ప్రస్తుతం 2.68లక్షల ఉత్పత్తికి పెరిగింది. పాల ఉత్పత్తి, మాంసం ఉత్పత్తితో రెట్టింపు వృద్ధితో తెలంగాణ అభివృద్ధి చెందిందని మీరు విడుదల చేసిన రిపోర్టులో ఉంది’ అని కేటీఆర్ తెలిపారు. ఇప్పటికైనా, సీఎం రేవంత్ రెడ్డి బుద్ధి తెచ్చుకోవాలి. పదే పదే కేసీఆర్ ను తిట్టడం మానేయాలి. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 22వేల కోట్లు మిత్తి మాత్రమే కట్టిందని చెప్పారు.
ALSO READ: Agniveer vayu jobs: అలెర్ట్.. వాయుసేనలో అగ్నివీర్ ఉద్యోగాలకు మరి కొన్ని గంటలే గడువు
కాంగ్రెస్ హయంలో తెలంగాణ పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ సర్కార్ రాబడి కంటే ఖర్చు ఎక్కువ పెడుతోంది. ఈ డబ్బు ఎక్కడికి పోతుంది?. ఎందుకు అప్పులు చేస్తున్నారు? రాష్ట్రంలో హైడ్రాతో రియల్ ఎస్టేట్ పడిపోయింది. కాళేశ్వరం ఎండ పెట్టడం వల్ల రాష్ట్రంలో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రంగా కాంగ్రెస్ ప్రభుత్వం మారుస్తోంది. కాంగ్రెస్ పార్టీది అబద్దాల పాలన. రాష్ట్రంలో ఆర్‌ఆర్ ట్యాక్స్ విధిస్తున్నారు. నేను చెప్పిన విషయాలు అబద్ధం అని చెబితే ఏం చేయడానికి అయిన నేను రెడీ’ అని మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు.