Tatkal Ticket Booking Rules 2025 | అకస్మాత్తుగా రైలు ప్రయాణాలు చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు అందరూ తత్కాల్ (తక్షణ) టికెట్ల కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తారు. కానీ తత్కాల్ టికెట్లు బుక్ చేసేకునే క్రమంలో ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొటున్నారు. ఎందుకంటే కన్ఫర్మ్ టిక్కెట్లు పొందడం అంత సులభం కాదు. అయితే దేశంలో ప్రతి రోజూ కోట్ల సంఖ్యలో ప్రయాణికులు రైలు ప్రయాణాన్నే ఎంచుకుంటారు. ఇందులో ఎక్కువ భాగం తత్కాల్ టికెట్లు బుక్ చేసేందుకే మొగ్గుచూపుతున్నారు. వారి సౌలభ్యం కోసమే భారతీయ రైల్వేలు తత్కాల్ టిక్కెట్ బుకింగ్ ప్రక్రియలో మార్పులు చేసింది.
ఈ మార్పులతో ప్రయాణికులు తత్కాల్ టిక్కెట్లు బుక్ చేసుకోవడంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికే ప్రాధాన్యం ఇచ్చింది. ప్రయాణికులు ఇకపై తక్షణ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి అదనపు సమయం వెచ్చించాల్సిన అవసరం లేదు. భారతీయ రైల్వేలు టికెట్ బుకింగ్ ఇకపై కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ ఆధారంగా ఉంటుందని ప్రకటించింది.
తత్కాల్ టిక్కెట్లు బుకింగ్‌లో వచ్చిన కొత్త మార్పులు
బుకింగ్ సమయం మారింది: ఇంతకుముందు తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే సమయం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యేది. ఇప్పుడు ఆ సమయాన్ని ఒక గంట ముందుకు మార్చారు. అంటే ఉదయం 10 గంటల నుంచే తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ప్రయాణికులు త్వరగా, సులభంగా టికెట్ చేసుకునేందుకే ఈ మార్పు చేసినట్లు ఇండియన్ రైల్వే తెలిపింది.
ఏసి, నాన్ ఏసి కోటా వేర్వేరు : తత్కాల్ బుకింగ్ ఇది వరకు ఏసి, నాన్ ఏసీ రెండూ ఒకటే కోటా కింద ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇందులో ఐఆర్‌సిటిసి మార్పులు చేసింది. ఏసి తత్కాల్ టికెట్ల కోటా వేరు, నాన్ ఏసీ తత్కాల్ టికెట్ బుకింగ్ వేరు. ఈ మార్పుతో ప్రయాణికులు తమకు ఇష్టమైన క్లాస్ లో సీట్లు ఎంచుకునేందుకు అవకాశాలు పెరిగాయి.
డైవమిక్ ప్రైసింగ్: 2025 తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రక్రియలో ఇప్పుడు డైనమిక్ ప్రైసింగ్ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ విధానంలో సీట్ల లభ్యతను బట్టి టికెట్ ధర మారుతూ ఉంటుంది. ఉదాహరణకు సీట్లు తగ్గిపోతూ ఉంటే టికెట్ ధర పెరుగుతూ ఉంటుంది. ఈ విధానం ఇది వరకు ప్రీమియం తత్కాల్ బుకింగ్ లో అందుబాటులో ఉండేది. ఇప్పుడు తత్కాల్ బుకింగ్ లో కూడా తీసుకువచ్చారు.
Also Read: కర్ణాటక నుంచి కుంభమేళాకు బైక్ పై తండ్రితో యువకుడి అడ్వెంచర్.. 3000 కిలోమీటర్ల జర్నీ!
టికెట్ బుకింగ్ కు ఆధార్ కార్డు తప్పనిసరి: తత్కాల్ టికెట్ బుకింగ్ చేసుకునే సమయంలో ఇప్పుడు ప్రయాణికుడి ఆధార్ కార్డు వివరాలు తప్పకుండా నమోదు చేయాలి. టికెట్ బుకింగ్ లో మోసాలను నివారించేందుకు ఈ నిబంధన తీసుకువచ్చినట్లు ఇండియన్ రైల్వేస్ తెలిపింది.
టికెట్ క్యాన్సిల్ చేస్తే ఎక్కువ రీఫండ్: Tatkal Ticket, Railway Ticket Booking, IRCTC, ఇప్పటివరకు బుక్ చేసుకున్న టికెట్లు ప్రయాణికులు రద్ద చేసుకుంటే కొత్త మొత్తం రీఫండ్ అయ్యేది. కానీ 2025 కొత్త రూల్స్ ప్రకారం.. టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే ఇకపై మునుపటి కంటే ఎక్కువ రీఫండ్ లభిస్తుంది. అయితే ఈ పెరిగిన రీఫండ్ ప్రయాణ సమయం కంటే 24 గంటల ముందే టికెట్ క్యాన్సిల్ చేసేవారికే లభిస్తుంది.
మొబైల్ యాప్, వెబ్ సైట్ సులభతరం: ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకునేందుకు రైల్వే స్టేషన్ లేదా ఇతర ఏజెంట్ల వద్దకు బదులు స్వయంగా ఆన్ లైన్ లో బుక్ చేసుకునేందుకు ఐఆర్‌సిటిసి ప్రోత్సహిస్తోంది. అందుకోసమే తమ మొబైల్ యాప్, వెబ్ సైట్ లలో బుక్ చేసుకునే ప్రక్రియను సులభతరం చేసింది.
టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు ప్రయాణికులు క్యాప్చా ఎంటర్ చేయడానికి చాలా సమయం పడుతుంది. కొత్త వ్యవస్థ క్యాప్చాను పూరించే ప్రక్రియను సులభతరం చేస్తుంది. తద్వారా కస్టమర్లు త్వరగా నమోదు చేసుకోవచ్చు. చెల్లింపులో కొన్ని సర్దుబాట్లు జరిగాయి. ప్రయాణికులు తమ టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు తమ సీట్లు ఎప్పుడు ఖాళీ అవుతాయో కూడా ముందే తెలుసుకోగలుగుతారు. టికెట్ బుకింగ్లో పారదర్శకతను తీసుకురావడానికి బ్రోకర్లు లేదా ఏజెంట్లను కూడా ఇది నిషేధిస్తుంది.
దీని వలన టికెట్ బుకింగ్ గతంలో కంటే వేగంగా, సులభంగా జరుగుతుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. కొత్త అప్డేట్ల కారణంగా IRCTC వెబ్సైట్ లేదా యాప్‌తో ఎటువంటి సమస్యలు లేవు. భారతీయ రైల్వేలు టికెట్ బుకింగ్ ప్రక్రియను మరింత పారదర్శకంగా చేయాలని ఈ కొత్త రూల్స్ తీసుకువచ్చినట్లు తెలిపారు.