E-Paper
Advertisement

ఎవరి కోసం, ఏ పైరవీల కోసం జీవోను ఆపారు? ప్రభుత్వాన్ని నిలదీసిన కవిత

ఎవరి కోసం, ఏ పైరవీల కోసం జీవోను ఆపారు? ప్రభుత్వాన్ని నిలదీసిన కవిత
Advertisement

Kavitha: స్వేచ్ఛ బ్యూరో: జీవో 25 రేషనలైజేషన్ తో సంబంధం లేకుండా 190 జీవో అమలు చేయాలని, అవసరమైతే సూపర్ న్యూమరీ ఉద్యోగాలు క్రియేట్ చేయాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయం నుంచి శుక్రవారం వీడియో రిలీజ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ నిర్ణయం తీసుకోవాలన్న గుండె ధైర్యం లేని పరిస్థితి కనిపిస్తోందన్నారు.

ఉద్యమకారుల విషయమైన ఉద్యోగుల విషయమైన సరే కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందన్నారు. 317 జీవో కు సంబంధించి దామోదర రాజనర్సింహా, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లతో కేబినెట్ సబ్ కమిటీ వేసిందని, ఆ కమిటీ 317 ను సవరిస్తూ మధ్యంతరంగా 190 జీవోను తెచ్చిందన్నారు. తొమ్మిది నెలలు గడిచిన సరే ఇప్పటి వరకు కూడా ఆ జీవోను అమలు చేయటం లేదని మండిపడ్డారు. ఎవరి కోసం, ఏ పైరవీల కోసం జీవోను అమలు చేయటం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులను స్థానికంగా బదిలీ చేస్తామని చెప్పి వారిని ఇబ్బంది పెడుతున్నారన్నారు.

Advertisement

317 జీవో బాధితుల్లో ఎక్కువగా టీచర్లతో పాటు అన్ని విభాగాల ఉద్యోగులు ఉన్నారన్నారు. వారిని స్వస్థలాలకు పంపిస్తామని, అవసరమైతే సూపర్ న్యూమరీ ఉద్యోగాలు క్రియేట్ చేస్తామని చెప్పారన్నారు. జీవో గడువు మూడేళ్లు మాత్రమే ఉంటే ఇప్పటి వరకు ఒక్కరినీ కూడా బదిలీ చేయలేదన్నారు. దీనిపై ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. వారికి అండగా తెలంగాణ రక్షణ సేన ఉంటుందని స్పష్టం చేశారు. ఉద్యోగులు, టీచర్ల హక్కుల కోసం వారి తరఫున మేము పోరాడుతామని తెలిపారు. వెంటనే 190 జీవో ను అమలు చేయాలని, లేదంటే తెలంగాణ రక్షణ సేన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Also Read: కేశినేని బ్రదర్స్ ‘ఈడీ’ వార్.. అన్న వేసిన ప్లాన్‌కు తమ్ముడు డిఫెన్స్‌లో పడతాడా?

Advertisement

Related News

పొంగులేటి సమాధానం చెప్పలేదు.. క్షమాపణ కోరలేదు: హరీశ్‌రావు

వంద రోజుల్లో అన్నాం.. ఏ వంద రోజులో చెప్పామా? బీఆర్‌ఎస్ మాక్ అసెంబ్లీలో తలసాని రచ్చ!

ఖమ్మం జిల్లాలో ఎల్‌నినో ఎఫెక్ట్.. పంట మార్చినా రైతన్నకు తప్పని కన్నీళ్లు!

తెలంగాణను దేశంలోనే క్రీడా శక్తిగా తీర్చిదిద్దుతాం: మంత్రి వాకిటి శ్రీహరి

అధికారంలో ఉంటేనే సభకు వస్తారా? BRS ఎమ్మెల్యేలపై కల్వకుంట్ల కవిత ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణలో గీజర్ అక్కర్లేని గ్రామం.. నిరంతరం వేడినీరు దొరికే ఊరు ఎక్కడో మీకు తెలుసా..?

గద్వాల్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు..!

గణేష్ మండపం పెడుతున్నారా? అయితే ఈ ఆన్‌లైన్ రూల్ తప్పనిసరి!

Big Stories

Advertisement
×