E-Paper
Advertisement

Younis Khan: నాకు కోచ్ ప‌ద‌వి ఇవ్వండి రా..పాకిస్తాన్ త‌ల‌రాత మార్చుతా

Younis Khan:  నాకు కోచ్ ప‌ద‌వి ఇవ్వండి రా..పాకిస్తాన్ త‌ల‌రాత మార్చుతా
Advertisement

Younis Khan:  టి20 ప్రపంచ కప్ 2026 (T20 World Cup 2026) నుంచి పాకిస్తాన్ (pakistan ) పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. ఆ టోర్నమెంట్లో గ్రూప్ దశలోనే పాకిస్తాన్ ఎలిమినేట్ కాగా.. ఆ తర్వాత పసికూన జట్ల చేతిలో ఓటమిపాలైంది. మొన్న బంగ్లాదేశ్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది పాకిస్తాన్. ఆస్ట్రేలియా C జట్టుపై విజయం తప్ప, పాకిస్తాన్ పీకిందేమీ లేదు. అయితే ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ జట్టుకు కొత్త కోచ్ ను తీసుకురావాలని PCB ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ మేరకు దరఖాస్తులు కూడా ఆహ్వానిస్తోంది. ముఖ్యంగా విదేశీ కోచ్ లను తీసుకురావాలన్న ముఖ్య లక్ష్యంతో పని చేస్తోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ యూనిస్ ఖాన్ (Younis Khan) కీలక ప్రకటన చేశారు. తనకు పాకిస్తాన్ కోచ్ పదవి ఇస్తే.. జట్టును అద్భుతంగా తయారుచేస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు. టీమిండియా కంటే బలమైన జట్టుగా తీర్చిదిద్దుతానని వెల్లడించారు. ఈసారికి తనకు అవకాశం ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు యూనిస్ ఖాన్. దీంతో యూనిస్ ఖాన్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read: Manav Sutar’s career changed with superstition: మూఢనమ్మకాల‌తో మాన‌వ్ సుతార్ కెరీర్ ఛేంజ్…6 వికెట్లు తీసి 38 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన‌ జ‌డేజా వార‌సుడు

నాకు కోచ్ ప‌ద‌వి ఇవ్వండి రా..పాకిస్తాన్ త‌ల‌రాత మార్చుతా

Advertisement

పాకిస్తాన్ హెడ్ కోచ్ పదవి కోసం PCB కసరత్తులు మొదలుపెట్టిన నేపథ్యంలో ఆ జట్టు మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్ కీలక ప్రకటన చేశారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు కోసం ప్రాణాలు ఇచ్చేందుకు అయినా సిద్ధమని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులలో పాకిస్తాన్ జట్టును కాపాడేది తాను ఒక్కడినేనని.. ఎవరి వల్ల కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈసారి దయ తలిచి తనకు కోచ్ గా అవకాశం ఇవ్వాలని కోరారు. అవకాశం ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకొని పాకిస్తాన్ క్రికెట్ జట్టును బలంగా తయారు చేస్తానని ప్రకటించారు. టీమిండియా కంటే 100 రేట్లు పాకిస్తాన్ క్రికెట్ జట్టును ప్రమాదకరంగా మార్చుతానని శపథం చేశారు. అల్లా మీద ఒట్టేసి చెబుతున్నా.. వచ్చే వరల్డ్ కప్ లో కూడా పాకిస్తాన్ ఛాంపియన్ అయ్యేలా తాను కృషి చేస్తానని వెల్లడించారు. దీంతో యూనిస్ ఖాన్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

పాక్ కోచ్ పదవి కోసం పరిశీలనలో ఇద్దరి పేర్లు

ప్రస్తుతం కోచ్ వేటలో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు… ఇద్దరినీ లైన్ లో పెట్టింది. అందులో యూనిస్ ఖాన్ కూడా ఉన్నారు. అతనితోపాటు మహమ్మద్ హఫీజ్ పేరు కూడా వినబడుతోంది. ఈ ఇద్దరినీ కోచ్ విభాగంలోకి తీసుకొని.. జట్టును డెవలప్ చేయాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే నిర్ణయం తీసుకుందట. అయితే మొహ్సిన్ న‌ఖ్వీ మాత్రం విదేశీ క్రికెటర్లను తీసుకోవాలని కుట్రలకు తెర లేపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే యూనిస్ ఖాన్ స్పందిస్తూ.. తనకు అవకాశం ఇవ్వాలని కోరారు.

Advertisement

Also Read: Litton Das ON T20 World Cup 2026 : పాకిస్తాన్ లో అడుగుపెట్టాలంటే గన్ మెన్లను పెట్టుకోవాల్సిందే..బంగ్లా క్రికెటర్ సంచలనం

Related News

పాకిస్తాన్ బౌల‌ర్ల‌కు జై షా బిగ్ షాక్‌..ఇక గ్రౌండ్ లో దిగ‌కుండా మాస్ట‌ర్ ప్లాన్

ఐపీఎల్ లో పైస‌లు త‌ప్ప ఏం లేదు…PSLలోనే రియ‌ల్ టాలెంట్

బాబ‌ర్ ఆజం పెద్ద సెల్ఫీష్ ప్లేయ‌ర్…అబ్బాస్, మ‌సూద్ ల‌ను తొక్కేసి మ‌రీ

వైభ‌వ్ త‌ల‌రాత మార్చిన జింబాబ్వే..ర్యాంకింగ్స్ లో 230 స్థానాలు ఎగబాకిన వైభవ్

దిగజారిన మ‌హిళా క్రికెట‌ర్లు..దీప్తి శర్మను గ‌ట్టిగా లాగి ముద్దు పెట్టిన అరుంధతి!

పాకిస్తాన్ ఓడిపోయేలా కుట్ర‌లు..పిచ్ లు మార్చారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

కావాల‌నే ర‌న్స్ ఇచ్చి వెస్టిండీస్ ఛీటింగ్…బాబ‌ర్ ఆజం సేన ఘోర ఓట‌మి

POKలో ఉద్రిక్త‌త‌లు…ఇండియా సాయం కోరిన పాక్ క్రికెట‌ర్ !

Big Stories

Advertisement
×