E-Paper
Advertisement

కమీషన్ల కక్కుర్తి వల్లే.. హైదరాబాద్‌లో దాహార్తి.. ప్రభుత్వంపై కవిత ఫైర్!

కమీషన్ల కక్కుర్తి వల్లే.. హైదరాబాద్‌లో దాహార్తి.. ప్రభుత్వంపై కవిత ఫైర్!
Advertisement

Kalvakuntla Kavitha: వర్షాకాలం మొదలైన తర్వాత కూడా హైదరాబాద్ లో నీటి కష్టాలు కొనసాగటం దారుణమని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. జూలై నెలలోనూ రోజుకు 10 వేల ట్యాంకర్లు బుక్ చేసుకునే పరిస్థితి ఉందంటే హైదరాబాద్ మహా నగరంలో తాగునీటికి ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. హైదరాబాద్ లో నీటి కష్టాలపై మంగళవారం ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.

హైదరాబాద్ లో నీటి కష్టాలను పరిష్కరించటంలో ప్రభుత్వం విఫలమైందని ఎక్స్ లో కవిత విమర్శించారు. నగర దాహార్తిని తీర్చేందుకు కొండ పోచమ్మ సాగర్ నుంచి ప్లాన్ చేసిన తాగు నీటి పథకాన్ని కాదని.. మల్లన్నసాగర్ నుంచి గోదావరి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు ఫేజ్ -2, ఫేజ్ – 3 ను చేపట్టారన్నారు. ఇది కేవలం ఓ సంస్థకు భారీ లాభాన్ని చేకూర్చి భారీ మొత్తంలో కమీషన్లు దండుకోవాలనే కుట్ర అని చెప్పారు. ప్రభుత్వ పెద్దల కమీషన్ల కక్కుర్తి కారణంగా మహా నగరంలో ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Also Read: భక్తులకు BSNL గుడ్ న్యూస్.. రూ.196కే ‘యాత్రా సిమ్’.. బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

నగరంలో నీటి కొరత లేకుండా చేసేందుకు ప్రభుత్వం వద్ద కనీసం ముందస్తు ప్రణాళిక లేదని కవిత అన్నారు. ఎల్ నినో ముప్పు పొంచి ఉందని హెచ్చరించినా ముందు జాగ్రత్తలు తీసుకోలేదని విమర్శించారు. ఇకనైనా హైదరాబాద్ మహా నగర ప్రజలకు నీటి కష్టాలు తీర్చే ప్రయత్నాలు మొదలు పెట్టాలని కోరారు. వెంటనే గోదావరి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Also Read: గూగుల్ మ్యాప్స్‌లో దాగున్న.. 5 మ్యాజికల్ ఫీచర్లు.. తెలిస్తే థ్రిల్ అవుతారు!

Related News

ఇంటర్,డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు..హైదరాబాద్‌లో 50 కంపెనీలతో భారీ జాబ్ మేళా

ఏపీ, తెలంగాణలో దసరా సెలవుల షెడ్యూల్ విడుదల!

హైదరాబాద్‌వాసులూ జాగ్రత్త.. రోడ్డుపై చెత్త వేస్తే కెమెరా కన్ను మీపైనే!

రోడ్ డస్ట్‌పై సర్కార్ మాస్టర్ ప్లాన్.. వాయు కాలుష్యానికి చెక్ పెట్టేలా బిగ్ స్టెప్!

రైతులకోసం తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. కొత్త సేవలు ప్రారంభం!

ఆపరేషన్ క్రాక్ డౌన్.. 101 మంది సైబర్ కేటుగాళ్ల అరెస్ట్!

మూసీ పునరుజ్జీవంలో మరో కీలక అడుగు.. ఓంకారేశ్వర ఆలయాభివృద్ధికి రూ.1,108 కోట్లు మంజూరు

పటేల్‌కు ఓట్లు పడితే నెహ్రూను ప్రధాని చేశారు.. ఓటు చోరీ కాంగ్రెస్‌దే: బండి సంజయ్

Big Stories

Advertisement
×