E-Paper
Advertisement

Huzurabad: స్వేచ్ఛ ఎఫెక్ట్.. హుజూరాబాద్‌లొ కదిలిన ఆర్టీసీ యంత్రాంగం..!

Huzurabad: స్వేచ్ఛ ఎఫెక్ట్.. హుజూరాబాద్‌లొ కదిలిన ఆర్టీసీ యంత్రాంగం..!
Advertisement

Huzurabad: స్వేచ్ఛ బ్యూరో: నియోజకవర్గ కేంద్రమైన హుజూరాబాద్‌లో గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన ఆర్టీసీ కార్గో సేవలను అధికారులు ఎట్టకేలకు మంగళవారం పునరుద్ధరించారు. హుజూరాబాద్‌ కార్గో కేంద్రం మూతపడటంపై ‘స్వేచ్ఛ’ పత్రికలో ప్రచురితమైన కథనానికి ఆర్టీసీ ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించారు. పత్రికా కథనంతో కదిలిన యంత్రాంగం తక్షణ చర్యలు చేపట్టి, నిలిచిపోయిన సేవలను నేటి నుంచే ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది.

వ్యాపారులు, ప్రజలకు తీరిన కష్టాలు..

వరంగల్ – కరీంనగర్ ప్రధాన రహదారిపై ఉన్న హుజూరాబాద్ పట్టణం నిరంతరం వ్యాపార లావాదేవీలతో రద్దీగా ఉంటుంది. ఇక్కడి కార్గో కేంద్రం మూతపడటంతో స్థానిక వ్యాపారులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తమ పార్సిళ్లు, నిత్యావసర వస్తువుల రవాణా కోసం గత కొన్ని నెలలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నేడు కార్గో సేవలు మళ్లీ ప్రారంభం కావడంతో స్థానిక వ్యాపార వర్గాలు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Also read: Finance Delay: రాష్టంలో వైద్య విద్యార్థుల భవిష్యత్తు అంధకారం.. క్లాసులు ప్రాక్టికల్స్ బంద్.. కారణం ఇదే!

అధికారుల చొరవపై అభినందనలు

హుజూరాబాద్‌లో కార్గో సేవలను వెంటనే పునరుద్ధరించాలని కరీంనగర్ జిల్లా ఆర్టీవీ అధ్యక్షుడు మిట్టపల్లి సురేందర్ ఆదివారం నాడే మీడియా వేదికగా డిమాండ్ చేశారు. ‘స్వేచ్ఛ’ పత్రిక కథనం, ప్రజా డిమాండ్‌పై సానుకూలంగా స్పందించి, త్వరితగతిన కార్గో సేవలను పునరుద్ధరించినందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు ఇలాగే బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.

Advertisement

Also Read: ఏపీ ప్రభుత్వంలో ఏఐ విప్లవం.. ఇకపై వాట్సాప్‌లోనే 1,126 రకాల ప్రభుత్వ సేవలు

Related News

మైనార్టీ విద్యార్థులకు అదిరిపోయే ఆఫర్.. జపాన్, జర్మనీల్లో ఉచితంగా ఉన్నత చదువులు!

మద్యానికి బానిసై.. భూమి కోసం కన్నతండ్రిని బండరాయితో బాది చంపిన కొడుకు!

ఫార్మా కంపెనీలకు బిగ్ షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఇకపై ఆ పప్పులు ఉడకవు!

ఇంటర్,డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు..హైదరాబాద్‌లో 50 కంపెనీలతో భారీ జాబ్ మేళా

ఏపీ, తెలంగాణలో దసరా సెలవుల షెడ్యూల్ విడుదల!

హైదరాబాద్‌వాసులూ జాగ్రత్త.. రోడ్డుపై చెత్త వేస్తే కెమెరా కన్ను మీపైనే!

రోడ్ డస్ట్‌పై సర్కార్ మాస్టర్ ప్లాన్.. వాయు కాలుష్యానికి చెక్ పెట్టేలా బిగ్ స్టెప్!

రైతులకోసం తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. కొత్త సేవలు ప్రారంభం!

Big Stories

Advertisement
×