Kamareddy: ఓ తల్లి ఎంతటి నిస్సహాయ పరిస్థితుల్లోనైనా తన పిల్లల కోసం బతుకుదెరువు చేస్తుంది. కానీ కామారెడ్డి జిల్లాలోని ఈ తల్లి చేసిన పనితో అందరూ అవాక్కవుతున్నారు. ప్రియుడికి ఆటో కొనిచ్చేందుకు.. తన కన్నబిడ్డను 50 వేల రూపాయలకు విక్రయించిందంటే నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు. కానీ ఇదే నిజం. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళితే..
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పరిధిలో ఈ ఘోరమైన ఘటన వెలుగుచూసింది. లావణ్య అనే మహిళకు 5 సంవత్సరాల కుమారుడు నిఖిల్ ఉన్నాడు. భర్త మృతి తర్వాత ఇద్దరు పిల్లలతో జీవితం నెట్టుకొస్తున్న లావణ్యకు, సాయిలు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అది సహజీవనంగా మారింది. అయితే సాయిలుకు ఇప్పటికే ఒక భార్య ఉండగా, ఆమె ఈ సంబంధంపై అభ్యంతరం తెలుపుతూ విడిపోయింది. దీంతో లావణ్యతో కలిసి జీవితం కొనసాగించాడు. జీవనోపాధి కోసం ఆటో కొనాలనుకున్న సాయిలు, లావణ్యను తన కొడుకును అమ్ముకోవాలని ఒప్పించాడు.
ఒక బాలుడు.. మూడు చేతులు మారాడు
తన కన్న కొడుకును లావణ్య పర్మళ్ల గ్రామానికి చెందిన నసీమా అనే మహిళకు 50 వేల రూపాయలకు విక్రయించింది. నసీమా, బాలుడిని తన సోదరి షాహిదాకు అప్పగించింది. షాహిదా, మరో వ్యక్తి శేఖర్‌కు ఆ బాలుడిని లక్ష రూపాయలకు విక్రయించింది. ఈ మారుమూల ప్రాంతాల్లో బాలుడి ట్రాన్సఫర్ అంతవరకూ ఎవరికీ తెలియలేదు.
పరిస్థితిని గమనించిన చైల్డ్ వెల్ఫేర్ అధికారులు..
ఈ సమాచారం బయటకు పొక్కింది. బాలుని పరిస్థితిని గుర్తించిన బాలల సంక్షేమ అధికారులు వెంటనే రంగంలోకి దిగి, లింగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టి బాలుడిని రక్షణలోకి తీసుకుని కామారెడ్డి బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు.
కేసులు నమోదు
ఈ ఘటనలో బాలుడి తల్లి లావణ్య, సహజీవనం చేసిన సాయిలు, నసీమా, షాహిదా, శేఖర్‌లపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ప్రస్తుతం వారిని జైలుకు తరలించారు. ఈ ఘటన సమాజంలో మానవీయ విలువలు ఎక్కడికెళ్లాయి? అన్న సందేహాన్ని కలిగిస్తోంది. ఆర్థిక అవసరాల పేరుతో పాశవికంగా మానవత్వాన్ని విక్రయించడమే గాక, చిన్నారి బాలుడి జీవితంను నాశనం చేసేందుకు సమాజం చింతించాల్సిన అవసరం ఉంది.
Also Read: Case on Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్.. తెలంగాణలో కేసు నమోదు
ఎలాంటి తల్లివి తల్లి నువ్వు..
అమ్మ అంటే కాయకష్టం చేసుకొని బిడ్డ బాగు కొరకు ఎంత కష్టాన్నైనా ఓపికగా భరించేది తల్లి. అలాంటి తల్లి ఏకంగా ప్రియుడి కోసం కుమారుడిని అమ్మే పరిస్థితికి వచ్చిందంటే, ఆమె అమ్మతనం ఏమైపోయిందన్న ఆశ్చర్యం కలగకమానదు. ఈ విషయం స్థానికంగా వెలుగులోకి రాగా, ఎలాంటి తల్లివి తల్లి నువ్వు అంటూ స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.