Operation Sindoor : ఉగ్రదాడులకు తిరిగి దాడులతోనే సమాధానం చెప్పింది భారత్. ఎక్కడా సామాన్య పౌరులపై అటాక్ చేయలేదు.. పాక్ ఆర్మీ మిలటరీ ఎస్టాబ్లిష్‌మెంట్స్ జోలికి వెళ్లలేదు. ఈ దాడులను సాకుగా చూపి పాకిస్థాన్ ఏదైనా కొత్త ఎత్తుగడలు వేసినా.. దాడులు చేసినా.. మీ బెండు తీసేందుకు రెడీగా ఉన్నామంటోంది ఇండియన్ ఆర్మీ. ఇప్పటికే LOCలో సామాన్య గ్రామాలపై అక్కడక్కడ తమ ప్రతాపం చూపుతున్న పాక్ ఆర్మీకి దిమ్మతిరిగే వార్నింగ్ ఇచ్చింది ఇండియన్ ఆర్మీ.
మీ ఇంటికొచ్చి చంపేస్తాం..
మీరు లైన్ క్రాస్ చేస్తే ఏం చేయాలో మాకు తెలుసు.. మేం సిద్ధంగా ఉన్నామని చెప్పారు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. పాక్ తోక జాడితే బుద్ధి చెప్పేందుకు ఫుల్‌గా ప్రిపైర్ ఉన్నామన్నారు. నిజానికి ఈ విషయం ఇప్పటికే పాకిస్థాన్ ఆర్మీకి అర్థమై ఉంటుంది. ఎందుకంటే దాడులు కేవలం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో మాత్రమే జరగలేదు. నేరుగా పాకిస్తాన్‌లో కూడా జరిగాయి. మొత్తం 9 స్థావరాలపై దాడులు చేస్తే.. అందులో నాలుగు పాకిస్తాన్‌లోనే ఉన్నాయి. దీన్ని బట్టి పాక్‌లోని ఏ టార్గెట్ కూడా తమ నుంచి తప్పించుకోలేదని తేల్చి చెప్పినట్టైంది. దాయాది దేశంపై దాడి చేయటం తమకు చాలా ఈజీ పని అని.. ఎవరూ అడ్డుకోలేరని బాగా అర్థమయ్యేలా చాటిచెప్పింది.
పాక్ ఆయువుపట్టుపై అటాక్
పాకిస్తాన్‌లోని బవహల్పూర్ ఉగ్ర క్యాంప్‌పై దాడి జరుగుతుందని ఆ దేశం కలలో కూడా ఊహించి ఉండదు. జైషే, లష్కరే మూకలకు చెందిన ప్రధాన కార్యాలయాలు అక్కడే ఉన్నాయి. అన్నిటికీ మించి పాక్ ఆర్మీ రెజిమెంటర్ సెంటర్ కూడా బవహల్పూర్‌లోనే ఉంది. లెటెస్ట్‌గా ఈ సెంటర్‌లో రాడార్‌లను మోహరించారన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇవేవీ కూడా భారత దాడులను అడ్డుకోలేకపోయాయి. అదీ మన ఆర్మీ సత్తా.
మరో 12 ఉగ్ర క్యాంపులపై అటాక్?
ఇండియన్ ఇంటెలిజెన్స్ రిపోర్టుల ప్రకారం మొత్తం 21 ఉగ్ర స్థావరాలను గుర్తించినట్టు తెలుస్తోంది. బుధవారం తెల్లవారుజామున కేవలం 9 టెర్రర్ క్యాంపులపైనే దాడులు జరిగాయి. మిగతా 12 స్థావరాలను కూడా భారత ఆర్మీ టార్గెట్ చేసుకున్నట్టు సమాచారం. వాటిపై భారత్ ఎప్పుడు దాడి చేస్తుందో అని వణికిపోతున్నారు ఉగ్రవాదులు. అంతేకాదు దేశంలో కూడా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. సెలవుల్లో ఉన్న పారామిలటరీ బలగాలను వెంటనే తిరిగి డ్యూటీలో చేరాలని ఆదేశించారు. భారత్-పాక్ సరిహద్దుల్లో IAF డ్రిల్స్ కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తంగా చూస్తే.. ఇంకా ఏదో పెద్దగానే జరగబోతుందని తెలుస్తోంది.
Also Read : పాక్‌ను దెబ్బకొట్టిన చైనా.. అలా ఇండియాకు సపోర్ట్?
పిక్చర్ అబీ బాకీ హై..
సినిమా అప్పుడే అయిపోలేదు.. ఇంకా చాలా ఉంది అంటున్నారు ఇండియన్ ఆర్మీ మాజీ ఉన్నతాధికారులు. రిటైర్ట్ ఇండియన్ ఆర్మీ మాజీ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే అయితే అబీ పిక్చర్ బాకీ హై.. అంటూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ఆయన ట్వీట్‌ను బట్టి చూస్తే భారత్ ఇంకా ఏదో పెద్దగానే ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. ఉగ్రవాదులకు రాసే రక్త చరిత్రలో ఇది పార్ట్ 1 అని మాత్రమే అనిపిస్తోంది.
లంకా దహనం చేసినట్టే..
హనుమాన్ లంకా దహనం చేసినట్లే.. మన సైన్యం ఉగ్రవాదులపై దాడి చేసిందన్నారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌కు గట్టి సమాధానం ఇచ్చామని చెప్పారు. ఉగ్రమూకలను సైన్యం వెంటాడి మట్టుబెట్టిందన్నారు. పౌరుల ప్రాణాలకు ఎలాంటి నష్టం లేకుండా ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసినట్లు చెప్పారు. రైట్ టు రెస్పాండ్ హక్కును వాడుకున్నామని తెలిపారు. అమాయకులను చంపిన వారినే మట్టుబెట్టామన్నారు రాజ్‌నాథ్ సింగ్. మోడీ నేతృత్వంలో భారత్ సగర్వంగా తలెత్తుకుందన్నారు. ఉగ్రవాదుల స్థైర్యాన్ని బలంగా దెబ్బతీశామన్నారు. త్రివిధ దళాలకు దేశం మొత్తం సెల్యూల్ చేస్తోందన్నారు రాజ్‌నాథ్. మన లక్ష్యం పాక్ పౌరులు కాదన్న ఆయన…దేశ భద్రతకు భంగం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
Also Read : ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్ ఆర్మీ.. అడ్డంగా దొరికిపోయారు..
ఆర్మీకి ఫుల్ సపోర్ట్
దేశ రక్షణ విషయంలో అందరూ ఐక్యంగా ఉండాలన్నారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. సైనికులు తీసుకునే ప్రతి నిర్ణయానికి కాంగ్రెస్ మద్దతు ఉంటుందని చెప్పారు. ఢిల్లీలో భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేతల కీలక భేటీ జరిగింది. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సహా ముఖ్య నేతలంతా హాజరయ్యారు. మరోవైపు ఆపరేషన్ సిందూర్‌పై గురువారం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చిన కేంద్రం. ఉదయం 11 గంటలకు పార్లమెంటులో అఖిలపక్ష సమావేశం జరగనుంది.