E-Paper
Advertisement

తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు షాకింగ్ న్యూస్..?

తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు షాకింగ్ న్యూస్..?
Advertisement

BRS Joinings: ముధోల్ నియోజకవర్గానికి చెందిన 11 మంది సర్పంచులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో, పార్టీ సీనియర్ నాయకురాలు రమాదేవి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. కేటీఆర్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇచ్చారు.

బీజేపీ నుంచి..

తాండూర్, కుభీర్ మండలాలకు చెందిన సర్పంచుల్లో ఎనిమిది మంది బీజేపీ నుంచి, ఒకరు కాంగ్రెస్ నుంచి, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందిన వారు ఉన్నారు. ఉపసర్పంచులంతా బీజేపీకి చెందిన వారే. మాజీ ప్రజాప్రతినిధుల్లో గతంలో కాంగ్రెస్‌లో పనిచేసిన నాయకులు కూడా బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ.. ముధోల్ నియోజకవర్గంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎంపీ ఉన్నప్పటికీ అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదని విమర్శించారు. కనీసం ఒక్క అభివృద్ధి పనికి కూడా పునాది వేసిన దాఖలాలు లేవని, కేవలం ప్రారంభోత్సవాలకే పరిమితమయ్యారని అన్నారు.

అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ..

Advertisement

లోకేశ్వరం, తాండూర్ మండలాలను కరువు మండలాలుగా ప్రకటించకపోవడం పట్ల ప్రజల్లో తీవ్ర ఆందోళన, అసంతృప్తి నెలకొందని పేర్కొన్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో నీటి సరఫరా, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం వంటి కనీస సదుపాయాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, కేసీఆర్ హయాంలో సంస్థ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని విమర్శించారు. ముధోల్ నియోజకవర్గ అభివృద్ధికి కేసీఆర్ హయాంలోనే ప్రాధాన్యత లభించిందని, ప్రస్తుత కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదనిఅన్నారు. తాజా చేరికలతో నియోజకవర్గంలో బీఆర్ఎస్ మరింత బలోపేతమైందని ఆమె పేర్కొన్నారు.

Aklso read: పనిపాటా లేకే కేటీఆర్ చిట్‌చాట్‌ల పేరుతో అబద్ధాలు చెబుతున్నారు: ఆది శ్రీనివాస్

Tags

Related News

మారనున్న మల్కన్‌గిరి-భద్రాచలం రైల్వే లైన్.. కొత్తగా ఈ రూట్లో వచ్చే చాన్స్?

మందు బాబులకు గుండె పగిలే వార్త.. చీప్ లిక్కర్‌తో ఖరీదైన బ్రాండ్లు తయారీ!

ముద్రా రుణాల పేరుతో భారీ సైబర్ మోసం

పనిపాటా లేకే కేటీఆర్ చిట్‌చాట్‌ల పేరుతో అబద్ధాలు చెబుతున్నారు: ఆది శ్రీనివాస్

తెలంగాణ పోలీసులకు భారీ గుడ్ న్యూస్.. త్వరలో ప్రమోషన్లు!

ఉత్తరాఖండ్, జార్ఖండ్ ఆవిర్భావ వేడుకల్లో.. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా కీలక వ్యాఖ్యలు!

ఖానాపూర్ పోలీస్ స్టేషన్‌లో దారుణం.. దొంగతనం జరిగినా కేసు నమోదు చేయని ఎస్సై!

Big Stories

Advertisement
×