Big Stories

Aroori Ramesh: కావ్య ‘కుల’కలం.. కడియం కావ్యపై ఆరూరి రమేష్ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

ఇవే ప్రశ్నలు ప్రస్తుతం ప్రజల మెదళ్లలో తిరుగుతున్నాయి. మరి దీనికి కడియం కుటుంబ సభ్యులు చెబుతున్నదేంటి? ఇదీ కడియం శ్రీహరి చెబుతున్న మాట. మరి కడియం నిజంగా నిజాలే చెబుతున్నారా? ఇలా మతాంతర వివాహాల విషయంలో రాజ్యాంగం ఏం చెబుతోంది? ఒక్కసారి కాస్త డీప్‌గా వెళితే.. వేరే మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నంత మాత్రానా కులం మారుతుందా? నో.. అస్సలు మారదు.. ఈ విషయం చెప్పేది మేము కాదు.. సుప్రీంకోర్టు ధర్మాసనం.. 2017లో ఐదుగురు జడ్జిల ధర్మాసనం ఓ తీర్పు ఇచ్చింది. మతం మారినంత మాత్రానా కులం మారదని తేల్చి చెప్పింది. పిల్లలకు తండ్రి కులమే వస్తుంది. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన క్లారిటీ.. ఇదొక్కటే కాదు.. 2021లో మద్రాస్‌ హైకోర్టు కూడా ఇలాంటి తీర్పునే ఇచ్చింది. ఒక మతం నుంచి మరో మతంలోకి మారినా.. కులం మాత్రం మారదని తేల్చి చెప్పింది హైకోర్టు ధర్మాసనం.

- Advertisement -

Also Read: స్వ(వి)పక్షం.. వైసీపీలో రగులుతున్న మంటలు

అంతేకాదు కడియం కావ్య స్పెషల్‌ మ్యారేజ్‌ యాక్ట్ ప్రకారం వివాహం చేసుకున్నారు.. దీనిని బట్టి పెళ్లి రెండు మతాలకు చెందిన వ్యక్తుల మధ్య జరిగినా.. ఎవరి మతాలను వారు కొనసాగించుకోవచ్చు.. సో రాజ్యాంగం ప్రకారం కావ్యా ఎస్సీనే అని తెలుస్తుంది. ఇది టెక్నికల్ అంశం.. ఇప్పుడు రాజకీయానికి వద్దాం.. ఎన్నికల నోటిఫికేషన్‌కు టైమ్ దగ్గర పడుతుండటంతో ప్రస్తుతం డైలాగ్‌ వార్‌కు తెరలేపినట్టు కనిపిస్తోంది.. నిజానికి ఆరూరి రమేష్‌, కడియం శ్రీహరి మొన్నటి వరకు ఒకే పార్టీలో ఉన్నారు.. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది. కానీ ఎన్నికల తర్వాత కథ మారింది. వేరు వేరు పార్టీల్లో చేరారు ఇద్దరు నేతలు.. ఇద్దరికి ఒకరి రాజకీయ జీవితాలపై ఒకరికి క్లారిటీ ఉంది. అందుకే ఇప్పుడు ఇద్దరి పర్సనల్ విషయాలు రాజకీయ రచ్చకు కారణమవుతున్నాయి.

అందుకే కావ్య వ్యక్తిగత విషయాలను హైలెట్ చేస్తున్నారు రమేష్.. కావ్య మతాంతర వివాహాన్ని హైలెట్ చేస్తున్నారు. కావ్య నజీరుల్లా కావాలా? ఆరూరి రమేష్‌ కావాలా? అని పిలుపునిస్తున్నారు. అయితే ఇంత అర్జెంటుగా రమేష్‌ ముస్లిం కార్డును వాడటంలో బీజేపీ పాత్ర ఉన్నట్టు కనిపిస్తోంది. అంతేకాదు నాన్ లోకల్ అనే అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. ఈ రెండు విషయాలను బేస్‌ చేసుకొనే.. ప్రస్తుతం బీజేపీ ప్రచారం చేయడం ఖాయమని తేలిపోయింది.అయితే ఈ అంశంతో అసలు ఎన్నికల ప్రచార ముఖచిత్రం మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇకపై ఎన్నికలు గురించి మాట్లాడిన ప్రతిసారి దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కావ్య క్లారిటీతో సంబంధం లేకుండా నాన్‌లోకల్ అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ రెడీ అయ్యింది. అయితే ఆరూరి రమేష్ తెరపైకి తీసుకొచ్చిన ఈ కులం కార్డ్ వర్కౌట్ అవుతుందా? ప్రజల్లోకి ఈ విషయాలు ఏ విధంగా వెళతాయి? కడియం ఫ్యామిలీ ఇస్తున్న క్లారిటీతో ప్రజలు సాటిస్‌ఫై అవుతారా? అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News