E-Paper
Advertisement

‘మేము కాపులం’ టైటిల్ చుట్టూ ముదురుతున్న వివాదం.. గెటప్ శ్రీనుపై నెటిజన్ల ఫైర్!

‘మేము కాపులం’ టైటిల్ చుట్టూ ముదురుతున్న వివాదం.. గెటప్ శ్రీనుపై నెటిజన్ల ఫైర్!
Advertisement

Getup Srinu Controversy: గెటప్ శ్రీను…తనదైన గెటప్ లతో అంతకు మించిన పంచులతో ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించే ఈ క్రేజీ కమెడియన్ ఇపుడు మీడియాలో హాట్ టాపిక్ అయాడు. యస్ ..ఎప్పుడు కూల్ గా కామెడీ చేసే గెటప్ శ్రీను ఒక్కసారిగా సీరియస్ అయిపోయి మైక్ కిందేసి, చైర్ నెట్టేసి నానా రభస చేసేశాడు మరి. ఇంతకీ గెటప్ శ్రీను చేసిన ఆ రచ్చ ఏంటో దాని వెనుకున్న కథాకమామీషు ఏంటో చదివేయండి.

‘మేము కాపులం’ప్రమోషన్స్ లో భాగంగా

Advertisement

మ్యాటర్ లోకి ఎంట్రీ ఇస్తే అది యాంకర్ జాఫర్ ఇంటర్వ్యూ .ఎదురుగా నాగబాబుతో కలిసి గెటప్ శ్రీను చేస్తున్నతన అప్ కమింగ్ వెబ్ సిరీస్ ‘మేము కాపులం’ప్రమోషన్స్ లో భాగంగా కూర్చున్నాడు,అప్పటిదాకా సరదా సరదాగా సాగిపోయింది ఇంటర్వ్యూ.అలానే సాగిపోతే అసలు మజా ఏముంది .అక్కడే మొదలైంది అసలు సినిమా.

ఈ సిరీస్‌కు “మేము కాపులం”అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు శ్రీను అలా చెప్పాడో లేదో రెచ్చిపోయాడు జాఫర్.ఒక సినిమా టైటిల్ కోసం ఇలా కులాలని వాడటం ఏంటి అంటూ ప్రశ్నించాడు.అంతటితో ఆగకుండా “కేవలం కాంట్రవర్సీ క్రియేట్ చేసి పబ్లిసిటీ సంపాదించడానికే ఇలాంటి టైటిల్స్ పెడతారా?”అంటూ గెటప్ శ్రీను ని ప్రశ్నలతో ఉక్కిరిబికిరి చేసేశాడు.పై పెచ్చు దీనికి వర్మ సినిమాలని ఎగ్జాంపుల్ గా మిక్స్ చేయడంతో కాసింత అసహనానికి లోనయ్యాడు గెటప్ శ్రీను.

Advertisement

also read: అమీర్ ఖాన్ ‘డెత్ నోట్’ రహస్యం…విమానం ఎక్కేముందు ఆ దర్శకుడికి సీక్రెట్ మెసేజ్..

క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ

కోపం వస్తున్నప్పటికీ కంట్రోల్ చేసుకుంటూ టైటిల్ అనేది కథకు తగ్గట్టుగానే ఉంటుందని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ జాఫర్ మాత్రం అస్సలు తగ్గలేదు కదా మరింత దూకుడు పెంచాడు.ఇక జాఫర్ ప్రశ్నల వాన ఎక్కువైపోయేసరికి ఆగబట్టలేక బరెస్ట్ అయిపోయాడు గెటప్ శ్రీను.ఈ క్రమంలోనే కంట్రోల్ తప్పిపోయి “కథ చూడకుండా, క్యారెక్టరైజేషన్ వినకుండా కేవలం టైటిల్ పట్టుకుని కులం అంటగడతారా?” తెగ ఫైర్ అయిపోయాడు.ఇక ఇలాగే ఇద్దరి మధ్య డిబేట్ మరింత ముదిరిపోగా అదే సమయంలో గెటప్ శ్రీను ఒక్కసారిగా  కుర్చీని బలంగా వెనక్కి తోసేసి.. “తొక్కలో ఇంటర్వ్యూ.. మీ పిచ్చి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు”అంటూ కోపంగా వెళ్ళిపోయాడు.టోటల్ గా ఇదీ అక్కడ జరిగిన రచ్చ.

ప్రమోషన్ స్టంటా? లేక నిజంగానే జరిగిందా?

నిజానికి ఈ మధ్యకాలంలో ఇలాంటి స్క్రిప్టెడ్ డ్రామాలు ఇంటర్వ్యూలలో బాగా పెరిగిపోయాయ్. పై పెచ్చు అవి ట్రెండ్ అయిపోయాయ్ కూడా. అందుకే సిరీస్ కి మైలేజ్ రావడం కోసమే ఇలా కావాలని స్క్రిప్టెడ్ లో భాగంగా చేశారని కొంతమంది అంటుంటే కులం పేరుతో టైటిల్ పెట్టి కాసులు కొల్లగొట్టడం ఎంటని, జాఫర్ సరైన ప్రశ్నలే అడిగారంటూ మరికొంత మంది కామెంట్ చేస్తున్నారు.

పబ్లిసిటీ పిచ్చి పరాకాష్టకు చేరిందా?

మరి నిజంగానే గొడవ జరిగిందా లేక ఇది కేవలం వ్యూస్ కోసమేనా అన్నది పక్కన పెడితే.. ‘మేము కాపులం’ అనే పేరు మాత్రం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోతోంది. ఈ ఇష్యూపై అటు మేము కాపులం టీమ్ స్పందిస్తే కాని అసలు విషయం తెలిసేలా లేదు.

also read :రెబలోడి ఫ్యాన్స్ కి పెద్ద షాక్ .. సీక్వెల్ లో ‘కల్కి’ ఉండడా?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×