E-Paper
Advertisement

స్పీడు పెంచిన కల్వకుంట్ల కవిత.. కొత్త పార్టీతో అసలు ప్లాన్ అదేనా..?

స్పీడు పెంచిన కల్వకుంట్ల కవిత.. కొత్త పార్టీతో అసలు ప్లాన్ అదేనా..?
Advertisement

Kalvakuntla Kavitha: స్వేచ్ఛ బ్యూరో: పార్టీ ప్రకటన పనులు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పీడప్ చేసింది. ఈ నెల 25న ఉదయం 10 గంటలకు మంచి ముహూర్తం ఉండటంతో ఆ సమయానికే పార్టీ ప్రకటించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్దం చేస్తుంది. ఇప్పటికే జాగృతి నేతలకు దిశానిర్దేశం చేయడంతో పాటు అన్ని జిల్లాల నేతలకు సైతం సమయానికి రావాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ మీటింగ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది.

ప్రజాసంఘాలతో భేటీ..

తెలంగాణ ఐడియాలజీతో ముందుకు వెళ్లేలా ప్రణాళికలు సిద్దం చేసింది. ఇప్పటికే సుమారు 50 కమిటీలతో క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యాయనం చేయించింది. నివేదిక రూపంలో కమిటీలు సైతం కవితకు అందజేశారు. అందులోని అంశాలన్నింటిని క్రోడీకరించి ఎజెండాను సైతం సిద్ధం చేసినట్లు సమాచారం. మరోవైపు భావసారుప్యత గల పార్టీలు, ఉద్యమకారుల సంఘాలు, ఉద్యమ సంఘాలు, ప్రజాసంఘాలతోనూ భేటీ అవుతూ వారి మద్దతు సైతం కోరుతున్నారు. ఇప్పటికే పలు సంఘాలతో చర్చలు జరిపారు. కొని సంఘాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంఘీభావం తెలిపాయి.

Advertisement

Also Read: మహిళా రిజర్వేషన్ల ముసుగులో డీలిమిటేషన్ బిల్లు.. కేంద్రం తీరుపై మంత్రి సీతక్క ఫైర్

పార్టీ మీటింగ్ సక్సెస్ కోసం..

పార్టీ ప్రకటనకు రావాలని తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఆహ్వాన లేఖలు అందజేస్తున్నట్లు జాగృతి నేతలు తెలిపారు. ఉద్యమకారులకు సైతం సమాచారం ఇచ్చి ఆహ్వానించడమే గాకుండా వారి మద్దతు సైతం కోరుతున్నట్లు సమాచారం. రాజకీయ వేత్తలతోనే అభిప్రాయాలు తీసుకొని అందుకు అనుగుణంగానే పార్టీ జెండా, ఎజెండాను రూపొందించినట్లు సమాచారం. జెండాలో బ్లూ ఉంటుందని ఇప్పటికే కవిత హింట్ సైతం ఇచ్చారు. పార్టీ మీటింగ్ సక్సెస్ కోసం 20 కమిటీలను సైతం నియమించారు. ప్రచారకమిటీ, సాంస్కృతిక కమిటీ, సోషల్ మీడియా కమిటీ, ప్రోగ్రాం కమిటీ, పోలీస్ కోఆర్డినేషన్ కమిటీ, ఫుడ్ కమిటీ, హెల్త్ కమిటీ ఇలా కమిటీలను నియమించారు.

ఏవరిని పిలవకుండా..

Advertisement

అయితే ర్యాలీగా కవిత రాష్ట్ర జాగృతి కార్యాలయం నుంచి గన్ పార్కులోని అమరవీరుల స్థూపం వద్దకు చేరుకొని నివాళులర్పించనున్నారు. అక్కడి నుంచి నేరుగా అద్వయ కన్వేషన్ కు వెళ్లనున్నారు. అక్కడి పార్టీని ప్రకటించిన తర్వాత తిరిగి భారీ ర్యాలీతో రానున్నారు. వచ్చే టప్పుడు తెలుగుతల్లి ప్లై ఓవర్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించనున్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, వారి సమస్యలే ఎజెండాగా ముందుకు సాగనున్నట్లు ఇప్పటికే కవిత ప్రకటించారు. అయితే పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి మాత్రం ఎవరిని ఆహ్వానించకుండా కేవలం ఆమె మాత్రమే ప్రకటించబోతున్నారు. పార్టీ ఎజెండాను వివరించి ..ప్రజాసమస్యలపై పోరుబాట చేపట్టబోతున్నట్లు సమాచారం. జనజాగృతి యాత్రను సైతం త్వరలోనే తిరిగి ప్రారంభించబోతున్నట్లు సమాచారం. అంతేగాకుండా సింగరేణిపైనా ప్రత్యేకఫోకస్ పెట్టబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏది ఏమైనా కవిత నూతన పార్టీ ప్రకటన పనులను మాత్రం వేగవంతంచేశారు.కవిత పార్టీ ఎజెండా ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు ఆసక్తి నెలకొంది. రాజకీయాలతో పాటు ప్రజల్లోనూ చర్చఊపందుకుంది.

Also Read: బీజేపీతో పొత్తు పెట్టుకుంటే భవిష్యత్తు ప్రశ్నార్థకమే.. చంద్రబాబు పరిస్థితి కూడా అంతే, సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Related News

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Hyderabad: పైరవీలకు చెక్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, ముఖ్యనేతలకు కీలక సూచనలు

వారెవ్వా గోల్కొండ! భక్తులతో కిక్కిరిసిన కోట.. అధికారుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?

Big Stories

Advertisement
×