E-Paper
Advertisement

కవిత ఊహించని స్కెచ్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలతో రహస్య మంతనాలు?

కవిత ఊహించని స్కెచ్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలతో రహస్య మంతనాలు?
Advertisement

Operation Cadre: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు తెరలేస్తోంది. పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర రక్షణ సేన పార్టీ అధినేత్రి ‘కవిత’ సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. ‘ఆపరేషన్ కేడర్’ పేరుతో పార్టీ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించేందుకు శ్రేణులను సమాయత్తం చేసేందుకు సిద్ధమవుతున్నవారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ ఉనికిని చాటడమే కాకుండా, ఇతర పార్టీల నుంచి బలమైన నాయకులను ఆకర్షించేలా తెరవెనుక పావులు కదుపుతున్నారు.కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా, పార్టీ ప్రతి కార్యక్రమం పల్లె పల్లెకూ చేరేలా పక్కా ప్లాన్ సిద్ధం చేసినట్లు సమాచారం.

గ్రామస్థాయికి పార్టీ.. సరికొత్త ప్రణాళిక

Advertisement

రాజకీయాల్లో మనుగడ సాగించాలన్నా, అధికారం దిశగా అడుగులు వేయాలన్నా గ్రామస్థాయి కేడరే ప్రాణాధారమని కవిత భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ కార్యక్రమాలను నగరాలు, పట్టణాలకే పరిమితం చేయకుండా ప్రతి పల్లెకూ చేర్చేలా భారీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. త్వరలోనే ప్రతి గ్రామంలోనూ కమిటీల నియామకం చేపట్టబోతున్నట్లు సమాచారం. ప్రజల సమస్యలపై నిరంతర పోరాటాలు, ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవడం అందుకు నిత్యం నేతలు గళమెత్తాలని ఇప్పటికే సూచించినట్లు సమాచారం. అదే విధంగా స్థానిక యువతను, మహిళలను పెద్ద ఎత్తున పార్టీలోకి ఆహ్వానించడం, వారికి పార్టీలో ప్రాధాన్యత సైతం ఇవ్వడం జరుగుతుందని తెలిసింది.

‘జెండా పండుగ’తో శ్రీకారం

Advertisement

పార్టీ ఉనికిని, బలాన్ని క్షేత్రస్థాయిలో చాటడమే లక్ష్యంగా ఈనెల 20 నుంచి నెలరోజుల పాటు ‘జెండా పండుగ’ను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ప్రతి గ్రామంలోనూ, ప్రతి వార్డులోనూ పార్టీ జెండాను ఎగురవేయడం ద్వారా క్యాడర్‌లో ఉత్సాహాన్ని నింపాలని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంతో పార్టీ విధానాలను, భవిష్యత్తు కార్యాచరణను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లబోతున్నారు. ఇందుకోసం నియోజకవర్గాల వారీగా ఇన్‌ఛార్జ్‌లను నియమించి, పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించబోతున్నట్లు సమాచారం. యాక్టీవ్ గా జెండా పండుగ నిర్వహించే నేతలను గుర్తించి భవిష్యత్ లో పార్టీ పదవులు, టికెట్లు ఇవ్వబోతున్నట్లు సమాచారం. నియోజకవర్గాల్లోని మండలాల కమిటీ బాధ్యతలను సైతం వారికే అప్పగించడం జరుగుతుందని విశ్వసనీయ సమాచారం.

చేరికలపై ప్రత్యేక నజర్.. టచ్‌లోకి మాజీ ఎమ్మెల్యేలు?

రాష్ట్ర రక్షణ సేనపార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఇతర పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నేతలపై, ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేలపై కవిత ప్రత్యేకంగా దృష్టి సారించారు. బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి ఉన్న మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు సంప్రదింపులు కూడా జరిపినట్లు సమాచారం. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు సైతం భేటీ అయినట్లు ప్రచారం జరుగుతుంది. గతంలో కవితతో గులాబీ పార్టీలో పనిచేసి విడిపోయిన వారితో పాటు, ప్రస్తుతం ఉనికి కోసం పాకులాడుతున్న పలువురు సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు చేరేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే కవిత సైతం..త్వరలోనే భారీ ఎత్తున చేరికలు ఉంటాయని ప్రకటించారు. చేరికలతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి మైలేజ్ తీసుకురావాలని భావిస్తుంది. పార్టీ గూటికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న నేతలకు సముచిత స్థానం కల్పిస్తామనే హామీ కూడా ఇస్తున్నట్లు సమాచారం.

నేడు సన్నాహక సమావేశం..

ఈ యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయడంలో భాగంగా నేడు (సోమవారం) ‘తెలంగాణ రక్షణ సేనపార్టీ’ రాష్ట్ర కీలక సన్నాహక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముఖ్యనేతలు, రాష్ట్రకమిటీ, పార్టీఅనుబంధ సంఘాల ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ మీటింగ్‌లో కవిత నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న జెండా పండుగను ఎలా విజయవంతం చేయాలి? గ్రామస్థాయిలో క్యాడర్‌ను ఎలా సమన్వయం చేసుకోవాలి? చేరికల విషయంలో అనుసరించాల్సిన వ్యూహాలు ఏమిటి? అనే అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర రక్షణ సేన పార్టీ రాజకీయంగా గట్టి పోటీ ఇచ్చేందుకు, తన క్యాడర్‌ను పూర్తిస్థాయిలో రీఛార్జ్ చేసేందుకు సిద్ధమైందని స్పష్టమవుతోంది. మొత్తానికి ‘కవిత’ నేతృత్వంలో సాగుతున్న ఈ ‘ఆపరేషన్ కేడర్’ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందో చూడాలి.

పేదల సమస్యలపై పోరాడుతూ..

పేదల సమస్యలపై పోరాడుతూ వారికి తెలంగాణ రక్షణ సేనపార్టీ(టీఆర్ఎస్) అండగా నిలబడుతుందని ఆపార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బంజారాహిల్స్ లోని రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం బోథ్, ఖైరతాబాద్, అంబర్ పేట్, నర్సాపూర్ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ లో నాయకులు చేరారు. వారికి కవిత పార్టీ కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు. బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆధ్వర్యంలో 200 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. సీనియర్ నాయకుడు మతిన్ అధ్వర్యంలో అంబర్ పేట్ నియోజకవర్గానికి చెందిన ముస్లిం మహిళలు, ఖైరతాబాద్ నియోజకవర్గానికి నర్సింహ తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ లో చేరారు. వారికి కండువాలు కప్పి ఆహ్వానించి .. పార్టీలో ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండాలని సూచించారు.

Also Read: అయ్యో పాపం.. మామిడికాయ కోసం వెళ్తే.. బంగారు గొలుసు చోరీ

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×