E-Paper
Advertisement

నీ చేతకాని తనాన్ని పార్టీ అధినేత పై మోపుతావా.. కేటీఆర్ పై కవిత ఫైర్!

నీ చేతకాని తనాన్ని పార్టీ అధినేత పై మోపుతావా.. కేటీఆర్ పై కవిత ఫైర్!
Advertisement

Kavitha: బిఆర్‌ఎస్ పార్టీలో కేటీఆర్, కవితల మధ్య విమర్శల పర్వం మరింత వేడెక్కింది. ఎక్స్ వేదికగా తన సోదరుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సొంత పార్టీ నేతలపైనే ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.

చేతగానితనం.. సొంత పార్టీకే గోతులు!

Advertisement

కేటీఆర్ తన చేతగానితనాన్ని, వైఫల్యాలను పార్టీ అధినేత కేసీఆర్ పైకి నెట్టేస్తున్నారని కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను కేటీఆర్ బహిరంగంగానే తప్పుబడుతున్నారని మండిపడ్డారు. ఓ పక్క పార్టీకి గోతులు తవ్వుతూనే, అధినేత నిర్ణయాలనే ప్రశ్నించే స్థాయికి వెళ్లడం సరికాదని హితవు పలికారు.

నాకో న్యాయం, మీకో న్యాయమా?

Advertisement

‘ఒక గుంటనక్క మైండ్ గేమ్‌లో పడి నువ్వు పెద్దాయననే తప్పుబడుతున్నావు. ఆ గుంటనక్కతో అంటకాగుతూ నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయించావు’ అంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పార్టీలో నాకో న్యాయం.. మీకో న్యాయమా?’ అని నిలదీశారు. తాను కేటీఆర్ లాగా విషనాగును కానంటూ తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తారు.

అంతరాత్మను ప్రశ్నించుకో..!

గణేష్ నిమర్జనం సమయంలో ఇన్ఫ్లుయెన్సర్లను ఎంతలా బతిమాలుకున్నావో నీ అంతరాత్మకే తెలుసంటూ కేటీఆర్‌పై కవిత సెటైర్లు వేశారు. కేటీఆర్ వైఖరి వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని, ఇప్పటికైనా తన తప్పులను తెలుసుకోవాలని కవిత ఘాటుగా స్పందించారు.

Also Read: కవిత చెప్పినట్లుగా హరీష్ రావు గుంటనక్కే.. ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ఘాటు వ్యాఖ్యలు!

Tags

Related News

అదుపుతప్పి మాట్లాడితే మహిళలతో కొట్టిస్తాం: కొండా సురేఖ

ఏడాదిలోపే ఇందిరమ్మ ఇళ్లు.. రెడ్ హిల్స్‌లో శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి

గంజాయి స్మగ్లర్ల అరాచకాలకు ఇక చెక్.. ఎక్సైజ్ పోలీసుల చేతికి ఆయుధాలు..?

కవిత చెప్పినట్లుగా హరీష్ రావు గుంటనక్కే.. ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ఘాటు వ్యాఖ్యలు!

భారీగా తరలిరండి.. సిరిసిల్ల సీఎం సభను సక్సెస్ చేద్దాం!- మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్ సంస్థ బియ్యంపై అమెరికా ఎఫ్‌డిఏ దృష్టి.. పురుగుమందు అవశేషాలపై హెచ్చరిక

శ్రీమంతుడులా వచ్చి సిరిసిల్లలో పడ్డాడు.. కేటీఆర్‌పై ఎంపీ చామల సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×