Dharman Movie: సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం కెరియర్ పరంగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. త్వరలోనే రజినీకాంత్ జైలర్ 2(Jailer 2) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. తదుపరి సినిమాని అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రాబోతున్న ధర్మన్ సినిమా(Dharman) షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మైసూర్ పరిసర ప్రాంతాలలో జరుగుతుంది. ఇలా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని నటి రాశి ఖన్నా(Rashi Khanna) తెలియజేశారు.
ప్రస్తుతం చిత్ర బృందం మైసూర్ పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే షూటింగ్ లొకేషన్లో రాశిఖన్నా నటుడు రజినీకాంత్ (Rajinikanth)అలాగే హీరో రామ్ పోతినేని(Ram Pothineni)తో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేశారు. ఇలా ఈ ముగ్గురు ఉన్నటువంటి ఫోటో ఈమె షేర్ చేయడంతో రజనీకాంత్ ధర్మాన్ సినిమాలో రామ్ పోతినేని కూడా కీలక పాత్రలో నటించబోతున్నారని స్పష్టమవుతుంది. ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో రాశికన్నా వెంటనే ఈ ఫోటోని డిలీట్ చేశారు.
రామ్ పోతినేనికి సంబంధించిన ఈ విషయాన్ని చిత్ర బృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాని నేపథ్యంలో రాశిఖన్నా డిలీట్ చేశారని తెలుస్తుంది అయితే అప్పటికే ఈ ఫోటోకి సంబంధించిన స్క్రీన్ షాట్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక రాశిఖన్నా ఈ ఫోటోని డిలీట్ చేయడంతో రామ్ పోతినేని ఈ సినిమాలో నటిస్తున్నారని అభిమానులకు ఒక క్లారిటీ వచ్చేసింది. గత కొద్ది రోజులుగా రామ్ పోతినేని రజినీకాంత్ సినిమాలో ఒక పవర్ ఫుల్ పాత్రలో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి కానీ చిత్ర బృందం మాత్రం ఈ విషయం పట్ల ఎలాంటి అధికారిక ప్రకటన వెల్లడించలేదు.
తాజాగా నటి రాశిఖన్నా అనుకోకుండా ఈ విషయాన్ని ఫోటో ద్వారా లీక్ చేసేసారు. రామ్ పోతినేని రజనీకాంత్ సినిమాలో భాగమయ్యారనే విషయం తెలియడంతో రామ్ పోతినేని ఎలాంటి పాత్రలో నటించబోతున్నారు ఆయన పాత్ర ఎలా ఉండబోతోంది అంటూ అభిమానులు పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు.ఈ సినిమాను ప్రముఖ నటుడు కమల్ హాసన్ కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (Raaj Kamal Films International) బ్యానర్ పై తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో సీనియర్ నటి సిమ్రాన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే 2027 సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాని విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర నిర్మాతలు ఉన్నారు.ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించబోతున్న సంగతి తెలిసిందే.
Also Read: సిగ్గులేదా? నెగటివ్ కామెంట్స్ పై చైత్ర రాయ్ ఎమోషనల్!