Ranabaali OTT: రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే అత్యంత రా అండ్ రస్టిక్ అవతార్‌లో కనిపించిన పీరియడ్ యాక్షన్ డ్రామా ‘Ranabaali’ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి జంటగా నటించిన ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కూడా కీలక పాత్ర పోషించారు. 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలన సమయంలో రాయలసీమలో ఏర్పడిన కరువు పరిస్థితుల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నా, వారి కష్టాలను పట్టించుకోకుండా ధాన్యాన్ని, సంపదను విదేశాలకు తరలించాలనుకునే బ్రిటిష్ అధికారులకు ఎదురుతిరిగే ఓ యోధుడి పోరాటమే ఈ సినిమా. అక్టోబర్ 16న థియేటర్లలో మాస్ ఆడియన్స్ కి పూనకాలు తెప్పించిన విజయ్ ఊచకోత ఇప్పుడు మీ హోమ్ స్క్రీన్స్ లో రచ్చ చేయడానికి రెడీ అయిపోయింది. ఈ చిత్రం ఈ రోజు (నవంబర్ 13) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? కథేంటో తెలుసుకుందాం పదండి.
19వ శతాబ్దం నాటి రాయలసీమ ప్రాంతం ఈ కథకు నేపథ్యం. సింగనమల గ్రామంలో ఓ వింత పరిస్థితుల మధ్య జన్మించిన బొబ్బిలి రణబాలి (విజయ్ దేవరకొండ) చిన్నప్పటి నుంచే ధైర్యసాహసాలు కలిగిన వ్యక్తిగా పెరుగుతాడు. కాలక్రమంలో రణబాలి ఓ శక్తివంతమైన యోధుడిగా మారి జయమ్మ (రష్మిక మందన్న)ను పెళ్లి చేసుకుంటాడు. ఆమె రాకతో అతనిలోని మరో కోణం బయటపడుతుంది.
ఇదిలా ఉంటే, ఆ ప్రాంతాన్ని తీవ్ర కరువు కాటకాలు చుట్టుముడతాయి. పంటలు పండక ప్రజలు తినడానికి తిండి లేక అల్లాడిపోతుంటారు. ఇలాంటి సమయంలో వారికి అండగా నిలవాల్సిన బ్రిటిష్ పాలకులు మాత్రం పన్నుల భారం పెంచుతూ, ఉన్న కొద్దిపాటి ధాన్యాన్ని కూడా తమ దేశానికి తరలించేందుకు ప్రయత్నిస్తారు. మద్రాస్ ప్రెసిడెన్సీకి చెందిన బ్రిటిష్ కమిషనర్ సర్ థియోడర్ హెక్టర్ (ఆర్నాల్డ్ వోస్లూ) తన అధికారాన్ని ఉపయోగించి ధాన్యం ఎగుమతులను పెంచాలని చూస్తాడు. ప్రజల ఆకలి కేకలు అతడికి పట్టవు. కరువు పరిస్థితుల్లోనూ పన్నులు వసూలు చేయడం, రైల్వే నిర్మాణ పనుల కోసం ప్రజలను కష్టపెట్టడం వంటి చర్యలు వారి బాధలను మరింత పెంచుతాయి.
తన కళ్ల ముందే ప్రజలు ఆకలితో చనిపోతుంటే రణబాలి మాత్రం చూస్తూ ఊరుకోలేకపోతాడు. బ్రిటిష్ అధికారుల దౌర్జన్యాలకు ఎదురుతిరిగి, ప్రజల కోసం పోరాటం మొదలుపెడతాడు. ఒకవైపు తన గ్రామాన్ని, ప్రజలను కాపాడాలనే బాధ్యత.. మరోవైపు తన భార్య జయమ్మతో ఉన్న అనుబంధం.. ఇలా అతని జీవితంలో అనేక సవాళ్లు ఎదురవుతాయి. మరి రణబాలి బ్రిటిష్ అధికారుల కుట్రలను ఎలా అడ్డుకున్నాడు? తన ప్రజలను కరువు నుంచి కాపాడేందుకు ఎలాంటి పోరాటం చేశాడు? అనేదే మిగతా కథ.
‘Ranabaali’లో సింగనమల బొబ్బిలి రణబాలిగా విజయ్ దేవరకొండ, జయమ్మగా రష్మిక మందన్న, సర్ థియోడర్ హెక్టర్‌గా ఆర్నాల్డ్ వోస్లూ నటించారు. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. అజయ్-అతుల్ సంగీతం అందించారు. 2026 అక్టోబర్ 16న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా నవంబర్ 13 నుంచి Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ఒరిజినల్ వెర్షన్ తో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఆడియో డబ్బింగ్ ఆప్షన్స్ తో నెట్‌ఫ్లిక్స్ దీనిని గ్లోబల్ వైడ్‌గా అందుబాటులోకి తెచ్చింది. వీకెండ్ లో ఒక హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ బ్లాస్ట్ ని ఎక్స్ పీరియన్స్ చేయాలనుకుంటే, నెట్‌ఫ్లిక్స్ లో ‘రణబాలి’ ఊచకోతను అస్సలు మిస్ అవ్వకండి.
Read Also : మనవళ్ల కోసం మళ్లీ ఆయుధం పట్టిన తాత… విలన్లకు దబిడి దిబిడే… అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్