Hyderabad: తెలంగాణ వ్యాప్తంగా సీనియర్ ఐపీఎస్ సీపీ సజ్జనార్ గురించి ఒకటే చర్చ. కేవలం పోలీసు శాఖలోనే కాదు.. రాజకీయ నేతల్లో దీనిపై చర్చ మొదలైంది. హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా ఉన్న ఆయన్ని ఎందుకు బదిలీ చేసింది? కేవలం 14 నెలలకే ట్రాన్స్ ఫర్ చేయడం వెనుక ఏం జరిగింది? ఆర్టీసీలో సరైన పని తీరు కనబరిచిన ఆయన, ఎందుకు అదే స్పీడ్ కంటిన్యూ చేయలేకపోయారు? ఇవే ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.
తెలంగాణలో భారీ ఎత్తున సీనియర్ ఐపీఎస్ బదిలీలు అయ్యారు. అందరి విషయాన్ని కాసేపు పక్కనబెడితే సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ గురించి అసలు చర్చ. ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయనకు నేరుగా హైదరాబాద్ సీపీగా ప్రమోషన్ ఇచ్చింది ప్రభుత్వం. ఇప్పటికే సజ్జనార్ పేరు చెప్పగానే కొందరు ఆర్టీసీ ఉద్యోగులు మండిపడుతారు. ఆయనకు టైమ్ ఉండదని, నిత్యం పనిలో ఉండాలని కోరుకుంటారని అంటున్నారు. ఆయన కాలంలో తాము సమయానికి డ్యూటీ దిగిన సందర్భాలు లేవని అంటున్నారు. తాము పడిన నరకం అంతా ఇంతా కాదని చెబుతున్నారు. మళ్లీ ఆయన వస్తారని తెలియగానే కొందరు ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
నవంబర్ 12న తెలంగాణ ప్రభుత్వం 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. అందులో హైదరాబాద్ సీపీ సజ్జనార్ బదిలీపై అందరి దృష్టి పడింది. అధికారానికి హద్దులుంటాయి? యూనిఫాంకు బాధ్యతలుంటాయి? అనే ప్రశ్నల చుట్టూనే బదిలీపై చర్చ మొదలైపోయింది. సీపీ నుంచి ప్రాధాన్యత లేని ఫైర్-డిజాస్టర్ రెస్పాన్స్ డీజీగా నియమించడం కీ డిబేట్‌గా మారింది. కమిషనర్ తన పరిధిని దాటి కీలక అంశాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం, డీజీపీ కార్యాలయంతో సమన్వయ లోపం, ఉన్నతాధికారులతో విభేదాలు తలెత్తడం ఆకస్మిక మార్పుకు దారి తీసిందనే ప్రచారం లేకపోలేదు.
అదే సమయంలో సీబీఐ మాజీ డైరెక్టర్, రిటైర్డ్ ఐపీఎస్ నాగేశ్వరరావు చేసిన విమర్శలు మరింత సంచలనం అయ్యాయి. సజ్జనార్‌ను ఉద్దేశించి యూనిఫాం వేసుకున్న నేరస్తుడని పోస్ట్ పెట్టడం బదిలీ వెనుక ఏదో జరిగిందని పోలీసు శాఖ ఉద్యోగులు అనుకుంటున్నారు. సాధారణ బదిలీనా? వివాదాల ప్రభావమా? గతంలో సజ్జనార్‌పై పలువురు మాజీ అధికారులు రకరకాల ఆరోపణలు చేశారు. జనవరిలో వారికి లీగల్ నోటీసులు జారీ చేశారు ఆయన. ఇలాంటి సమయంలో నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు పోలీసు వర్గాల్లో దుమారం రేపుతోంది.
సీపీగా ఉన్న సమయంలో ఏక పక్ష నిర్ణయాలు తీసుకోవడం, డీజీపీతో సఖ్యతగా లేరని ఆరోపణలు లేకపోలేదు. ఇతర అధికారులతో దురుసుగా ప్రవర్తించడం వంటి అంశాలు బదిలీకి కారణమైందని అంటున్నారు. మొదట ఆరు నెలలు తన శాఖపై దృష్టి సారించిన ఆయన, ఆ తర్వాత దారి తప్పినట్టు కొందరు సీనియర్ ఆఫ్ ద రికార్డులో చెప్పుకోవడం కనిపిస్తోంది. సొంత ఏజెండా, కావాల్సిన వారికి పోస్టింగులు, బదిలీలు చేయడం, డీసీపీలతో దురుసుగా ప్రవర్తించారనేది అనుకుంటున్నారట. ఈ విషయం ముదిరిపాకాన పడి డీజీపీ, సీఎం స్థాయి వరకు వెళ్లినట్టు ప్రచారం.
ALSO READ: తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌ని ఢీకొట్టిన లారీ.. తప్పిన పెను ముప్పు!
ఆర్టీసీ ఎండీగా ఉన్నప్పుడు.. సీపీ వచ్చిన తర్వాత ఆయన వ్యవహారశైలిపై చాలా తేడా ఉందని అంటున్నారు. ఆయన రిటైర్మెంట్ కు కేవలం ఏడాదిన్నర మాత్రమే ఉంది. డీజీపీగా ఆనంద్ నియామకం జరిగిన నుంచి ఆయనతో సఖ్యత లేకపోవడం, డీజీపీ ఆఫీసు నుంచి ఏమైనా సమాచారం వచ్చినా పనులు విషయంలో నిర్లక్ష్యం చూపారనేది మరొక పాయింట్. డ్రగ్స్, కల్తీ ఆహారం, వన్ వే విధానంతో పేరు తెచ్చుకున్నా, చివరకు ఒంటెత్తు పోకడ వల్ల ప్రాధాన్యత లేని విభాగానికి బదిలీ చేశారని అంటున్నారు. మరి రానున్న రోజుల్లో సజ్జనార్ గురించి ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో వెయిట్ అండ్ సీ.