Rohit Sharma: టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్, కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) కొంతకాలంగా ఫామ్ లేకుండా సతమతమవుతున్నాడు. ఈ మధ్య జరిగిన ఏ ఒక్క సిరీస్ లలోను తన స్థాయికి తగిన ప్రదర్శనను చూపించలేకపోతున్నాడు. సొంత గడ్డపై న్యూజిలాండ్ తో జరిగిన మూడు టెస్ట్ మ్యాచుల సిరీస్ లో భారత్ దారుణంగా విఫలమైంది. ఈ సిరీస్ లోను రోహిత్ రాణించలేకపోయాడు.
Also Read: Mohammed Shami: రోహిత్ శర్మ టార్చర్.. రిటైర్మెంట్ దిశగా షమీ..?
తాజాగా ఆస్ట్రేలియాతో ఆడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ లోను నిరాశపరిచాడు. టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్, కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) వైఫల్యానికి అతని ఫిట్నెస్ కారణమని అంటున్నారు కొంతమంది మాజీలు. దక్షిణాఫ్రికా వెటరన్ ఆటగాడు డారిల్ కల్లినన్ రోహిత్ శర్మపైన ( Rohit Sharma ) తీవ్ర విమర్శలు చేశాడు. రోహిత్ శర్మ ( Rohit Sharma ) ఫ్లాట్ పిచ్ లపై మాత్రమే ఆడగలడని డారిల్ కల్లినన్ అన్నాడు. అంతే కాకుండా రోహిత్ శర్మ బాడిపై కూడా కామెంట్లు చేశారు. రోహిత్ ఈ మధ్య బాగా బరువు పెరగడం ద్వారా అది అతని బరువుపై ప్రభావం చూపిస్తుందని అన్నాడు.
అంతేకాక రోహిత్ ( Rohit Sharma ) తన ఫిట్నెస్ పై శ్రద్ధ చూపించలేదని అన్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్ కు హాజరు అవ్వని రోహిత్ శర్మ ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా నేరుగా అడిలైడ్ లో జరిగిన టెస్టులో పాల్గొన్నాడని అన్నారు. సెలక్షన్ కమిటీలో కనుక నేను ఉంటే టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్, కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) కు కచ్చితంగా జట్టులో స్థానం కల్పించే వాడిని కాదంటూ సంచలన కామెంట్స్ చేశాడు. టీమిండియా (Team India) ప్రస్తుతం ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ టెస్ట్ ఆడుతోంది. ఈ మ్యాచ్ లు జరగగా సిరీస్ 1-1తో సమం కానుంది.
బుమ్రా సారధ్యంలో తొలి మ్యాచ్ గెలవగా రెండవ స్థానంలో రెండో టెస్ట్ కోల్పోయింది. 14 నుంచి అంటే ఇవాళ్టి నుంచే బ్రిస్బెన్ వేదికగా మూడో టెస్ట్ ప్రారంభం ఐంది. కానీ బ్రిస్బెన్ వేదికగా మూడో టెస్ట్ ప్రారంభం అయినప్పటికీ వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయింది. అయితే ఈ టెస్ట్ కు ముందు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డారిల్ కల్లినన్ ….టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్, కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) పై ఇలాంటి కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. మరో వైపు ప్రస్తుతం రోహిత్ ఫామ్ భారత జట్టులో టెన్షన్ ను పెంచింది. డబ్ల్యూటీసి ఫైనల్ కు చేరుకోవాలంటే ఆస్ట్రేలియా లో మిగిలిన మూడు టెస్టుల్లో భారత్ ను ఓడించాలి. కానీ బ్రిస్బెన్ వేది కగా జరుగుతున్న మూడో టెస్ట్ కు వర్షం అంతరాయం ఏర్పడింది. ఒక వేళ మ్యాచ్ వర్షం వల్ల రద్దు అయితే టీమిండియాకు నష్టమే.
Also Read: Sara Tendulkar – Gill: గిల్ కోసం రంగంలోకి సారా…ఇక డబుల్ సెంచరీ పక్కా ?