Manchu Vishnu – Manchu Manoj : ఇండస్ట్రీలో ఉన్న ఓ అన్నదమ్ముల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తు భగ్గుమనేలా పరిస్థితి ఉంది. యూనివర్సిటీ గురించి స్టార్ట్ అయినా… ఈ వివాదం చిలికి చిలికి గాలి వానలా తయారైంది. మీడియా, సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు నేరుగా మాటలు అనుకునే స్థితికి వచ్చారు. వాళ్లు ఎవరో కాదు.. మంచు బ్రదర్స్. విష్ణు, మనోజ్‌లు.
ఇప్పుడు ఇలా ఉన్నారు కానీ, విష్ణుకు మనోజ్ అంటే చాలా ఇష్టమట. తమ్ముడి కోసం ఏం చేయడానికి అయినా.. రెడీగా ఉంటాడట. అలాంటి సందర్భమే ఒకటి గతంలో జరిగిందట. మనోజ్ కోసం ఓ రౌడీ ముకతో విష్ణు గొడవ పెట్టుకున్నాడట. ఇది సినిమాలో కాదండి. రియల్‌గా జరిగింది.
మంచు మనోజ్ ఇండస్ట్రీకి ‘శ్రీ’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. తమన్నా, మంచు మనోజ్ కలిసి చేసిన ఈ మూవీ షూటింగ్ మొత్తం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోనే జరిగింది. మనోజ్ డెబ్యూ మూవీ కాబట్టి… మంచు ఫ్యామిలీ మొత్తం అక్కడికి వచ్చారు. ఫ్యామిలీతో పాటు మంచు విష్ణు కూడా ఆ షూటింగ్ లోకేషన్‌లోనే ఉన్నాడట.
ఈ సందర్భంలో… అక్కడ ఉన్న లింగరాజు స్వామి దేవాలయం సమీపంలోని ఓ సరస్సు దగ్గర ‘శ్రీ’ సినిమాకు సంబంధించి ఓ ఛేజింగ్ సీన్ షూట్ చేస్తున్నారట. ఈ సీన్ కోసం అప్పటికే అక్కడ ఉన్న రోడ్‌ను కూడా క్లోజ్ చేశారట. అయితే ఆ షాట్ గ్యాప్‌లో ఆ మూవీ డైరెక్టర్ దశరథ్.. సైలెంట్.. సైలెంట్ అని పలు మార్లు అన్నారట. అయినా… అక్కడ షూటింగ్ చూడటానికి వచ్చిన కొంతమంది డిస్ట్రర్బ్ చేస్తూనే ఉన్నారట.
డైరెక్టర్ మాట వినకపోవడంతో.. మంచు విష్ణు ఎంట్రీ ఇచ్చారట. డైరెక్టర్ సైలెంట్ అంటున్నా… ఎందుకు అల్లరి చేస్తున్నారు అంటూ వారితో గొడవకు దిగారంట. ఆ లోకల్స్ మరింత రెచ్చిపోవడంతో… విష్ణుకు కోపం వచ్చి… రౌడీ పాత్రదారుల దగ్గర ఉన్న కర్ర పట్టుకుని… వాళ్లపైకి వెళ్లాడట.
తాము ఇక్కడ లోకల్స్ అని, మమ్మల్నే బెదిరిస్తారా..? షూటింగ్ ఆపేస్తాం అంటూ విష్ణుపైకి వచ్చారట. అప్పటికే పోలీసులు వచ్చి… ఆ లోకల్స్‌తో మాట్లాడి పంపించేశారట. అంతే కాదు… తమ్ముడి ఫస్ట్ మూవీ కాబట్టి… మరే సమస్య రాకుండా… షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి అయ్యే వరకు విష్ణు అక్కడే ఉన్నాడట.
అలా.. తమ్ముడు మనోజ్ కోసం అన్న విష్ణు రౌడీ మూకలతో కూడా గొడవ పడ్డాడట. ఇది వింటే.. తమ్ముడు మనోజ్ అంటే విష్ణుకు ఎంత ప్రేమో తెలుస్తుంది.
అలాంటి వీరు… ఇప్పుడు ఓ చిన్న విషయం కోసం గొడవ పెట్టుకోవడం, బహిరంగంగా… ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం బాధకరమైనా విషయం. ఈ అన్నదమ్ములకు ఈ విషయం గుర్తుందో లేదో తెలీదు కానీ.. ఒకసారి వీరికి ఇది గుర్తొస్తే… బలగం సినిమాలో అన్నదమ్ములు కలిసినట్టు ఈ మంచు బ్రదర్స్ కూడా కలవచ్చేమో..