TSLatest Updates

KCR : నిర్మల్ జిల్లాకు కేసీఆర్ వరాలు.. పంచాయతీలకు భారీగా నిధులు..

kcr-announced-huge-funds-for-nirmal-district

KCR : నిర్మల్ జిల్లాలో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటించారు. నిర్మల్‌లో రూ.56.2 కోట్ల వ్యయంతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభించారు. ఆదిలాబాద్‌ జిల్లాలోనే 4 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. అసిఫాబాద్‌ లాంటి అటవీ ప్రాంతంలోనూ మెడికల్‌ కాలేజీ రావడం తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం వల్లే సాధ్యమైందన్నారు. ఏపీలో ఉంటే మరో 50 ఏళ్లు గడిచినా ఇలాంటి అభివృద్ధి జరిగేది కాదని స్పష్టం చేశారు. దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్‌ వన్‌ గా ఉందని ప్రకటించారు. జిల్లాకు చెందిన ముక్కుర.కె గ్రామానికి చాలా అవార్డులు వచ్చాయని తెలిపారు.

తరతరాలుగా దళితులు, గిరిజనులు, అగ్రవర్ణాల్లో పేదలు వెనుకబడి ఉన్నారని కేసీఆర్ అన్నారు. ఇదే పట్టుదల, కృషితో ముందుకు సాగితే అందరినీ సమాన స్థాయికి తెచ్చే పరిస్థితి ఉంటుందన్నారు. రాష్ట్రంలో చేయాల్సిన అభివృద్ధి ఇంకా చాలా ఉందని చెప్పారు. ఎన్నికల తర్వాత ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పోడు భూముల పంపిణీ చేపట్టాలని కలెక్టర్‌ కు సూచించారు. ఈ ఏడాది నుంచే పోడు భూముల రైతులకు రైతు బంధు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

నిర్మల్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు. ఎల్లపల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాకు వరాలు కురిపించారు. జిల్లాలోని 396 గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున నిధులు కేటాయిస్తున్నామని ప్రకటించారు. నిర్మల్‌, ముథోల్‌, ఖానాపూర్‌ మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున, జిల్లాలోని 19 మండలాలకు రూ.25 లక్షల చొప్పున నిధులు కేటాయిస్తున్నామన్నారు. పదో తరగతి ఫలితాల్లో నిర్మల్‌ అగ్రస్థానంలో నిలిచిందని కేసీఆర్ గుర్తు చేశారు. జిల్లా విద్యాశాఖను అభినందించారు. బాసర సరస్వతి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపనకు వస్తానని కేసీఆర్ తెలిపారు.

Related posts

Rajamouli News : రాజమౌళికి కొత్త పదవి.. సినిమా నుండి క్రికెట్‌కు..

Bigtv Digital

AP: సంఘం గుర్తింపు రద్దు చేస్తాం.. గవర్నర్‌ను ఎందుకు కలిశారు? జగన్ సర్కార్ యాక్షన్

Bigtv Digital

Taraka Ratna: తారకరత్నకు గుండెపోటు.. ఎమర్జెన్సీ ట్రీట్ మెంట్.. బాలకృష్ణకి చంద్రబాబు, ఎన్టీఆర్ ఫోన్..

Bigtv Digital

Leave a Comment