
Plants without water : మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సరిపడా నిద్ర, ఆహారం, నీరు.. ఇలాంటివన్నీ ఉండాల్సిందే.. అలాగే మొక్కలు ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా కావాల్సిన వనరులు ఉంటాయి. వాటికి కూడా ఎప్పటికప్పుడు సరిపడా నీరు అనేది అందాలి. దాంతో పాటు సరిపడా సూర్యుడి వెలుగు తాకాలి. ఇలా ఎన్నో రకాలుగా వాటిని కూడా జాగ్రత్తగా చూసుకున్నప్పుడే మొక్కలు అనేవి చెట్లుగా ఎదిగి మనకు నీడను ఇస్తాయి. కానీ పశ్చిమ ఘాట్స్‌లో ఉండే ఈ చెట్లకు నీరు అవసరం లేకుండానే పెరుగుతాయని నిపుణులు చెప్తున్నారు.
పశ్చిమ ఘాట్స్‌లో ఉండే ఈ 62 రకాల కొత్త మొక్కలు నీరు లేకపోయినా బ్రతుకుతాయని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. ఎందుకంటే ఈ మొక్కలలో డీహైడ్రేషన్‌ను తట్టుకునే శక్తి కాస్త ఎక్కువగానే ఉంటుందని వారు తెలిపారు. అందుకే వీటిని డెసిసేషన్ టాలరెంట్ వాస్కులర్ రకానికి చెందిన మొక్కలు అని అంటారని చెప్తున్నారు. అందుకే ఇవి అసలు నీరు లేకపోయినా బ్రతుకుతాయని అంటున్నారు. నీరు అందుబాటులో ఉండేవరకు వాటిని అవి కాపాడుకుంటూ ఉంటాయని అన్నారు.
ఇలాంటి మొక్కలు అనేవి వ్యవసాయంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నీరు లేని చోట వ్యవసాయం చేయడానికి ఉపయోగపడతాయని అన్నారు. ఇలాంటి మొక్కలు చాలా అరుదు కాబట్టి ఇండియన్ ప్రభుత్వం కూడా వీటిని కాపాడుకోవడం కోసం ముందుకొచ్చింది. ప్రస్తుతం భారతదేశంలోని పశ్చిమ ఘాట్స్‌లో మాత్రమే ఇవి కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇంకా భారత్‌లో ఇలాంటి మొక్కలు ఎక్కడ ఉంటాయో కనిపెట్టడానికి వారు ప్రయత్నిస్తున్నారు.
పూణెకు చెందిన ఒక శాస్త్రవేత్తలు టీమ్ ముందుగా ఈ మొక్కల గురించి బయటపెట్టింది. ప్రస్తుతం ఈ మొక్కల గురించి ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటివి మరెన్నో కనిపెట్టడంతో పాటు ఉన్న మొక్కలను కాపాడుకోవడం కూడా వారి టార్గెట్ అని చెప్తున్నారు. బయోడైవర్సిటీ, ఎకాలజీ వంటి వాటికి కూడా ఈ మొక్కలు ఉపయోగపడతాయని అన్నారు. అంతే కాకుండా కరువు లాంటి వాటి నుండి కాపాడడానికి ఈ మొక్కలు ఉపయోగపడతాయన్నారు. పశ్చిమ ఘాట్స్‌లో ఈ మొక్కల గురించి ప్రస్తుతం ఇండియా అంతా వైరల్‌గా మారింది.