BigTV English

1 More Case Filed on Kalvakuntla Kanna Rao: కల్వకుంట్ల కన్నారావుపై మరో కేసు నమోదు.. ఒక్కొక్కటిగా బయటపడుతున్న అరాచకాలు..!

1 More Case Filed on Kalvakuntla Kanna Rao: కల్వకుంట్ల కన్నారావుపై మరో కేసు నమోదు.. ఒక్కొక్కటిగా బయటపడుతున్న అరాచకాలు..!

Another Case Filed on Kalvakuntla Kanna Rao: BRS అధినేత కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావు అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా కన్నారావుతో సహా మరో ఐదుగురి మీద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. న్యాయం కోసం కన్నారావు వద్దకు వెళ్లిన సాప్ట్‌వేర్ ఉద్యోగి విజయ వర్ధన్ రావును నిర్బంధించారు.


విజయవర్దన్ రావును కొట్టి 60 లక్షల రూపాయల నగదు, 97 తులాల బంగారం దోచుకున్నారు. బిందు మాధవి అలియాస్ నందిని చౌదరి అనే మహిళతో కలిసి కన్నారావు ఈ అరాచకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

Kalvakuntla Kanna Rao Arrest Update


అంతే కాదు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుక్కున్న టాస్క్ ఫోర్స్ ఆనాటి అధికారులు భుజంగరావు, ఏసీపీ కట్టా సాంబయ్య తమకు క్లోజ్ అంటూ జనార్దన్ రావును బెదిరించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పుడు బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కన్నారావుతోపాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు.

Also Read: Delhi Liquor Scam: లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం.. అప్రూవర్‌గా మారిన శరత్ చంద్ర రెడ్డి

ఇదలా ఉంటే.. కల్వకుంట్ల కన్నారావు ఇది వరకే భూవివాదం కేసులో నిందుతుడుగా ఉన్నాడు. మన్నె గూడలో 2 ఎకరాల భూమిని కబ్జా చేసినందుకు పోలీసులు అరెస్ట్ చేశారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ తరుణంలో ప్రతిపక్ష బీఆర్ ఎస్ గడ్డుకాలం నడుస్తోంది. ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయింది. ఇప్పడు కల్వకుంట్ల కన్నారావు మరో కేసులో అరెస్ట్ కావడం పెద్ద చర్చనీంయాంశంగా మారింది.

Tags

Related News

Metro Parking System: గుడ్ న్యూస్.. మెట్రో సరికొత్త పార్కింగ్ సిస్టమ్ సిద్ధం, మనుషులతో పనేలేదు!

Hyderabad News: జీహెచ్ఎంసీ నిఘా.. ఆ పని చేస్తే బుక్కయినట్టే, అసలు మేటరేంటి?

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Big Stories

×