BigTV English

BRS MP Candidates: మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్ రెడ్డి..

BRS MP Candidates: మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్ రెడ్డి..

Manne Srinivas ReddyBRS Mahbubnagar MP Candidate: మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్ రెడ్డిని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంగళవారం సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్ధిని ప్రకటించారు. నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్ధిపై ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది.


ఇవ్వాళ కేసీఆర్‌తో భేటీ అయిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకున్నట్లు తెలిపారు. పొత్తులో భాగంగా నాగర్ కర్నూల్ సీటును బీఎస్పీకి కేటాయిస్తారని సమాచారం. బీఎస్పీ చీఫ్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవలే నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ పోతుగంటి రాములు కారు దిగి కమలం గూటికి చేరుకున్న విషయం తెలిసిందే.

ఇక మన్నె శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం మహబూబ్‌నగర్ ఎంపీగా ఉన్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున మన్నె శ్రీనివాస్ రెడ్డి పోటీ చేశారు. బీజేపీ నుంచి పోటీ చేసిన డీకే అరుణపై 77,829 మెజార్టీతో విజయం సాధించారు. తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి మన్నె శ్రీనివాస్ రెడ్డికే అవకాశం ఇచ్చారు.


Read More: బీఆర్ఎస్ రెండో లిస్ట్ విడుదల.. ఎంపీ అభ్యర్థులుగా నామా, కవితకు అవకాశం..

ఇప్పటికే నాలుగు ఎంపీ స్థానాలకు కేసీఆర్ అభ్యర్ధులను ప్రకటించారు. కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, ఖమ్మం నుంచి నామా నాగేశ్వర్ రావు, మహబూబాబాద్ నుంచి మాలోతు కవిత రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున బరిలో దిగనున్నారు.

Tags

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Big Stories

×