BigTV English

KCR Discuss: కాళేశ్వరం రిపోర్ట్.. బీఆర్ఎస్‌లో టెన్షన్ మొదలు, ఫామ్‌హౌస్‌కు కేటీఆర్-హరీష్‌రావు

KCR Discuss: కాళేశ్వరం రిపోర్ట్.. బీఆర్ఎస్‌లో టెన్షన్ మొదలు, ఫామ్‌హౌస్‌కు కేటీఆర్-హరీష్‌రావు

KCR Discuss: కాళేశ్వరం కమిషన్ రిపోర్టు బీఆర్ఎస్ నేతల్లో గుబులు రేపుతోందా? నేతలు ఎందుకు కంగారుపడుతున్నారు? అరెస్టు అవుతామనే భయం వారిని అప్పుడే వెంటాడుతోందా? ఈ వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్ ఎలా అడుగులు వేయనున్నారు? ఈ గండం నుంచి బయటపడేది ఎలా? వంటి అంశాలపై చర్చ ఆ పార్టీలో చర్చ మొదలైంది.


అధికారం పోయిన తర్వాత సెకండ్ ఇయర్ బీఆర్ఎస్ పార్టీకి కష్టాలు వెంటాడుతున్నాయి. తొలి ఏడాది కేటీఆర్ అయితే సెకండ్ ఇయర్ కేసీఆర్, హరీష్‌రావుల వంతైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గతవారం ప్రభుత్వానికి రిపోర్టు సమర్పించింది.

కీలకమైన 10 పేజీల డాక్యుమెంట్లు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రాజెక్టు అవకతవకల వెనుక కేసీఆర్‌‌‌ కీలకపాత్ర పోషించారని కమిషన్ ప్రస్తావించడంతో ఆ పార్టీలో భారీ కుదుపు. వెంటనే ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో ఉన్న కేసీఆర్‌తో కేటీఆర్, హరీష్‌రావులు భేటీ అయ్యారు.


ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ చండీయాగం మొదలుపెట్టారు. ఇప్పడు పార్టీ నేతలతో మాట్లాడుతారా? ఇంకా సమయం తీసుకుంటారా? అనేది కొందరి నేతలను వెంటాడుతోంది. తాజాగా బిగ్ టీవీకి అందిన సమాచారం మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై ముగ్గురు నేతలు చర్చించారు.

ALSO READ: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కాళేశ్వరం రిపోర్టుప ప్రత్యేక చర్చ?

కమిషన్ ఇచ్చిన నివేదికపై మాట్లాడకుండా ప్రభుత్వం తీసుకోబోయే చర్చలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పీసీ ఘోష్ నేతృత్వంలో వేసిన కమిషన్ కావడంతో తప్పుబట్టడం సరికాదని ఓ అంచనాకు వచ్చారట. ఆ రిపోర్టుపై ప్రభుత్వం తీసుకోబోయే చర్యలపై ప్రధానంగా చర్చించినట్టు సమాచారం.

ప్రభుత్వం అసెంబ్లీలో చర్చకు పెడితే పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని భావిస్తున్నారట. ఈ అంశాన్ని ఎలా డైవర్ట్ చేయాలి? అనేదానిపై మల్లగుల్లాలు పడినట్టు పార్టీ వర్గాల మాట.  దర్యాప్తు సిట్ చేస్తుందా? ఏసీబీకి ఇస్తుందా? సీబీఐకి అప్పగిస్తుందా? అనేదానిపై ప్రస్తావనకు వచ్చినట్టు ఓ ఫీలర్ బయటకు వచ్చింది. ఈ విషయంలో మీడియాతో మాట్లాడకుండా జాగ్రత్త పడాలని నేతలు భావించారట. మొత్తానికి ఈ గండం నుంచి కేసీఆర్, మిగతా నేతలు ఎలా బయటపడతారో చూడాలి.

 

Related News

Congress: బీసీ రిజర్వేషన్ల కోసం.. హస్తినలో తెలంగాణ కాంగ్రెస్ మహాధర్నా

Weather Alert: బీ అలర్ట్..! తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కుండపోత వర్షాలు.. నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు..

KTR In Delhi: కేటీఆర్ ఢిల్లీ ముచ్చట్లు.. ఆ భేటీ ఉద్దేశమేంటి?

KCR Big Sketch: గువ్వల రిజైన్ వెనుక కేసీఆర్ కొత్త స్కెచ్ ?

Farmers: సొంత భూమి ఉంటే చాలన్నా.. సింపుల్‌గా రూ.50వేలు పొందండిలా..?

Chiranjeevi: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో చిరంజీవి? కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కేటీఆర్

Big Stories

×