Jr NTR vs Hrithik Roshan : మరో 10 రోజుల్లో ఇండియన్ బిగ్గెస్ట్ మూవీ విడుదల కాబోతోంది. ఇండియాలో ఉండే ఎంతోమంది సినీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే ఆ సినిమాలో నటించిన ఇద్దరు హీరోల మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. ఇక ఇంతకీ ఆ హీరోలు ఎవరో? ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది. వాళ్లే బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్(Hrithik Roshan) , సౌత్ నటుడు జూనియర్ ఎన్టీఆర్.. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్(Yash Raj Films Banner) పై ఆదిత్య చోప్రా(Adithya Chopra) నిర్మించిన వార్-2 మూవీకి అయాన్ ముఖర్జీ (Ayaan Mukherjee) దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.అయితే వార్ మూవీ(War Movie) హిట్ కొట్టడంతో వార్-2 మూవీలో నార్త్ , సౌత్ రెండు ఇండస్ట్రీల నుండి పెద్ద స్టార్స్ ఉండేలా చూసుకున్నారు చిత్ర యూనిట్.
హ్యాష్ ట్యాగ్ కోసం ఇద్దరు హీరోల మధ్య ఫైట్..
ఇందులో భాగంగా హీరోగా హృతిక్ రోషన్ ని..విలన్ గా ఎన్టీఆర్ ని ఎంచుకున్నారు. అయితే మొదటిసారి ఎన్టీఆర్ (NTR) ఫుల్ లెన్త్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. అది కూడా మరో హీరోకి. అయితే ఇప్పటికే ఎన్టీఆర్ జై లవకుశ(Jai Lava Kusha) మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో చేసినప్పటికీ అందులో ఆయనే హీరో. కానీ ఇప్పుడు హృతిక్ రోషన్ హీరోగా చేస్తున్న వార్ 2(War-2) లో విలన్ గా చేస్తున్నారు.దీంతో అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగి పోయాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్ నడుస్తోంది. అదేంటంటే.. వార్-2లో నటించిన ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ లు ట్విట్టర్ హ్యాష్ ట్యాగ్ కోసం కొట్టుకున్నంత పని చేస్తున్నారు..
ఇప్పుడే వార్ స్టార్ట్ అయింది..
అసలు విషయం ఏమిటంటే.. మరో పది రోజుల్లో విడుదల కాబోతున్న వార్ 2 సినిమాకి సంబంధించి అన్ని అప్డేట్స్ కి తన పేరు ముందు ఉండేలా #HrithikvsNTR ఈ హ్యాష్ ట్యాగ్ ని వాడాలని హృతిక్ రోషన్ చెప్పుకొస్తున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం వార్-2 కి సంబంధించిన అప్డేట్స్ అన్నింటికీ #NTRvsHrithik అనే హ్యాష్ ట్యాగ్ ఉండాలని చెప్పుకొస్తున్నారు.అలా ప్రస్తుతం వీరిద్దరూ సోషల్ మీడియాలో ట్యాగ్ కోసం X లోనే కొట్టుకున్నంత పని చేస్తున్నారు. ఎన్టీఆర్ తన పేరు ముందుండేలా ట్యాగ్ వాడమంటే.. హృతిక్ రోషన్ మాత్రం తన పేరు ముందుండేలా హ్యాష్ ట్యాగ్ వాడాలి అని చెప్పడంతో ప్రస్తుతం వీరిద్దరి ట్విట్టర్ పోస్టులు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. అయితే హృతిక్ రోషన్ దీన్ని కాంప్లికేట్ చేయకు అంటూ ఎన్టీఆర్ కి చెప్పగా.. ఎన్టీఆర్ మాత్రం మనిద్దరం డిస్కస్ చేద్దాం.కానీ హ్యాష్ ట్యాగ్ మాత్రం నా పేరు ముందుండేలా అప్డేట్లు ఇద్దాం ఇప్పుడే వార్ స్టార్ట్ అయింది అంటూ రిప్లై ఇచ్చారు.
ప్రమోషన్స్ లో భాగమేనా?
ప్రస్తుతం వీరిద్దరికీ సంబంధించిన ఈ ట్విట్టర్ పోస్టులు నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్స్ ఈ సినిమాకి ముందే వీరిద్దరూ హ్యాష్ ట్యాగ్ విషయంలో గొడవపడి ఈ గొడవను మరింత కాంప్లికేట్ చేసేలా ఉన్నారే అంటూ మాట్లాడుకుంటున్నారు. అయితే మరికొంతమందేమో వీరిద్దరూ కలిసి వార్ 2 మూవీలో నటించారు. కాబట్టి సినిమాకి ప్రమోషన్స్ గా సోషల్ మీడియాలో ఇద్దరు హ్యాష్ ట్యాగ్ ల కోసం వార్ చేసుకుంటూ వెరైటీ ప్రమోషన్ చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. మరి హృతిక్ రోషన్ , ఎన్టీఆర్ వార్-2 మూవీకి ప్రమోషన్స్ గానే ఇలా ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్ ల వార్ చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.
ALSO READ:Run For Organ Donation: ఘనంగా రన్ ఫర్ ఆర్గాన్ డొనేషన్ కార్యక్రమం.. ముఖ్య ఉద్దేశం ఏంటంటే?