KCR: ‘ సహనంతో కూడిన ప్రజాస్వామిక పోరాటాల ద్వారా సామాజిక మార్పు సాధించడమే గాంధీజీ ఆశయం – విద్వేషపూరిత పాలనా పద్దతులను విడనాడి శాంతి సౌభ్రాతృత్వాలను నెలకొల్పడమే గాంధీజీకి మనమందించే ఘన నివాళి’ అంటూ తెలంగాణ ఉద్యమ నేపథ్యం.. స్వరాష్ట్రం సాధించిన వైనాన్ని వివరిస్తూనే నేటి పరిపాలన విద్వేషపూరితంగా ఉందనే విషయాన్ని చెప్పడం ఈ మాటల వెనుక ఉన్న కేసీఆర్ భావనగా చెబుతున్నారు. ‘న్యాయమైన ప్రజల ఆకాంక్షల కోసం, నిరంకుశ ప్రభుత్వాల మీద పోరాడే నాయకత్వం, విశాల దృక్పథంతో తమ పోరాట కార్యాచరణను రూపొందించుకోవాలనే తాత్వికతను గాంధీజీ జీవితం నుంచి నేర్చుకోవాల్సి వున్నదన్నారు’ -అంటూ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన విషయాన్ని గుర్తు చేయడమే కాదు.. నిరంకుశ ప్రభుత్వాల మీద పోరాడాలని ప్రజలకు ఈ విధంగా పిలుపును కూడా ఇచ్చారు కేసీఆర్ పరోక్షంగా.
తెలంగాణ జాతికి ఇలా గుర్తు చేశా..
‘ పీడితులందరినీ సమన్వయం చేసుకుంటూ, భావజాల వ్యాప్తిని చేస్తూ, శాంతియుత పోరాటంలో భిన్న వర్గాలను ఐక్యసంఘటన శక్తిగా తీర్చిదిద్దుకోవాలనే గాంధీజీ ఆశయాలను ప్రతీవొక్కరు అనుసరించాలన్నారు’- ఇదీ తెలంగాణ పోరాటం.. తన నేపథ్యాన్ని గుర్తు చేసేందుకు పడ్డ తండ్లాటగానే భావించారు జనం. ‘తెలంగాణ సాధన కోసం తాను వొంటరిగా ముందడుగు వేసిన నాటినుంచి నేటి వరకు ఎన్ని కష్టాలొచ్చినా తాను స్థిత ప్రజ్జతతో అనుసరిస్తున్న కార్యాచరణలో గాంధీజీ స్పూర్తి ఇమిడి వున్నదని కేసీఆర్ స్పష్టం చేశారు’. తన పార్టీ ఏర్పాటును కూడా తీసుకొచ్చి.. నాటి పరిస్థితులను ఓసారి ప్రజల ముందుంచడం ద్వారా ఓ పోరాట యోథుడి చరిత్రను మరవరాదని ఆయన తనకు తానుగా తెలంగాణ జాతికి ఇలా గుర్తు చేశారని అనుకుంటున్నారు.
మరో సారి గుర్తు చేశా పదేళ్ల పాలన
‘విద్వేష పూరిత ప్రసంగాలను, కక్షపూరిత వైఖరులను విడనాడి, ప్రజల నడుమ శాంతి సౌభ్రాతృత్వం పరిఢవిల్లేలా పాలనను కొనసాగించడం ద్వారా మాత్రమే జాతిపిత మహాత్మాగాంధీ కి మనం నిజమైన నివాళులు అర్పించిన వారమౌతామని కేసీఆర్ పునరుద్ఘాటించారు’- ఇది కచ్చితంగా పనిగట్టుకుని మరీ రేవంత్‌ను గట్టిగానే అర్సుకునే క్రమంలో కేసీఆర్ నుంచి వచ్చిన పంచులుగానే చూస్తున్నారు. తన పాలన ఎలా ఉండే .. ఇప్పుడెలా ఉంది అని పదేళ్ల పాలనను ప్రజలకు మరోసారి ఈ సందర్బంగా గుర్తు చేసే ప్రయత్నం చేశారు కేసీఆర్.
Also Read: ఫ్లై దుబాయ్ కాక్‌పిట్‌లో ఏం జరిగింది? గాల్లో ఉండగానే పైలట్‌పై కో-పైలట్ దాడి!