E-Paper
Advertisement

ఫ్లై దుబాయ్ కాక్‌పిట్‌లో ఏం జరిగింది? గాల్లో ఉండగానే పైలట్‌పై కో-పైలట్ దాడి!

ఫ్లై దుబాయ్ కాక్‌పిట్‌లో ఏం జరిగింది? గాల్లో ఉండగానే పైలట్‌పై కో-పైలట్ దాడి!
Advertisement

Flydubai Cockpit: అమెరికాలో ట్విన్ టవర్స్‌పై ఉగ్రదాడి తర్వాత సివిల్ ఏవియేషన్‌లో చాలా మార్పులొచ్చాయి. ఎటాకర్స్, హైజాకర్స్ ఎవరూ కాక్‌పిట్‌లోకి ఎంటర్ కాకుండా కఠినమైన చర్యలు తీసుకున్నారు. అయితే ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. ఫ్లై దుబాయి విమానంలో పైలట్‌పై కో-పైలట్ దాడి ఘటనతో కొత్త ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఇక్కడ ఎటాకర్స్ ప్రయాణికులు కాదు. స్వయంగా కో-పైలటే దాడికి దిగాడు. కాక్‌పిట్‌ను కెప్టెన్ తెరవగలిగాడు కాబట్టి సరిపోయింది. లేదంటే పెనుప్రమాదమే జరిగేది.

ఆల్ప్స్  పర్వతాలను ఢీకొట్టిన పైలట్..

Advertisement

9/11 ఉగ్రదాడి తర్వాత బుల్లెట్‌ప్రూఫ్, రీయిన్‌పోర్స్‌డ్ డోర్స్‌ను కాక్‌పిట్‌కు అమర్చడం మొదలైంది. పైలట్ల బ్యాక్‌గ్రౌండ్ చెకింగ్, ఎయిర్‌పోర్టులో ఐడెంటిటీ చెకింగ్‌ను తీవ్రతరం చేశారు. ఇందులో కాక్‌పిట్ డోర్స్‌ను బయటనుంచి ఎవరూ తెరవలేకుండా చేయడం అనేది కీలకమైంది. అయితే ఇదే ఇప్పుడు ప్రమాదకరంగా మారుతోంది. 2015లో జర్మన్ వింగ్స్ విమానంలో ఆండ్రీస్ లుబిట్జ్ అనే కో-పైలట్… కెప్టెన్‌ను బయటే ఉంచి కాక్‌పిట్ లాక్ చేశాడు. తర్వాత ఉద్దేశ్వపూర్వకంగానే విమానాన్ని తీసుకెళ్లి ఆల్ప్స్ పర్వతాలకు ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కోపైలట్‌తో సహా విమానంలో ఉన్న 150 మంది చనిపోయారు. కోపైలట్‌ మెంటల్ కండిషన్ సరిగా లేదని తర్వాత తేల్చారు.

ప్రమాదకర పరిస్థితి..

Advertisement

ప్రస్తుతం విమానాల్లోని కాక్‌పిట్ తలుపులు బయటనుంచి ఎట్టిపరిస్థితుల్లో తెరవలేనంత పటిష్టంగా ఉంటున్నాయి. పైలట్లు అనుమతిస్తేనే క్యాబిన్ క్రూ కూడా లోపలికి వెళ్లగలరు. అత్యవసర పరిస్థితిలో ఎమర్జన్సీ కీపాడ్ ద్వారా లోపలికి వెళ్లొచ్చు. అయితే ఎమర్జన్సీ ఎంట్రీ రిక్వెస్ట్‌ను లోపల ఉన్న పైలట్ క్యాన్సిల్ చేయకపోతేనే లోపలికి వెళ్లగలరు. లోపల ఉన్న పైలట్లు ఉద్దేశ్యపూర్వకంగా ప్రమాదం తలపెడితే ఎమర్జన్సీ రిక్వెస్ట్‌ను క్యాన్సిల్ చేయగలరు. కాబట్టి ఎలా చూసినా పరిస్థితి ప్రమాదకరంగానే కనిపిస్తోంది.

పైలట్ స్మిత్ మచ్చర్‌పై దాడి..

ఇక పైలట్ స్మిత్ మచ్చర్‌పై దాడి చేయడానికి పదునైన ఆయుధం కాక్‌పిట్‌లోకి ఎలా వచ్చిందని మొదట అనుమానాలు వచ్చాయి. కో-పైలట్ బయట నుంచి ఎలాంటి ఆయుధం తేలేదని ద్యర్యాప్తు బృందం నిర్ధారించింది. కాక్‌పిట్‌లో ఉండే క్రాష్ యాక్స్‌తోనే దాడి చేసినట్టు చెప్తున్నారు. గతంలో దీనిని మెయిన్ క్యాబిన్‌లో ఉంచేవాళ్లు. దీన్ని ప్రయాణికులు ఎవరైనా ఆయుధంగా వాడతారన్న భయంతో.. 9/11 ఉగ్రదాడి తర్వాత కాక్‌పిట్‌లోకి మార్చారు. ప్రస్తుతం దానినే కోపైలట్ ఆయుధంగా వాడాడు.

Also Read:బొల్లారం ఆయుధాల చోరీ కేసులో సంచలనం.. బంగ్లాదేశీలకు అమ్మేందుకే ఏకే-47లు, పిస్టళ్లు!

Tags

Related News

టిబెట్‌లో చైనా రహస్య తవ్వకాలు.. భారత్‌కు పొంచి ఉన్న అతిపెద్ద పర్యావరణ ముప్పు!

ఇది జిహాదీ ఉగ్రదాడే.. దీని వెనుక ఎవరున్నా వదిలిపెట్టం.. ఇజ్రాయెల్ విదేశాంగమంత్రి వార్నింగ్!

ఫ్లై దుబాయి విమానంలో ఏం జరిగింది? ఘటన తర్వాత, విమానంలో చికిత్స చేసిన ఓ డెంటిస్ట్

ఫ్లైదుబాయ్ ఎయిర్‌లైన్స్ ఘటన.. 180 మందిని కాపాడిన కెప్టెన్ స్మిత్ మనోడే, ఇజ్రాయెల్ పీఎం, ట్రంప్ ప్రశంసలు

కుప్పకూలిన హెలికాఫ్టర్.. వ్యాపారవేత్తతోపాటు ఆరుగురు మృతి, జింబాబ్వేలో ఘటన

విమానానికి హైజాక్ హెచ్చరికలు.. 2 నిమిషాల్లో 17,400 అడుగులు, పైలట్ల మధ్య ఘర్షణతో..

భారతీయులకు ట్రంప్ సర్కార్ షాక్.. EB-5 గ్రీన్‌‌కార్డ్ ఫీజులు భారీగా, నవంబర్ నుంచి అమల్లోకి

Big Stories

Advertisement
×