New depression cure 2025: సినిమాల్లో మతిపోయినవారిని మంచానికి కట్టి, వైద్యులు ఇద్దరు చేతులు పట్టుకుని కరెంటు షాకిస్తున్నట్లు చూపిస్తారు కదా! ఆ దృశ్యాన్ని చూసినప్పటి నుంచీ ‘షాక్ ట్రీట్మెంట్’ అంటే చాలామందికి భయం పుట్టడం సహజం. ఓహ్! మెదడే పోతుందేమో.. అనే భయం… కానీ ఇప్పుడు అదే షాక్ ట్రీట్మెంట్ అంటే భయం కాదు.. భరోసా. ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పేలా హైదరాబాద్ శాస్త్రవేత్తలు చేసిన ఒక కొత్త పరిశోధన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు లోనవుతోంది.
ఈ పరిశోధన ఎందుకు చేశారంటే?
హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB) శాస్త్రవేత్తలు, ఘజియాబాద్‌లోని అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ (AcSIR)తో కలిసి ఈ పరిశోధన చేశారు. షాక్ ట్రీట్మెంట్ అంటే భయపడే అవసరం లేదని, ఇది వాస్తవానికి మెదడులో నెమ్మదిగా పనిచేస్తున్న నర్వ్ సిస్టమ్‌ని మళ్లీ ఉత్తేజితం చేయడానికి ఉపయోగపడుతుందని వారు తేల్చారు. ఈ స్టడీ Impact of ECT in neurometabolic activity in a mice model of depression పేరుతో ప్రఖ్యాత న్యూరోగ్లియా అనే అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురించబడింది.
మేకలపై ఫస్ట్ ప్రయోగం..
శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో మానవులకు దగ్గరగా ఉండే ప్రయోగ మేకపోతులను తీసుకుని, ముందుగా వాటిలో డిప్రెషన్ లక్షణాలను రాగలిగేలా చేశారు. ఆ తరువాత షాక్ ట్రీట్మెంట్ ఇవ్వగా, వాటి మెదడులో పలు మార్పులు చోటు చేసుకున్నట్టు గుర్తించారు. ముఖ్యంగా భావోద్వేగాలు, ఆలోచనలు సంబంధిత మెదడు భాగాలు తిరిగి చురుకుగా మారినట్టు తేలింది. ఇది మామూలుగా మందులతో సాధించలేని స్థాయిలో మార్పు అని పరిశోధకులు తెలిపారు.
Also Read: Wine shops closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ఆ రెండు రోజులు వైన్ షాపులు బంద్!
షాక్ ఇస్తే.. మెదడు హై రేంజ్ స్పీడ్ అట!
ఒక ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ ట్రీట్మెంట్ తర్వాత మేకపోతుల మెదడు తగిన రీతిలో శక్తిని వినియోగించటం మొదలుపెట్టింది. షుగర్ వాడకాన్ని కూడా మెదడు తిరిగి నియంత్రించగలిగిందట. అంటే ఇది కేవలం వైద్య పరీక్షల్లోనే మార్పు చూపడం కాదు.. ఆ ప్రాణిలో ఉన్న వ్యవహార శైలి కూడా మెరుగవడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. ఇలా మెదడును రీసెట్ చేయగలిగే సామర్థ్యం ECTలో ఉందని వారు ప్రకటించారు.
ఇదే బృందం మరో అధ్యయనాన్ని The Journal of ECT లో ప్రచురించింది. అందులోనూ ఇదే విషయాన్ని వివరించారు. ఈ ట్రీట్మెంట్ కారణంగా కొద్దిసేపు మెదడులో ఎనర్జీ ఫ్లో అసహజంగా ఉన్నా, తర్వాత మెదడు బాగా స్పందిస్తోందట. అంటే మానసిక ఒత్తిడితో బాధపడేవారికి ఇది ఒక పెద్ద దారి చూపించగలదు.
ఇప్పటికీ చాలా మంది ECT అంటే మూర్ఛ, గాయం, మతి భ్రమలా ఏదో అనుకుంటారు. కానీ ఈ పరిశోధనలు చెబుతున్న విషయమేమిటంటే.. ఇది శాస్త్రీయంగా నిరూపితమైన, మంచి ఫలితాలు ఇచ్చే మెథడ్. అలాంటి అపోహలను తొలగించేందుకు, ప్రజలలో అవగాహన పెంచేందుకు ఈ స్టడీ దోహదపడుతుందని పరిశోధకులు తెలిపారు.
డిప్రెషన్ అనేది మానసిక సమస్య. కానీ దానికి పరిష్కారం శక్తివంతంగా ఉండాలి. మెదడే సరిగ్గా పని చేయకపోతే మనుషుల జీవితమే గందరగోళంగా మారుతుంది. అలాంటి వారిని మందులతో చికిత్స చేస్తూ వాళ్లపై ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేకుండా, మెదడునే రీసెట్ చేసే ఈ ట్రీట్మెంట్ వల్ల వారిలో ఆశ చిగురించనుంది.
ఈ స్టడీ వల్ల ECTపై ఉన్న అపోహలు తొలగిపోతున్నాయి. మెదడును కూల్ చేయడంలో, నర్వ్ సిస్టమ్‌ని తిరిగి ట్రాక్‌లో పెట్టడంలో ఇది మంచి పరిష్కారంగా మారనుంది. ముఖ్యంగా మందులు పని చేయని వారికైతే ఇది ఒక గొప్ప ప్రత్యామ్నాయంగా మారనుంది. హైదరాబాద్ శాస్త్రవేత్తలు చేస్తున్న ఈ కృషి, ప్రపంచవ్యాప్తంగా మందులు వినిపించని వారికి కొత్త ఆశగా నిలుస్తోంది.
అసలు సంగతేమిటంటే.. ఇప్పటివరకు ‘షాక్’ అంటే భయం. ఇకపై ‘షాక్’ అంటే ‘రిఫ్రెష్‌మెంట్’. అది కూడా మెదడుకు! ఇప్పుడున్న ఈ ఆధునిక వైద్యంలో, శాస్త్రీయంగా అభివృద్ధి చెందిన టెక్నాలజీలో, మానసిక సమస్యలకు కూడా వైజ్ఞానిక పరిష్కారాలు దొరుకుతున్నాయంటే.. ఇది నిజంగా శాస్త్ర విజయమే అంటున్నారు పరిశోధకులు!