BigTV English

Rain News: ఈ ప్రాంతానికి రేపు భారీ వర్షం.. ఈదురుగాలులతో కూడిన కుండపోత వాన

Rain News: ఈ ప్రాంతానికి రేపు భారీ వర్షం.. ఈదురుగాలులతో కూడిన కుండపోత వాన

Rain News: గత పది రోజుల నుంచి తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. గడిచిన నెలలో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అంతగా కొట్టలేదు. జూన్ నెలలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు కురిశాయి. ఈసారి వర్షాలు సమృద్దిగా కురుస్తాయని రైతులు కాస్త ముందస్తుగానే వ్యవసాయ పనులు మొదలుపెట్టారు. మే నెల చివరి వారంలోనే పత్తి గింజలు, నార్లు పోశారు. అయితే ఆ తర్వాత జూన్ నెల వర్షాలు పడకపోవడంతో రైతులు ఆందోళన చెందారు.. ఎప్పుడెప్పుడు వర్షాలు పడుతాయా? అని ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, గత పది రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి. దీంతో రైతులు వ్యవసాయ పనుల్లో బిజీ అయిపోయారు.


కాసేపట్లో ఈ ప్రాంతంలో వర్షం..

తాజాగా.. తెలంగాణ వెదర్ మ్యాన్ టీ. బాలాజీ భాగ్యనగర వాసులను అలర్ట్ చేశారు. రాబోయే గంటలో గచ్చిబౌలి, గండిపేట్, షేక్ పేట్, టోలీ చౌకీ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. అలాగే రాబోయే నాలుగు రోజుల్లో ఉత్తర తెలంగాణకు మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ వాతావరణ శాఖ (IMD) తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, 115 mm నుంచి 205 mm వరకు వర్షం కురిసే ఛాన్స ఉందని తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తీవ్రమైన వర్షపాతం, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వివరించింది. ఈ వాతావరణ పరిస్థితి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తలెత్తుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ అల్పపీడనం వల్ల తీవ్రమైన వాతావరణ మార్పులు చోటుచేసుకోనున్నాయి. రాష్ట్రంలోని అనేక జిల్లాలపై దీని ప్రభావం పడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.


తెలంగాణలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ వర్షాలు భారీ వర్షాలు పడుతోన్న క్రమంలో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ భారీ వర్షాల వల్ల వరదలు, ట్రాఫిక్ ఆటంకాలు, విద్యుత్ సరఫరా సమస్యలు తలెత్తే అవకావం ఉంది. అందువల్ల, ప్రజలు అత్యవసరం అయితేనే తప్ప బయటకు రాకుండా ఉండాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు.

ALSO READ: Morocco News: ఒకే కాన్పులో 9 మందికి జన్మనిచ్చిన మహిళ.. బతికే ఛాన్సే లేదన్నారు, కానీ..

రాష్ట్ర ప్రభుత్వం ఈ హెచ్చరికల నేపథ్యంలో అన్ని జిల్లాల్లో అప్రమత్తత కొనసాగించాలని ఆదేశించింది. వరదలు సంభవించే ప్రాంతాల్లో రెస్క్యూ బృందాలు, వైద్య సిబ్బంది సిద్ధంగా ఉంచారు. అలాగే, వర్షం వల్ల రోడ్లు జలమయమైన ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు అదనపు ఏర్పాట్లు చేశారు. రైతులకు కూడా తమ పంటలను కాపాడుకోవడానికి, సాగు నీటిని సరిగ్గా నిర్వహించుకోవాలని కీలక సూచనలు చేశారు. వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ, స్థానిక అధికారుల సూచనలను ప్రజలు పాటించాలని అధికారులు కోరారు. అత్యవసర సహాయం కోసం రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులో ఉంచింది.

ALSO READ: Airport Jobs: బంపర్ ఆఫర్ భయ్యా.. పదితో 1446 ఉద్యోగాలు, ఒక్కసారి అప్లై చేసి చూడండి..

అయితే.. రాష్ట్రంలో ఉరుములు, పిడుగుల వర్షం ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. పొలాల వద్ద ఉన్నప్పుడు చెట్ల కింద నిలబడొద్దని సూచిస్తున్నారు. చెట్ల మీద పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. రాబోయే ఈ రెండు, మూడు రోజులు అత్యవసరం అయితే తప్ప పొలాల వద్దకు రైతులు వెళ్లొద్దని అధికారులు సూచించారు.

Related News

GHMC Hyderabad: హైదరాబాద్‌లో.. ఇన్ని లక్షల గణేషుడి ప్రతిమలా! జీహెచ్ఎంసీ కీలక ప్రకటన!

Hyderabad Tank Bund: గణనాథుడి నినాదాలతో మార్మోగిన హైదరాబాద్.. శోభాయాత్రలో పోలీసుల డాన్స్

Hyderabad Water: హైదరాబాద్‌లో రెండు రోజులు నీళ్లు బంద్.. ఏ ఏరియాల్లో అంటే?

CM Revanth Reddy: సామాన్యుడిలా ట్యాంక్ బండ్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి

Hyderabad Drug: హైదరాబాద్‌లో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. 12 వేల కోట్ల మాదక ద్రవ్యాలు సీజ్

Kavitha Vs Harish: తెలంగాణ లీక్స్.. కవితక్క అప్ డేట్స్

Big Stories

×