BigTV English

KCR Health: కేసీఆర్‌ హెల్త్ అప్‌డేట్స్.. డాక్టర్లు ఏమన్నారు, బులిటెన్ రిలీజ్

KCR Health: కేసీఆర్‌ హెల్త్ అప్‌డేట్స్.. డాక్టర్లు ఏమన్నారు, బులిటెన్ రిలీజ్

KCR Health: తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఆరోగ్యం సరిగా లేకపోవడంతో గురువారం సాయంత్రం కుటుంబసభ్యులు సోమాజిగూడలోని యశోధ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు అన్నిరకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ట్రీట్‌మెంట్ అందిస్తున్నట్లు డాక్టర్లు చెప్పారు. కేసీఆర్ ఆసుపత్రికి వచ్చిన సమయంలో ఆయన వెంట భార్య శోభ, కేటీఆర్, హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ ఉన్నారు.


కేసీఆర్‌ను యశోధ ఆసుపత్రికి వచ్చిన వెంటనే ఆమె ఒళ్లు వేడిగా ఉండటం, నీరసంగా ఉండడంతో వైద్యులు వివిధ పరీక్షలు నిర్వహించారు. సీజనల్ ఫీవర్‌తో ఆయన బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఆయన శరీరంలో బ్లడ్ షుగర్ అధికంగా, సోడియం మోతాదు తక్కువగా ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడైంది.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొన్నాయి.  తండ్రి ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు కవిత శుక్రవారం ఆసుపత్రికి రానున్నట్లు పార్టీ వర్గాలు చెప్పుకొచ్చాయి.  రాత్రి రావాలని భావించినప్పటికీ  టెస్టులు చేస్తుండడంతో వెళ్లలేని పరిస్థితి నెలకొందని అంటున్నారు.


కేసీఆర్ ఆరోగ్యం సరిగాలేదన్న తెలిసిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. సోమాజీగూడలోని యశోధ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడారు. ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచన చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు.

ALSO READ: సనత్‌నగర్ ఘటన ఒక హెచ్చరిక.. రిఫ్రిజరేటర్లు ఎందుకు పేలుతాయో తెలుసా?

గతంలో కేసీఆర్‌ యశోద ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్న విషయం తెల్సిందే. యశోద ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వడం ఇది మూడోసారి. కేసీఆర్ అస్వస్థతకు గురైన విషయం తెలుసుకొన్న వెంటనే కార్యకర్తలు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు. పెద్దాయన వేగంగా కోలుకోవాలని కోరుతూ సోషల్ మీడియాలో ఆకాంక్షిస్తున్నారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, యశోధ ఆసుపత్రికి తరలివస్తున్నారు.

మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఆయనకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ వీలైనంత వేగంగా కోలుకోవాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు బండి సంజయ్ చెప్పుకొచ్చారు.

కోలుకున్న తర్వాత తిరిగి ప్రజా జీవితంలోకి రావాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తన సందేశంలో ప్రస్తావించారు. కేసీఆర్ ఆరోగ్యంపై ప్రభుత్వంతోపాటు బీజేపీ నేతలు స్పందించడంతో పార్టీ శ్రేణులు కంగారు పడుతున్నారు. అధినేతకు ఏమైందంటూ చర్చించుకోవడం మొదలైంది. ఒకవేళ శుక్రవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాకుంటే ఆసుపత్రికి వెళ్లాలని ఆలోచన చేస్తున్నారు.

 

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×