E-Paper
Advertisement

Telangana Elections : కేసీఆర్, కేటీఆర్ వేదాంత ధోరణి.. ఓటమి తప్పదని భావిస్తున్నారా?

Telangana Elections : కేసీఆర్, కేటీఆర్ వేదాంత ధోరణి.. ఓటమి తప్పదని భావిస్తున్నారా?
Advertisement

Telangana Elections : ఎన్నికల్లో గెలుపోటములపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వేదాంత ధోరణిలో మాట్లాడటం… తెలంగాణలో చర్చనీయాంశమైంది. ఈ భూమ్మీదకు ప్రతీ ఒక్కరూ ఎక్స్‌పైరీ డేట్‌తో వస్తారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్ వేదాంత ధోరణిలో మాట్లాడారు. అధికారం శాశ్వతం అని అహంభావంతో ఎవరైనా అనుకుంటే వారు అజ్ఞానులే అని పేర్కొన్నారు. ఎవరైనా ఎప్పుడైనా ఇంటికి పోవాల్సిందేనని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

తాము కూడా ఇంటికి పోవడానికి రెడీగానే ఉన్నామని కేటీఆర్ అన్నారు. కానీ BRS కన్నా ఇతర పార్టీలు మెరుగైన పరిపాలన ఇవ్వలేవని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. “ఎలక్షన్స్ ఓన్లీ ఫర్ రిజెక్షన్, నాట్‌ ఫర్ సెలక్షన్‌” అనే సామెతను చెప్పారు. ప్రజలు విసిగిపోతే ఏ పార్టీనైనా ఇంటికి పంపిస్తారని చెప్పారు.

Advertisement

పదేళ్ల పాలనలో అలకలు, అసంతృప్తులు, ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందని కేటీఆర్ తెలిపారు. తాము దేవుళ్లం కాదు.. చిన్న చిన్న తప్పులు పొరపాట్లు చేసి ఉంటామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పది రోజుల కిందట సీఎం కేసీఆర్‌ కూడా ఇదే ధోరణిలో మాట్లాడారు. ఓడిస్తే పోయేదేం లేదు, రెస్ట్‌ తీసుకుంటానని కేసీఆర్ అచ్చంపేట సభలో అన్నారు. ఓటమి ఖాయమన్న భావనతోనే కేసీఆర్‌, కేటీఆర్ ఇలా మాట్లాడుతున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×