BigTV English

Sky Scrapers : ఆకాశహర్మ్యాల హాంకాంగ్

Sky Scrapers : ఆకాశహర్మ్యాల హాంకాంగ్

Sky Scrapers : ప్రపంచవ్యాప్తంగా 10 వేల నగరాలు ఉన్నాయి. భారత్‌లో లక్ష మందికిపైగా జనాభా ఉన్ననగరాలు 300 వరకు ఉండొచ్చు. నగరాలు, మహానగరాలు అనగానే గుర్తొచ్చేవాటిలో ఆకాశహర్మ్యాలు కచ్చితంగా ఉంటాయి. ఎత్తైన భవంతులకు హాంకాంగ్ నగరం పెట్టింది పేరు.


150 మీటర్లకు మించి ఎత్తైన బిల్డింగులు అత్యధికంగా ఉన్నది అక్కడే. 1980లలోనే హాంకాంగ్‌లో నింగినంటేలా భవనాల నిర్మాణం జరిగింది. హోప్‌వెల్ సెంటర్, సన్ హంగ్ కాయ్ సెంటర్ అలా నిర్మించిన తొలి ఆకాశహర్మ్యాలు. వాటి ఎత్తు ఒక్కొక్కటి 200 మీటర్లకుపైగా ఉంటుంది.

అనంతరం హాంకాంగ్‌లో 550కి పైగా స్కైస్రాపర్లు నిర్మితమయ్యాయి. వాటిలో ఏ ఒక్కటీ 150 మీటర్ల కన్నా తక్కువ ఎత్తు ఉండదు. చైనా మెట్రోనగరం షెన్జెన్, అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ 2, 3 స్థానాలను ఆక్రమించాయి. 150 మీటర్ల కన్నా ఎత్తు ఉన్న భవంతులు షెన్జెన్‌లో 390 ఉంటే.. న్యూయార్క్‌లో 316 వరకు ఉన్నాయి.


యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని దుబాయ్‌.. 258 స్కైస్క్రాపర్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ప్రపంచంలోనే అతి ఎత్తైన కట్టడం బుర్జ్ ఖలీఫా ఇక్కడే ఉంది. దీని ఎత్తు 828 మీటర్లు. గాంగ్జౌ(190), షాంఘై(183), టోక్యో(172), కౌలాలంపూర్(164) నగరాలు కూడా భారీ భవంతులకు చిరునామాగా నిలుస్తాయి.

Related News

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Big Stories

×