BRS: అధికార పార్టీని ఇరుకున పెట్టాలని భావించి బీఆర్ఎస్ ఇరుకున పడుతోందా? పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయించాలన్న ప్లాన్ ఫెయిల్ అయ్యిందా? స్పీకర్ అనర్హత వేటు వేస్తే ఏం చేయ్యాలి? వేయకపోతే ఏ విధంగా ముందుకు అడుగులు వేయాలి? అనేదానిపై చర్చించేందుకు కీలక నేతలు కేసీఆర్‌తో సమావేశమయ్యారు.
తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ తర్జనభర్జన పడుతోంది. నేతల వలసలు ఒకవైపు.. మరోవైపు పార్టీలో అంతర్గత సమస్యలు ఇలా అనేక అంశాలతో ఆ పార్టీ కేడర్ డీలా పడుతోంది. అధికారం పోయి దాదాపు ఏడాదిన్నర గడుస్తున్నా కీలక నేతలంతా కేవలం హైదరాబాద్‌కి పరిమితమయ్యారు.
తొలుత నేతలు వలస పోకుండా ఆపాలని భావించి సుప్రీంకోర్టు తలుపు తట్టింది బీఆర్ఎస్. అక్కడా ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోకుండా స్పీకర్‌కు అప్పగించింది. కేవలం మూడునెలల సమయం ఇచ్చింది. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీకి చిన్న రిలీఫ్.
బీఆర్ఎస్‌కు అసలు పరీక్ష ఇప్పుడే మొదలుకానుంది. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పు తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్‌రావు, జగదీష్‌రెడ్డిలు ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో సమావేశమయ్యారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చిస్తున్నారు.
ALSO READ: పిల్లల చదువు పేరుతో లక్షల రూపాయల బాదుడు, ఎవరి బాధ్యత?
న్యాయస్థానం తీర్పుపై ఏ విధంగా ముందుకు వెళ్లాలి? అనేదానిపై చర్చించుకుంటున్నారు. ఒకవేళ 10 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేసే అవకాశం ఉండదని అంటున్నారు. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలను అధికార పార్టీ ఎంచుకుంటుందని భావిస్తున్నారు.
పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఎవరైనా కాంగ్రెస్ లేదా బీజేపీ వైపు వెళ్లేవారు ఉన్నారంటూ కేసీఆర్ ఆరా తీసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఎమ్మెల్యేలంతా సైలెంట్‌గా ఉన్నారని, రేపటి రోజున ఏం జరుగుతుందో తెలీదని అంటున్నారు. ఎలాగూ 90 రోజులు సమయం ఉన్నందున స్పీకర్ నిర్ణయాన్ని బట్టి అడుగులు వేద్దామని అంటున్నారు.
ఇదే సమయంలో కాళేశ్వరం కమిషన్ గురువారం తన రిపోర్టును ప్రభుత్వానికి అందజేసింది. ప్రభుత్వం ఆ రిపోర్టును అసెంబ్లీలో చర్చించి అందుకు బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
అధికారులా బుక్కవుతారా? నేతలు బుక్కవుతారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రాజెక్టు డిజైన్ మొదలు నిర్మాణం వరకు అధికారులు, నేతలంతా అప్పటి సీఎం చెప్పినట్టు చేశామని బహిరంగ విచారణలో వెల్లడించారు. దీనిపై కేసీఆర్ టీమ్ చర్చిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి అడుగులు వేయాలని డిసైడ్ అయినట్టు అంతర్గత సమాచారం.
ఎర్రవల్లిలోని నివాసంలో పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశం
కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డిలతో సమావేశమైన కేసీఆర్
కాళేశ్వరం కమిషన్ నివేదిక, ఎమ్మెల్యేల అనర్హత వేటుపై సుప్రీంకోర్టు తీర్పుపై చర్చించే అవకాశం pic.twitter.com/Ng1Pz39Yj2
— BIG TV Breaking News (@bigtvtelugu) July 31, 2025