BigTV English
Advertisement

War 2: వార్ 2 నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్.. “ఊపిరి ఊయలగా” అంటూ

War 2: వార్ 2 నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్.. “ఊపిరి ఊయలగా” అంటూ

War 2: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan), టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ (NTR ) ప్రధాన పాత్రలో పోషిస్తూ నటిస్తున్న చిత్రం వార్ 2 (War 2). ఇందులో ప్రముఖ హీరోయిన్ కియారా అద్వానీ (Kiara advani) హీరోయిన్గా నటిస్తోంది. భారీ అంచనాల మధ్య ఆగస్టు 14వ తేదీన రజనీకాంత్ (Rajinikanth) ‘కూలీ’ సినిమాకు పోటీగా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి ట్రైలర్ విడుదల చేయగా.. ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇద్దరి పాత్రలను రివీల్ చేస్తూ షేర్ చేసిన ట్రైలర్ సినిమాపై హైప్ పెంచేసింది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా నుంచి మరో రొమాంటిక్ సాంగ్ ను విడుదల చేసింది చిత్ర బృందం. “ఊపిరి ఊయలగా” అంటూ సాగుతున్న ఈ పాట మూవీ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది.


ఊపిరి ఊయలగా అంటూ రొమాంటిక్ సాంగ్ రిలీజ్..

తాజాగా రిలీజ్ చేసిన ఊపిరి ఊయలగా సాంగ్ హృతిక్ రోషన్ – కియారా మధ్య చిత్రీకరించింది. వీరిద్దరి మధ్య చిత్రీకరించిన ఈ రొమాంటిక్ సాంగ్ చాలా ఫ్రెష్ గా , కొత్తగా అనిపిస్తోందని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రతి షార్ట్ మూవీ లవర్స్ ఇష్టపడేలా అటు ప్రేమికుల కోసమే దీనిని అద్భుతంగా తీర్చిదిద్దారు అనే కామెంట్స్ కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక మరి కొంతమంది ఎన్టీఆర్ అన్నకు సంబంధించిన పాటను కూడా రిలీజ్ చేయండి అని ఎన్టీఆర్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ ఊపిరి ఊయలగా అంటూ సాగుతున్న పాట ఫీల్ ఫ్రెష్ అనే అనుభూతి కలిగిస్తోంది అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇక ఈ తెలుగు పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. శశ్వాంత్ సింగ్ ఆలపించారు.


వార్ 2 సినిమా విషయానికి వస్తే..

యష్ రాజు ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. అడ్వెంచర్ మూవీగా రాబోతున్న ఈ సినిమా వార్ చిత్రానికి సీక్వెల్ గా రాబోతున్న విషయం తెలిసిందే..

ఎన్టీఆర్ సినిమాలు..

ఇకపోతే ఎన్టీఆర్ ఈ వార్ 2 చిత్రంతో బాలీవుడ్ రంగ ప్రవేశం చేస్తున్నారు. ఈ సినిమా ఆయనకు బాలీవుడ్ లో మొదటి సినిమానే అయినా.. అటు నార్త్, ఇటు సౌత్ లో అంచనాలు పెరిగిపోయాయి. పైగా ఈ సినిమా కోసం దాదాపుగా భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక మరొకవైపు తెలుగులో ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత దేవర సీక్వెల్ దేవర 2 లో కూడా ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఇక ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత విడుదలైన ఈ సినిమా మొదట మిశ్రమ స్పందన తెచ్చుకున్నా.. సైలెంట్గా రూ.600 కోట్ల క్లబ్లో చేరిపోయి రికార్డు సృష్టించింది. ఇక ఇప్పుడు వార్ 2 తో మరో సంచలనం సృష్టించడానికి సిద్ధమయ్యారు ఎన్టీఆర్.

ALSO READ:Mrunal Thakur: మృణాల్ కి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చిన డెకాయిట్ టీం..పైగా పాత్ర నేమ్ రివీల్ చేస్తూ!

Related News

Prakash Raj: కేరళ రాష్ట్ర అవార్డులు.. ప్రకాశ్ రాజ్ పై చైల్డ్ ఆర్టిస్టు ఫైర్

Megastar Chiranjeevi : అన్నపూర్ణ స్టూడియోలో మన శంకరవరప్రసాద్ గారు, సినిమా పూర్తయ్యేది అప్పుడే

Sai Durgha Tej : స్టార్డం అంటే హీరోలతో ఫోటోలు దిగడం కాదు, సాయి తేజ్ అలా అనేశాడేంటి?

Ram Charan: ఆ బాలీవుడ్ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా, ఈసారి హిట్ ఖాయం

Thiruveer: ఆ సినిమా టికెట్ కౌంటర్ లోనే చచ్చిపోతా అనుకున్నా

Kaantha First Spark: దుల్కర్ కాంత.. చాలా గట్టిగానే ఉండబోతున్నట్టుందే

Parasakthi: సింగారాల సీతాకోకవే.. ఏముందిరా సాంగ్.. నెక్స్ట్ లెవెల్ అంతే

Ustaad Bhagat Singh : సక్సెస్ కంటే ఫెయిల్యూర్స్ ఎక్కువ, మరి ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్థితి ఏంటి?

Big Stories

×