E-Paper
Advertisement

KCR popularity decline : సీఎంగా కేసీఆర్ పాపులారిటీ తగ్గిందా?

KCR popularity decline : తెలంగాణ ప్రజల అభిప్రాయంలో భారీ మార్పు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన కొన్నిఎన్నికల సర్వేలలో ఈ మార్పు స్పష్టంగా కనిపించింది. దీనికి కార‌ణం గతం ఎన్నికల డేటాతో పోల్చితే ఈ సారి ఎన్నికల సర్వేలో చాలా మంది ప్రజలు కేసీఆర్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కోరుకోవడంలేదు.

KCR popularity decline : సీఎంగా కేసీఆర్ పాపులారిటీ తగ్గిందా?
CM KCR Latest news

CM KCR Latest news(TS Political News):

తెలంగాణ ప్రజల అభిప్రాయంలో భారీ మార్పు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన కొన్నిఎన్నికల సర్వేలలో ఈ మార్పు స్పష్టంగా కనిపించింది. దీనికి కార‌ణం గతం ఎన్నికల డేటాతో పోల్చితే ఈ సారి ఎన్నికల సర్వేలో చాలా మంది ప్రజలు కేసీఆర్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కోరుకోవడంలేదు.

దీనికి కార‌ణం.. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో చేసిన సర్వేలలో “మీకు ముఖ్య‌మంత్రిగా ఎవ‌రు అయితే బాగుంటుంది” అని తెలంగాణ ప్రజలను ప్రశ్నించినప్పుడు స‌గానికి పైగా ముక్త‌కంఠంతో కేసీఆర్‌ను కోరుకున్నారు. ఆ సర్వేలో దాదాపు 65 శాతం మంది ప్రజలు సీఎంగా కేసీఆర్‌నే ఇష్టపడ్డారు. అప్పుడు ఆయనకు తెలంగాణ తెచ్చిన నాయ‌కుడిగా ఇమేజ్ ఉంది.

క‌ట్‌చేస్తే.. నాలుగున్నరేళ్ల తరువాత 2018 ఎన్నిక‌లకు రంగం సిద్ధమైంది. ఆ ఎన్నిక‌ల స‌మ‌యంలో కూడా సర్వేలలో అదే ప్రశ్న అడిగితే కేసీఆర్‌ను సీఎంగా కోరుకునే వారి సంఖ్య 53-51 శాతానికి తగ్గిపోయినట్లు తేలింది. కానీ ఆ ఎన్నికలలో గులాబీ బాస్ వ్యూహం మార్చి కేంద్రంలో ఉన్న బీజేపీ అండదండలతో మేజిక్ ఫిగర్ కన్నా ఎక్కువ సీట్లు సాధించారు. రెండవసారి ముఖ్యమంత్రి పదవిని కైవసం చేసుకున్నారు.

కానీ ఇప్పుడు జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌లు ఆయనకు కీలకంగా మారాయి. ఎందుకంటే ఈసారి జరిగిన మెజారిటీ సర్వేలలో ప్రజల అభిప్రాయంలో భారీ మార్పు కనిపించింది. ఈ సారి తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు కావాలని కోరుకుంటున్నారు అని ప్రశ్నకు సమాధానంగా కేవలం 38-36 శాతం ప్రజలు మాత్రమే ఆయనను మళ్లీ సీఎం కావాలని అభిప్రాయపడ్డారు. ఈ లెక్కలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. పైగా దాదాపు అన్ని సర్వేలలో బొటాబోటీ పోటీ ఉంటుందని. ఫలితాలలో హంగ్ కూడా రావచ్చని తెలుస్తోంది.

గ‌త ప‌దేళ్లుగా తెలంగాణలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. దేశం గ‌ర్విచ‌ద‌గ్గ ప‌థ‌కాలు తెచ్చామ‌ని.. ద‌ళిత బంధు వంటి కీల‌క ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని చెబుతున్నా.. ఆయ‌న పాపులారిటీ, సీఎం ఇమేజ్ పడిపోయిందని 36 శాతం చూపుతున్న సర్వే లెక్కలు చెబుతున్నాయి.

అయితే కేసీఆర్ ఇప్పటివరకు ఇలాంటి గడ్డు పరిస్థితులు పలు మార్లు ఎదుర్కున్నారు. ఉదాహరణకు తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె జరుగుతున్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఆందోళన, నిరసనలు, ధర్నాలు జరిగాయి. ఆర్టీసీ కార్మికులని క్రమంగా తన దారికి తీసుకొచ్చిన అసమాన్యుడు కేసీఆర్. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ గ్రాఫ్ విపరీతంగా పెరుగుతోంది మరి ఈ సారి కేసీఆర్ ఎలా గట్టెకుతారో ఎన్నికల ఫలితాలతో తేలిపోతుంది.

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×