Big Stories

KCR Twitter: ట్రెండ్ సెట్ చేస్తానంటోన్న కేసీఆర్.. ట్వీట్ల సునామీ రాబోతుందా..?

KCR Twitter Account: గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన కేసీఆర్ ట్రెండ్ సెట్ చేసే పనిలో పడ్డారంటున్నారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ (గతంలో టీఆర్ఎస్) పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ ట్విట్టర్ బాట పట్టారు. నిన్నటి వరకు ఫామ్ హౌజ్ దాటి బయటకు రాని కేసీఆర్ సామాన్యులకు దగ్గరయ్యేందుకు ట్విట్టర్‌లోకి రావడం ఆశ్చర్యంగా మారిందింటున్నారు రాజకీయ విశ్లేషకులు.

- Advertisement -

బీఆర్ఎస్ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలుపుతూ 2001 పార్టీ ఆవిర్భావ సభ నాటి ఫోటో షేర్ చేశారు. @KCRBRSPresident అనే అకౌంట్‌ను తెరిచిన కేసీఆర్ ఇప్పటికైనా జనంలోకి వచ్చినందుకు సంతోషమని నెటిజన్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే రాచరిక పోకడలనుంచి జనం దగ్గరికి వచ్చారంటూ ట్వీట్లు పెడుతున్నారు. ఇప్పటికైనా దొరగారి కళ్లు తెరుచుకున్నాయి అని మరికొందరు అంటున్నారు. ఇంకా కొందరు అయితే ప్రజాస్వామ్యంలో ఓటు రుచి చూసిన కేసీఆర్ ఓటమి దెబ్బకు నేరుగా ప్రజల వద్దకే వచ్చారని అంటున్నారు. ఏదేమైనా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు మాత్రం కేసీఆర్ ట్విట్టర్‌లోకి రావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

సోషల్ మీడియాలో కామెంట్లు ఎలా ఉన్నా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోషల్ మీడియాలోకి రావడం సంతోషకరమైన విషయమే. ప్రజల గోడును పట్టించుకోని నాయకుడిగా పేరున్న కేసీఆర్ దొర పోకడలకు స్వస్థి పలికి ఇప్పటికైనా ప్రజల దగ్గరకు చేరుకుంటే సంతోషమనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News