Big Stories

Arvind Kejriwal: కేజ్రీవాల్ ఆరోగ్యం బాగానే ఉంది.. ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!

Arvind Kejriwal health: లిక్కర్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఎయిమ్స్ మెడికల్ బోర్టు కీలక విషయాన్ని వెల్లడించింది. షుగర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మెడికల్ బోర్టు కీలక విషయాన్ని తెలిపింది.

- Advertisement -

మానీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఆరోగ్య సమస్యలపై ఇటీవలే కోర్టుకు ఆశ్రయించారు. టైప్-2 డయాబెటీస్ తో ఆయన జైలులో బాధపుపడుతున్నారని ఆప్ ఆందోళనలు వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని పరీక్షించిన ఢిల్లీలోని ఎయిమ్స్ మెడికల్ బోర్డు ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని వెల్లడించినట్లు తెలుస్తోంది.

- Advertisement -

డయాబెటీస్ కారణంగా తాను రోజు డాకర్టును సంప్రదించాలని కోరుతూ కేజ్రీవాల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇరువురి వాదనలు విన్నకోర్టు.. దీనిపై ఎయిమ్స్ మెడికల్ బోర్డుకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేజ్రీవాల్ ఆరోగ్య బాధ్యతలను ఎయిమ్స్ కి అప్పగించింది.

కోర్టు ఆదేశాల మేరకు ఎయిమ్స్ కు చెందిన ఐదుగురు సభ్యుల మెడికల్ బోర్డు శనివారం వీడియో కాన్ఫరెన్స్ లో కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించింది. ఆయన్ను పరిశీలించిన మెడికల్ బోర్డు ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఆరోగ్యంగానే ఉన్నారంటూ నివేదికను వెల్లడించినట్లు సమాచారం. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read: బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి గాయం..

అయితే ఎయిమ్స్ మెడికల్ బోర్టు దాదాపు అరగంట పాటు సీఎంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరీక్షించింది. ఆయన ఆరోగ్యంపై వారు ఆరాతీశారు. ప్రస్తుతం కేజ్రీవాల్ ఉపయోగిస్తున్న మందులనే వినియోగించాలని బోర్డు సూచించింది. మెడిసిన్ లో ఎటువంటి మార్పు చేయాల్సిన అవసరం లేదని వెల్లడించింది. రెండు యూనిట్ల ఇన్సులిన్ డోసును కొనసాగించాలని కోరింది. ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉండడంతో.. మరో తర్వాత ఈ బృందం కేజ్రీవాల్ ను మరోసారి పరీక్షించనున్నట్లు పేర్కొంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News