E-Paper
Advertisement

తీర్పు వచ్చేవరకూ ఆగాల్సిందే.. ఖైరతాబాద్ ఉపఎన్నికపై హైకోర్టు కీలక నిర్ణయం!

తీర్పు వచ్చేవరకూ ఆగాల్సిందే.. ఖైరతాబాద్ ఉపఎన్నికపై హైకోర్టు కీలక నిర్ణయం!
Advertisement

Khairatabad By-election: రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఆసక్తి కలిగిస్తున్న ఖైరతాబాద్‌ ఉపఎన్నిక వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది. ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికైన దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా దివంగత నేత పీ జనార్దన్‌రెడ్డి కుమార్తె పీ విజయారెడ్డి గతంలో దాఖలు చేసిన ఎలక్షన్‌ పిటిషన్‌పై తీర్పు వెలువడే వరకూ ఉపఎన్నిక నిర్వహించడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. ఎన్నికల సంఘం (ఈసీ) తరఫు న్యాయవాది కూడా దీనికి ప్రాథమికంగా అంగీకరించారు. ఈమేరకు, తీర్పు వెలువడేవరకూ ఉపఎన్నిక నిర్వహించబోమంటూ ఈసీ అఫిడవిట్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. పార్టీ మారినట్లు నిరూపణ కావడంతో ఖైరతాబాద్‌ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్‌ ఫిరాయింపుల చట్టం ప్రకారం పదవి కోల్పోయిన విషయం తెలిసిందే. ఫలితంగా ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో విజయారెడ్డి పిటిషన్‌తో ఒక్కసారిగా ఈ ప్రక్రియకు బ్రేక్‌ పడినట్లయింది.

ఇదీ నేపథ్యం

Advertisement

2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్‌ నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన దానం నాగేందర్‌ విజయం సాధించారు. కాంగ్రెస్‌ తరఫున బరిలో నిలిచిన విజయారెడ్డి రెండోస్థానంలో నిలిచారు. ఎన్నికల ఫలితంపై విజయారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల అఫిడవిట్‌, ఫారం-26లో దానం నాగేందర్‌ తప్పుడు వివరాలు ఇచ్చారని, వాస్తవాలు దాచిపెట్టారని.. ఆయనను అనర్హుడిగా ప్రకటించి, రెండోస్థానంలో నిలిచిన తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని పేర్కొంటూ హైకోర్టును ఆశ్రయించారు. 2024 జనవరి 20న దాఖలైన ఎన్నికల పిటిషన్‌.. జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం ఎదుట విచారణలో ఉంది. ఇటీవల దానం నాగేందర్‌పై వేటు పడటం, ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక జరగనుందన్న వార్తల నేపథ్యంలో.. విజయారెడ్డి తాజాగా గురువారం హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఎదుట పిటిషన్‌ దాఖలు చేశారు. తన ఎలక్షన్‌ పిటిషన్‌పై తీర్పు వెలువడే వరకు ఖైరతాబాద్‌ స్థానం ఖాళీ అయినట్లు లేదా ఉపఎన్నిక నిర్వహించనున్నట్లు నోటిఫై చేయకుండా ఈసీని అడ్డుకోవాలని కోరారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి అపరేశ్‌కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ రామకృష్ణారెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

బీఆర్‌ఎస్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పు

Advertisement

విజయారెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకట రమణ వాదనలు వినిపించారు. దానం నాగేందర్‌ ఎన్నిక చెల్లదని తాను దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌ (ఈపీ) హైకోర్టు సింగిల్‌ జడ్జి వద్ద పెండింగ్‌లో ఉందని.. అందులో తాను విజయం సాధిస్తే ఓట్లపరంగా రెండోస్థానంలో నిలిచిన తానే ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సదరు ఈపీపై నిర్ణయం వెలువడే వరకు ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక కోసం నోటిఫై చేయకుండా ఈసీని నిలువరించాలని కోరారు. ‘ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా వర్సెస్‌ తెలంగాణ రాష్ట్ర సమితి అండ్‌అదర్స్‌’ కేసులో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రస్తుత సందర్భానికి వర్తిస్తుందన్నారు. తమ ఈపీపై తీర్పు వచ్చే వరకూ ఖైరతాబాద్‌ స్థానాన్ని సాధారణ ఖాళీగా ప్రకటించడానికి, ఉప ఎన్నిక నిర్వహించడానికి వీల్లేదని పేర్కొన్నారు. ఈసీ తరఫున సీనియర్‌ న్యాయవాది అవినాశ్‌ దేశాయి స్పందిస్తూ.. పిటిషనర్‌ వాదనతో తాము ప్రాథమికంగా ఏకీభవిస్తున్నామన్నారు. ఎలక్షన్‌ పిటిషన్‌పై తీర్పు వెలువడే వరకు ఖైరతాబాద్‌ స్థానానికి ఉపఎన్నిక నోటిఫికేషన్‌ ఇవ్వబోమన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఈపీపై ఫలితం తేలేవరకు ఖైరతాబాద్‌ ఉపఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ చేయబోమని పేర్కొంటూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 6వ తేదీకి వాయిదా వేసింది.

Also Read: అబద్ధాలు నేర్చుకోవాలంటే కేటీఆర్ దగ్గర చేరాల్సిందే! గజ్జెల కాంతం

Tags

Related News

అబద్ధాలకు పెద్ద కొడుకు కేసీఆర్ అయితే.. చిన్న కొడుకు కేటీఆర్: అద్దంకి దయాకర్

అబద్ధాలు నేర్చుకోవాలంటే కేటీఆర్ దగ్గర చేరాల్సిందే! గజ్జెల కాంతం

ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఫస్టియర్ నుంచి ఇంటర్నల్స్ కీలకం, కొత్త రూల్స్ తెచ్చిన బోర్డు

అందర్నీ వాడేస్తున్నారు.. తొలిపార్ట్ రెండున్నర నిమిషాలే.. సెకండ్ పార్టీలో గుట్టు అంతా

కేవలం ఉద్యోగం రాలేదని.. ఆ మహిళ ఏం చేసిందంటే, హైదరాబాద్‌లో చెప్పలేని దారుణం

హైదరాబాద్‌ మహానగరంలో నేటి నుంచి క్యూర్ చట్టం.. పెరగనున్న ప్రాపర్టీ ట్యాక్స్

సిటీ మెట్రో, ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కామన్ పాస్‌లు ప్రారంభం?

Big Stories

Advertisement
×