E-Paper
Advertisement

డీ లిమిటేషన్‌తో ఉమ్మడి ఖమ్మంలో మరో మూడు సీట్లకు చోటు.. అవి ఇవే..?

డీ లిమిటేషన్‌తో ఉమ్మడి ఖమ్మంలో మరో మూడు సీట్లకు చోటు.. అవి ఇవే..?

Khammam Delimitation: స్వేచ్ఛ బ్యూరో: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ రాష్ట్రం లేదా ఉమ్మడి ఖమ్మం జిల్లా యూనిట్ గా పునర్విభజన జరిగితే జనాభా ప్రాతిపదికన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కొత్తగా 2నుండి 3అసెంబ్లీ సీట్లు ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న 10 అసెంబ్లీ స్థానాలు పునర్విభజనతో 12 లేదా 13 కు పెరిగే అవకాశం ఉంది. ఇందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఒకటి లేదా రెండు, ఉమ్మడి ఖమ్మం జిల్లా కు రెండు అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి. దీంతో ఈ అంశం ఇక్కడి రాజకీయాల్లో భారీ మార్పులకు నాంది పలుకనున్నట్లు చర్చ మెదలైంది. ఇక్కడ ఇపుడు ఎవరి నోట విన్నా ఓటర్ లిస్ట్ మ్యాపింగ్, ఎస్.ఐ.ఆర్ తో పాటు డీలిమిటేషన్ చర్చలే అధికంగా వినిపిస్తున్నాయి. 2 కొత్త సీట్లు ఏర్పాటు అయ్యే అవకాశం ఉన్నందున, అందునా ఎస్టీ, ఎస్సీ రిజర్డ్వ్, మహిళా కోటా 33% రిజర్వేషన్ కింద కేటాయించే స్థానం పోనూ ఇంకోటి జనరల్ కు దక్కే అవకాశం ఉంది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా నియోజకవర్గాల్లో రాజకీయ సమీకరణలు మారే సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఖమ్మం జిల్లాలో మరో రెండు

పునర్విభజన తర్వాత ఖమ్మం జిల్లాలో నియోజకవర్గాల సంఖ్య ప్రస్తుతం ఉన్న 5 నియోజకవర్గాలకు మరొకటి తోడై 6 లేదా 7 నియోజక వర్గాలయ్యే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లాలో జనరల్ కేటగిరికి మరో సీటు దక్కే అవకాశం ఉంది. ఇక్కడ ప్రతి నియోజకవర్గంలో జనాభా సుమారు 1.20లక్షల నుండి 1.50 లక్షల వరకు ఓటర్లు జాబితా లో ఉండ నున్నారు.

ఎవరికి లాభం? నష్టం ఎవరికి?

ఈ సీట్ల పెంపుదల వల్ల పెద్ద పార్టీలైన కాంగ్రెస్, బిఆర్ఎస్‌ల్లో ఎవరికి ఎలా లాభం కలుగుతుంది? చిన్న పార్టీలైన బిజెపి, కవిత టిఆర్ఎస్, మిగతా సంప్రదాయ రాజకీయ పార్టీల పరిస్థితి ఎలా మారుతుంది? 33% మహిళా రిజర్వేషన్ ఖరారయ్యాకే పునర్విభజన ఉంటుందా? కొన్ని రాజకీయ పార్టీలకు కొత్త నాయకుల కొరత నిజంగా ఉంటుందా? ఇవన్నీ ప్రశ్నార్థకం గానే ఉన్నాయి. గిరిజనులకు కనీసం ఒక అసెంబ్లీ సీటు పెరిగే అవకాశం ఉంది. ఇక్కడి నియోజకవర్గాల్లో గెలుపు స్థాయిలో బిజెపి బలం ఉండి ఉంటే పరిస్థితులు వేరేగా ఉండేవనీ, కానీ ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియలో బిఆర్ఎస్ పార్టీదీ పై చేయికానుందా? కాంగ్రెస్ దా? అనేదీ ప్రశ్నార్థకంగా ఉంది. భారీ మార్పులకు నాంది పలుకబోతున్న నియోజకవర్గాల పునర్విభజనలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది.

Also read: అధ్యక్షుడా లేక అల్లరి పిల్లోడా.. ట్రంప్ కుర్చీకి మళ్లీ అభిశంసన గండం

పునర్విభజన చర్చల వేగం

నియోజకవర్గాల పునర్విభజన చర్చలు వేగం పుంజుకోవడంతో నేతలు ఆ దిశగా దృష్టి సారించే అవకాశాలున్నాయి. 2027 మార్చి నాటికి జాతీయ జనగణన కార్యక్రమం పూర్తి చేసి, ఆ నివేదిక ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలని అందుకు గాను ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే పునర్విభజన బిల్లు ప్రవేశపెట్టనున్న ట్లు విస్వసనీయ సమాచారం. రాజకీయ పరిశీలకుల అంచనాల ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ద్వారా సీట్ల సంఖ్య పెంచడం వల్ల రాజకీయ నిరుద్యోగులకు, నాయకులకు తప్ప ప్రజలకు జరిగే మేలు పెద్దగా ఏమి ఉండదనే చెప్పాలంటున్నారు.

2021ఆగస్టు 3నపార్లమెంట్ లో రేవంత్ రెడ్డి ప్రశ్న..!

అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై నాటి టి. పిసిసి అధ్యక్షుడు, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు హోదాలో 3ఆగస్టు 2021న ఎనుముల రేవంత్ రెడ్డి పార్లమెంట్ లో వేసిన ప్రశ్నకు ఏపీ విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 నియోజకవర్గాలను పెంచాల్సిన అవరం ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సమాధానం ఇచ్చారు. రాజ్యంగంలోని ఆర్టికల్ 170లో చెప్పినట్లు 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని నిత్యానంద్ రాయ్ తెలిపారు.

Also Read: తెలంగాణ టీమ్‌కు దేశ బాధ్యతలు.. ఏఐసీసీ సంచలన నిర్ణయం..?

నియోజక వర్గాల పునర్విభజన జరిగితే..?

పునర్విభజన తర్వాత ఖమ్మం జిల్లాలో నియోజకవర్గాల సంఖ్య ప్రస్తుతం ఉన్న ఐదు నియోజకవర్గాల స్థానంలో మరొకటి లేదా రెండు నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి. ప్రతి నియోజకవర్గంలో జనాభా సుమారు 1.20లక్షల నుండి 1.50 లక్షల వరకు ఉంటుంది. ఖమ్మం నియోజకవర్గాన్ని రెండుగా విభజించి, ఖమ్మం అర్బన్ ప్రాంతమంతా ఒక నియోజకవర్గంగా, రఘునాథపాలెం మండలంతో పాటు ఆనుకుని ఉన్న మిగతా నియోజకవర్గాల్లోని కొంత భాగాన్ని కలుపుకుని ఖమ్మం – 2 నియోజకవర్గం ఏర్పాటు చేసి, ఎస్సీలకు రిజర్వ్ చేసే అవకాశం ఉంది. పాలేరు నియోజకవర్గంలో ఉన్న మండలాలు యధాస్థితిలో ఉండే అవకాశం ఉంది. మధిర నియోజకవర్గంలో మధిర, ఎర్రుపాలెం, బోనకల్ మండలాలు, వైరా నియోజకవర్గంలో వైరా, కొణిజర్ల, తల్లాడ మండలాలు, ఏన్కూరు, కారేపల్లి, సింగరేణి మండలాలు, సత్తుపల్లి నియోజకవర్గంలో సత్తుపల్లి, వేంసూరు,కల్లూరు, పెనుబల్లి మండలాలు ఏర్పాటు చేసి దీన్నీ జనరల్ నియోజకవర్గంగా రిజర్వేషన్ మార్చి పునర్విభజన జరిపించే అవకాశం ఉంటుంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో..

ఇక్కడ పునర్విభజన కమిటీ ఏర్పాటు, ఎస్టీ, ఎస్సీ జనాభా లెక్కలు తేలాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేవలం రెండు మాత్రమే నియోజకవర్గాలు ఏర్పాటు అవకాశం ఉంది. కొత్తగా ఒకటి జనరల్‌తో పాటు మరోకటి ఎస్సీ /ఎస్టీ లకు కెటాయించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పోలవరం ముంపునకు గురయ్యే ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసినందున ఖచ్చితంగా పినపాక, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా చేర్పులు ఉంటాయని భావిస్తున్నారు. కొత్తగా పాల్వంచ కేంద్రంగా కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఉన్న కొత్తగూడెం నియోజకవర్గం ఎస్సీ లకు రిజర్వ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. బూర్గంపహాడ్ మండలాన్ని కలుపుకుని కొత్తగా ఏర్పాటు కానున్న పాల్వంచ నియోజకవర్గం జనరల్‌గా మారే అవకాశం ఉందని పబ్లిక్ టాక్.

Also read: కూటమిలో కాకరేపుతున్న జమ్మలమడుగు రాజకీయం.. ఆదినారాయణ రెడ్డి అసలు స్కెచ్ అదేనా..!

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×