Wife beats husband: మద్యం అనేది ఒక వ్యక్తిని మాత్రమే కాదు, ఒక ఇంటిని, ఒక కుటుంబాన్ని, ఒక సమాజాన్ని కూడా అతలాకుతలం చేస్తుంది. మొదట్లో సరదాగా మొదలైన మద్యం అలవాటు క్రమంగా బానిసత్వానికి దారితీస్తుంది. మద్యం మత్తులో మనసులోని అర్ధం కాని కోపాలు, ఇంటి గొడవలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ కలిసి చివరకు ప్రాణాంతక పరిణామాలకే దారితీస్తాయి. భార్యలు, పిల్లలు ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ బాధపడేవారు. భర్తల మద్యం అలవాటుకు విసిగిపోయిన భార్యలు, ఆగ్రహంతో లేదా ఆత్మరక్షణ కోసం కఠిన చర్యలకు వెళ్ళే పరిస్థితులు వస్తాయి. అలాంటిదే ఒక సంఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో జరిగింది.
Also Read: SBI Cards: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ యూజర్లకు షాక్.. సెప్టెంబర్ 1 నుంచి న్యూ రూల్స్
కారణం ఇదీ..
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం జంగాల కాలనీకి చెందిన గంగారాం, లక్ష్మీ దంపతులు నివాసం ఉంటున్నారు. కొద్దిరోజులుగా సరదాగా సాగిన జీవితంలో మద్యం చిచ్చు పెట్టింది. దీంతో వారిద్దరూ తరచూ గొడవ పడేవారు. కారణం ఒకటే గంగారాం మద్యానికి బానిస కావడం. జీతం వచ్చినా ఆ డబ్బంతా మద్యంపైనే ఖర్చవ్వడం, కుటుంబం పట్ల నిర్లక్ష్యం చూపడం, భార్య మాట వినకపోవడం అన్నీ ఇవే ఆ ఇంట్లో ప్రతిరోజూ కలహాలకు కారణమయ్యాయి. ఒకరోజు ఈ గొడవలు మరింత పెరిగి దాడు చేసుకునేంత వరకు చేరాయి. ఆగ్రహంతో లక్ష్మి తన భర్తను తీవ్రంగా కొట్టింది. ఆగ్రహంతో భర్తను ఓరేంజ్‌లో ఆడుకుంది.
గంగారాం బయటకు పరుగులు పెడుతుంటే అక్కడే వున్న కొడుకు పట్టుకుని మళ్లీ మంచం మీద కూర్చొ బెట్టాడు. అంతే.. గంగారాం పై భార్య లక్ష్మీ దెయ్యం ఆవహించినట్లు దాడి చేసింది. గంగారాం ను ఇష్టం వచ్చినట్లు కొరికింది. దీంతో లబో దిబో మంటూ పోలీస్టేషన్ మెట్లెక్కాడు గంగారాం. తన భార్య తుక్కు తుక్కు కొట్టిందంటూ కన్నీరు పెట్టుకున్నాడు. భార్య లక్ష్మీ ఇంతకు ముందు కూడా డబ్బుకోసం ఇలానే వేధించడం వల్లనే ఇంటికి వెళ్లలేదని, ఇప్పుడు మళ్లీ ఇంటికి వస్తే కొడుతుందని గంగారం వాపోయాడు. తనని కాపాడాలని పోలీసులను వేడుకున్నాడు గంగారాం. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
https://twitter.com/bigtvtelugu/status/1959859415320035409