BigTV English

SBI Cards: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ యూజర్లకు షాక్.. సెప్టెంబర్ 1 నుంచి న్యూ రూల్స్

SBI Cards: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ యూజర్లకు షాక్.. సెప్టెంబర్ 1 నుంచి న్యూ రూల్స్

SBI Cards: దేశంలో అత్యధికంగా వాడే క్రెడిట్ కార్డుల్లో ఒకటి ఎస్‌బీఐ కార్డ్. ఇప్పటి వరకు ఈ కార్డ్ ద్వారా ఆన్‌లైన్ షాపింగ్, బిల్లు చెల్లింపులు, టికెట్లు బుక్ చేసుకోవడం, గేమింగ్ లావాదేవీలు చేస్తే ప్రతీ రూపాయికీ రివార్డ్ పాయింట్లు వచ్చేవి. ఆ పాయింట్లను మళ్లీ షాపింగ్‌కి, రుణాన్ని క్లియర్ చేసుకోవడానికి వాడుకునే సౌకర్యం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతోంది. వచ్చే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఎస్‌బీఐ కార్డ్ ఒక కొత్త నియమాన్ని అమలు చేయబోతోంది.


ఇకపై డిజిటల్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లపై చేసే లావాదేవీలు, అలాగే ప్రభుత్వానికి సంబంధించిన చెల్లింపులపై ఎలాంటి రివార్డ్ పాయింట్లు ఇవ్వబడవు. అంటే, ఎవరు ఆన్‌లైన్ గేమ్స్‌కి క్రెడిట్స్ కొనుగోలు చేసినా, లేదా ప్రభుత్వ వెబ్‌సైట్ల ద్వారా బిల్లులు, ఫీజులు చెల్లించినా, ఆ మొత్తం మీద ఒక్క రూపాయి రివార్డ్ పాయింట్ కూడా లభించదు. ఇప్పటివరకు లాభంగా భావించిన ఈ రివార్డ్ పద్ధతి ఇక వినియోగదారులకు ఉపయోగపడదు.

Also Read: Metro Fare Hikes: ప్రయాణికులకు షాక్.. సడన్‌గా చార్జీలు పెంచిన మెట్రో


ఈ కొత్త రూల్స్ ముఖ్యంగా లైఫ్‌స్టైల్ హోమ్ సెంటర్ ఎస్‌బీఐ కార్డ్, లైఫ్‌స్టైల్ హోమ్ సెంటర్ ఎస్‌బీఐ కార్డ్ సెలెక్ట్, లైఫ్‌స్టైల్ హోమ్ సెంటర్ ఎస్‌బీఐ కార్డ్ ప్రీమ్ కలిగిన వారికి మాత్రమే వర్తిస్తాయి. అంటే ఈ మూడు కార్డ్ హోల్డర్స్‌పై నేరుగా ప్రభావం చూపబోతున్నాయి. అంతేకాదు, రివార్డ్ పాయింట్లను రీడీమ్ చేసేటప్పుడు 99 రూపాయలు ప్లస్ టాక్స్‌ను తప్పనిసరిగా చెల్లించాల్సిందే. ఫిజికల్ ప్రోడక్ట్స్ లేదా స్టేట్‌మెంట్ క్రెడిట్ కోసం పాయింట్లు వాడినా, ఆ ఫీజు ఎలాంటి మినహాయింపు లేకుండా వసూలవుతుంది. అలాగే, రివార్డ్ పాయింట్లు ఒక్కో కార్డ్‌కే పరిమితం అవుతాయి. ఒక కార్డ్ మీద సంపాదించిన పాయింట్లను మరొక కార్డ్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం అసలు సాధ్యం కాదు.

రుణాలను తీర్చుకోవాలంటే కనీసం 2000 పాయింట్ల మల్టిపుల్‌గా మాత్రమే ఉపయోగించాలి. అంటే 1999 పాయింట్లు ఉన్నా వాటిని వాడలేం, తప్పనిసరిగా 2000 కావాలి. ఇలాంటివి ఎస్‌బీఐ మాత్రమే కాదు, ఇతర బ్యాంకులు కూడా చేస్తున్నాయి. ఇప్పటికే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ జూలై 1 నుంచి ఆన్‌లైన్ స్కిల్ బేస్డ్ గేమింగ్ లావాదేవీలకు రివార్డ్ పాయింట్లు ఇవ్వడం ఆపేసింది. దీని వలన కార్డ్ హోల్డర్స్ ఆశించే లాభాలు కాస్త తగ్గిపోతున్నాయి. మొత్తానికి, ఇకపై ఆన్‌లైన్ గేమింగ్‌కి డబ్బులు ఖర్చు చేసినా, ప్రభుత్వ బిల్లులు కార్డ్‌తో చెల్లించినా, వినియోగదారులకు ఎలాంటి రివార్డ్ పాయింట్లు రావు. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ తప్పక తెలుసుకోవాల్సిన మార్పు ఇదే.

Related News

Top 6 Clothing Brands: జుడియో తరహాలోనే వీటిలో కూడా దుస్తులు చాలా చీప్, వెంటనే ట్రై చెయ్యండి!

Zudio షోరూమ్‌కు ఎందుకంత క్రేజ్? ధరలు ఎందుకంత తక్కువ?

Gold Rate Today: కాస్త ఊరటగా బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే

CIBIL Score: లోన్ తీసుకునేవారికి తీపికబురు.. సిబిల్ స్కోర్ తప్పనిసరికాదు

Gold saving schemes: పొదుపుతో బంగారం సొంతం.. మీ కోసమే టాప్ స్కీమ్స్.. డోంట్ మిస్!

Big Stories

×