E-Paper
Advertisement

వరదలో చిక్కుకున్న కారు.. ప్రాణాలకు తెగించి కుటుంబాన్ని రక్షించిన స్థానికులు

వరదలో చిక్కుకున్న కారు.. ప్రాణాలకు తెగించి కుటుంబాన్ని రక్షించిన స్థానికులు
Advertisement

Car stuck in flood waters: ఖమ్మం జిల్లాలో భారీ వరద నీటి కారణంగా  పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఏన్కూరు మండలం నాచారం సమీపంలో ఆలయ దర్శనం ముగించుకుని కుటుంబ సభ్యులతో కలిసి ఖమ్మం తిరిగి వస్తుండగా కారు వరదలో చిక్కుకుపోయింది. ప్రయాణ సమయంలో మార్గమధ్యంలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పక్కన వేసిన తాత్కాలిక మట్టి రహదారిపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. అయితే వరద కారణంగా రోడ్డు సరిగ్గా కనిపించకపోవడంతో.. వారు ప్రయాణిస్తున్న కారు అకస్మాత్తుగా నీటిలో చిక్కుకుపోయింది. కొద్ది సేపటికే వరద ఉధృతి ఒక్క సారిగా పెరిగిపోవడంతో కారు ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రమాద సమయంలో కారులో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ప్రాణాలకు తెగించి కాపాడిన స్థానికులు:

Advertisement

కారు నీటిలో మునిగిపోతుండటంతో ఆందోళనకు గురైన ఒక మహిళ కారు నుంచి బయటకు వచ్చి ఒడ్డుకు వచ్చే ప్రయత్నం చేశారు. అయితే వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఆ మహిళ నీటిలో కొట్టుకుపోసాగింది. ఇది గమనించిన స్థానికులు అప్రమత్తమయ్యారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మహిళను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.దీంతో ఆమె ప్రాణాలతో బయటపడింది.

సురక్షితంగా బయటకు తీసిన కారు:

Advertisement

మహిళను రక్షించిన అనంతరం స్థానికులు.. ట్రాక్టర్ల సహాయంతో వరద నీటిలో పూర్తిగా చిక్కుకుపోయిన కారును కూడా సురక్షితంగా బయటకు వెలికితీశారు. సకాలంలో స్థానికులు స్పందించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘటనలో స్వల్ప గాయాలైన మహిళను కుటుంబ సభ్యులు తక్షణమే ఏన్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. వరద సమయంలో అప్రమత్తంగా ఉండాలని, నిర్మాణంలో ఉన్న తాత్కాలిక మార్గాల్లో ప్రయాణించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఈ సందర్భంగా ప్రజలకు సూచిస్తున్నారు.

Related News

హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో విషాదం.. ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్, ఎస్ఐ మృతి

తెలంగాణలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. బూర్గంపాడులో తుఫాన్ బీభత్సం, హుద్ హుద్‌ని తలపించిన గాలులు

రూ. 20 చిల్లర కోసం వివాదం.. ఆటో డ్రైవర్ దారుణ హత్య!

SLBC సొరంగ మార్గం పూర్తయితే.. ఇక నా జన్మధన్యమే.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు విడుదల.. ఈ రూట్లన్నీ క్లోజ్..?

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

ముంబయిలో దోపిడికి స్కెచ్.. నగరంలో క్యాబ్ డ్రైవర్ హత్య.. పటాన్ చెరు మర్డర్ కేసులో సంచలన నిజాలు!

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆర్‌టీఓ ఆఫీసుల్లో దళారీల నిషేధం!

Big Stories

Advertisement
×