E-Paper
Advertisement

SLBC సొరంగ మార్గం పూర్తయితే.. ఇక నా జన్మధన్యమే.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

SLBC సొరంగ మార్గం పూర్తయితే.. ఇక నా జన్మధన్యమే.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
Advertisement

SLBC Tunnel: ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పూర్తయితే తన జన్మధన్యం అవుతుందని రాష్ట్ర రోడ్లు, భవనాల మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఖైరతాబాద్ లోని విశ్వేశ్వరయ్య ఇంజనీర్స్ భవన్ లో బుధవారం ‘ఎల్ నినో ఎఫెక్ట్ – సాగునీటిరంగం, వ్యవసాయం’ అంశంపై జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బ్రాహ్మణ వెల్లెంల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నీళ్లు చూస్తుంటే శ్యామ్ ప్రసాద్ గుర్తుకు వస్తారన్నారు. ఇంజనీర్ విభాగంలో ప్రముఖులైన శ్యాంప్రసాద్, కోటిరెడ్డి నల్గొండ జిల్లాలో పుట్టడం చాలా సంతోషం అన్నారు.

తెలంగాణలో ప్రాజెక్ట్ ల నిర్మాణంలో కృషి చేసిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య దగ్గర నుంచి ప్రముఖ ఇంజనీర్లందర్నీ గుర్తు చేసుకుంటున్నానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఇంజనీర్లు లేనిదే దేశం లేదన్నారు. వ్యవసాయం రంగంలో ఇంజనీర్ల పాత్ర చాలా కీలకమైనదన్నారు. కరోనా లాగే నేడు ఎల్ నినో కరువు పరిస్థితి రాష్ట్రంలో వచ్చిందన్నారు. ఎల్ నినో వల్ల వర్షాలు లేక.. రైతుల పరిస్థితి ఇబ్బందికరంగా ఉందన్నారు. కరువును ఎదుర్కునేందుకు ప్రభుత్వానికి మీరందరూ సూచనలివ్వాలన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ముందుగా తాగునీటికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు.

Advertisement

అటు ఎస్ఎల్బీసీ సొరంగం ప్రాజెక్ట్ పట్టుబట్టి నాడు వైఎస్సార్ హయంలో సాధించానని.. సొరంగం పూర్తి చేయడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఇంజనీర్ల పాత్ర కీలకమైనదన్నారు. సీ.ఈ గా శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. సొరంగ మార్గం పూర్తయితే ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారంతో గ్రావిటి పైన రెండు పంటలకు నీళ్లు ఇవ్వవచ్చు అన్నారు. అందరు చేసే వృత్తిలో మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. ప్రతి గ్రామానికి బీటీ రోడ్లు వేయనున్నామన్నారు.

Advertisement

Also Read: విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ శాఖ ద్వారా మొదటి పేజ్ లో రూ.20వేల కోట్లతో రోడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామం నుండి మండలానికి, మండలం నుండి జిల్లా కేంద్రానికి కనెక్టివిటీ పెంచేలా సింగిల్ లేన్ నుండి డబుల్ రోడ్, ఫోర్ లేన్ నిర్మాణం లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు. ప్రసంగం అనంతరం గుర్రం కోటిరెడ్డి మెమోరియల్ అవార్డు గ్రహీతలను సన్మానించి, అవార్డు లను మంత్రి కోమటిరెడ్డి అందజేశారు.

Also Read: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వినాయక నిమజ్జనానికి ఆ రోజు సెలవు ప్రకటన

Tags

Related News

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు విడుదల.. ఈ రూట్లన్నీ క్లోజ్..?

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

ముంబయిలో దోపిడికి స్కెచ్.. నగరంలో క్యాబ్ డ్రైవర్ హత్య.. పటాన్ చెరు మర్డర్ కేసులో సంచలన నిజాలు!

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆర్‌టీఓ ఆఫీసుల్లో దళారీల నిషేధం!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వినాయక నిమజ్జనానికి ఆ రోజు సెలవు ప్రకటన

ఈ సారీ కొత్తగా అలా ప్లాన్ చేద్దాం.. గ్లోబల్ సమ్మిట్‌పై శ్రీధర్ బాబు కీలక ఆదేశాలు!

కేటీఆర్ కు గట్టి కౌంటర్ ఇచ్చిన ఎంపీ చామల.. BRS ఫైల్స్ ఓపెన్ చేస్తామంటూ వార్నింగ్!

Big Stories

Advertisement
×