E-Paper
Advertisement

హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో విషాదం.. ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్, ఎస్ఐ మృతి

హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో విషాదం.. ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్, ఎస్ఐ మృతి
Advertisement

Hyderabad: హైదరాబాద్ సిటీలో గణేష్ నిమజ్జనం గడిచిన మూడు రోజులు జరుగుతున్నాయి. నిమజ్జనంలో విషాదం చోటు చేసుకుంది. డ్యూటీలో ఉన్న ఓ ఎస్ఐ, రోడ్డు దాటుతుండగా టూ వీలర్ వచ్చి ఆయన్ని బలంగా ఢీ కొట్టింది. ఆయన స్పాట్‌లో పడిపోయారు. వెంటనే  ఆసుపత్రికి ఎస్ఐని తరలిస్తుండగా చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.

హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో విషాదం

హైదరాబాద్ వినాయకుడి నిమజ్జనాలు అంగరంగం వైభవంగా జరుగుతున్నాయి. గడిచిన మూడు రోజులుగా నగరం నలుమూలల నుంచి వినాయకుడి విగ్రహాలు హుస్సేన్ సాగర్‌కు తరలివస్తున్నాయి. అయితే నిమజ్జనంలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న ఓ ఎస్‌ఐని టూ వీలర్ ఢీ కొట్టింది. వెంటనే ఆయన్ని ఆసుపత్రి తరలించారు సిబ్బంది. అక్కడ చికిత్స తీసుకుంటూ ఎస్ఐ మృతి చెందారు. ఈ విషయం తెలిసి పోలీసు అధికారులు షాకయ్యారు.

ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్

Advertisement

వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద డ్యూటీ చేస్తున్నారు కొత్తగూడెం టూ టౌన్ ఎస్సై వెంకన్న గణేష్. రోడ్ల వాహనాల ట్రాఫిక్ కాస్త తగ్గడంతో కానిస్టేబుల్‌తో కలిసి ఎస్ ఐ గణేష్ రోడ్డు దాటుతున్నారు. రోడ్డు సగం దాటిన తర్వాత కానిస్టేబుల్ చేయి చూపిస్తూ అడుగులు వేస్తున్నారు. ఈలోగా వేగంగా వచ్చిన టూ వీలర్.. తొలుత కానిస్టేబుల్‌ని ఢీ కొట్టింది. ఆయన పక్కనున్న ఎస్ఐని హిట్ కొట్టింది. ఆ తర్వాత వాహనం.. మరొక వాహనాన్ని ఢీ కొట్టింది. ప్రమాదానికి కారణమైన టూ వీలర్ ఆపకుండా అక్కడి నుంచి పరారయ్యాడు.

ఎస్ఐని ఢీ కొట్టిన టూ వీలర్, చికిత్స పొందుతూ మృతి

ఈలోగా ఎస్‌ఐ వెంకన్న గణేష్ రోడ్డుపై కుప్పకూలిపోయారు. వెంటనే పోలీసులు పరుగున అక్కడికి వచ్చి, ఆయన్ని అంబులెన్స్‌లో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన వెంకన్న చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఆ ప్రాంత పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించి వాహన యువకులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వెంకన్న వయస్సు 55 ఏళ్లు. జరిగిన ఘటనతో డ్యూటీలోని పోలీసుల్లో విషాధం అలముకుంది. ఎస్ఐ మృతి చెందిన విషయం తెలియగానే ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

Advertisement

 

 

Related News

తెలంగాణలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. బూర్గంపాడులో తుఫాన్ బీభత్సం, హుద్ హుద్‌ని తలపించిన గాలులు

రూ. 20 చిల్లర కోసం వివాదం.. ఆటో డ్రైవర్ దారుణ హత్య!

SLBC సొరంగ మార్గం పూర్తయితే.. ఇక నా జన్మధన్యమే.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు విడుదల.. ఈ రూట్లన్నీ క్లోజ్..?

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

ముంబయిలో దోపిడికి స్కెచ్.. నగరంలో క్యాబ్ డ్రైవర్ హత్య.. పటాన్ చెరు మర్డర్ కేసులో సంచలన నిజాలు!

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆర్‌టీఓ ఆఫీసుల్లో దళారీల నిషేధం!

Big Stories

Advertisement
×