E-Paper
Advertisement

రూ. 20 చిల్లర కోసం వివాదం.. ఆటో డ్రైవర్ దారుణ హత్య!

రూ. 20 చిల్లర కోసం వివాదం.. ఆటో డ్రైవర్ దారుణ హత్య!
Advertisement

Auto Driver: 20రూపాయల కోసం ఆటో డ్రైవర్ ను దారుణంగా హత్య చేసిన నలుగురు నిందితులను ఫలక్ నుమా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, రెండు మొబైల్ ఫోన్లు, హత్యకు కారణమైన బైక్ తాళం చెవిని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మైలార్‌ దేవుపల్లి రోషన్ కాలనీకి చెందిన మహమ్మద్ ముకర్రం (42) ఆటో డ్రైవర్‌. ఈ నెల 20న రాత్రి 7:25 గంటల సమయంలో తన భార్య నాజియా బేగం, కూతురు సల్మా బేగంతో కలిసి బట్టలు కొనుగోలు చేసేందుకు ఆటోలో ఇంజిన్ బౌలి వైపు వెళ్తున్నాడు.

చిల్లర లేకపోవడంతో..

మార్గమధ్యంలో అయాన్ దర్బార్ హోటల్ వద్ద నిందితురాలు ముంతాజ్ ఉన్నీసా (53) ఆటో ఎక్కి వట్టేపల్లిలోని నైస్ హోటల్ వద్ద దిగింది. ఆ సమయంలో ఆటో ఛార్జీ 20 చెల్లించే విషయంలో చిల్లర లేకపోవడంతో ముంతాజ్ ఉన్నీసాకు, ఆటో డ్రైవర్ ముకర్రం మధ్య గొడవ జరిగింది. దాంతో ముంతాజ్ ఉన్నీసా తన కుమారుడికి ఫోన్ చేసి వెంటనే ఇక్కడికి వచ్చి వీరి సంగతి తేల్చండని చెప్పింది. పరిస్థితిని గమనించిన ముకర్రం కుమార్తె ఛార్జీ వద్దని చెప్పడంతో ముకర్రం డబ్బులు తీసుకోకుండానే అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.

Advertisement

Also read: SLBC సొరంగ మార్గం పూర్తయితే.. ఇక నా జన్మధన్యమే.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

నైస్ హోటల్..

అయితే, సాజిద్ అనే మరొక ఆటో డ్రైవర్ ముకర్రంకు కాన్ఫరెన్స్ కాల్ చేసి మాట్లాడటానికి నైస్ హోటల్ వద్దకు రావాలని చెప్పాడు. దాంతో ముకర్రం నైస్ హోటల్ సమీపంలోని గోల్డెన్ పాన్ షాప్ వద్దకు వచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ముంతాజ్ ఉన్నీసా కుమారుడు సయ్యద్ మహమ్మద్ అజీమ్ (32) అతని స్నేహితులు మహమ్మద్ షోయబ్ (28), మహమ్మద్ ఇమ్రాన్ అలీ (28)లు అతనిపై దాడి చేశారు.
పిడిగుద్దులతో తీవ్రంగా గాయపరిచారు. ముకర్రం భార్య, కూతురు అడ్డుకోబోగా వారిని పక్కకు నెట్టివేశారు. ఈ క్రమంలో కిందపడిపోయిన ముకర్రం తలపై సయ్యద్ మహమ్మద్ అజీం బైక్ తాళం చెవితో బలంగా కొట్టాడు. దాంతో ముకర్రం స్పృహ తప్పి పడిపోయాడు.

కూతురు ఫిర్యాధు..

Advertisement

ఆ తర్వాత కూడా తీవ్రంగా దాడి చేసిన నిందితులు అక్కడి నుండి పరారయ్యారు. బాధితుడిని కుటుంబ సభ్యులు వెంటనే శాలిబండలోని ప్రిన్సెస్ అస్రా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ముకర్రం చనిపోయినట్టు నిర్ధారించారు. హతుని కూతురు సల్మా బేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫలక్‌నుమా పోలీసులు కేసులు నమోదు చేశారు. రాజేంద్రనగర్ జోన్ డీసీపీ శ్రీనివాస్ పర్యవేక్షణలో, ఏసీపీ జావేద్ నాయకత్వంలో ఫలక్‌నుమా ఇన్స్పెక్టర్ M. అప్పల నాయుడు, డీఐ జాకీర్ హుస్సేన్, క్రైమ్ సిబ్బంది నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టులో హాజరుపరిచి జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించినట్టు సీఐ అప్పల నాయుడు తెలిపారు.

Also read: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు విడుదల.. ఈ రూట్లన్నీ క్లోజ్..?

Tags

Related News

SLBC సొరంగ మార్గం పూర్తయితే.. ఇక నా జన్మధన్యమే.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు విడుదల.. ఈ రూట్లన్నీ క్లోజ్..?

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

ముంబయిలో దోపిడికి స్కెచ్.. నగరంలో క్యాబ్ డ్రైవర్ హత్య.. పటాన్ చెరు మర్డర్ కేసులో సంచలన నిజాలు!

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆర్‌టీఓ ఆఫీసుల్లో దళారీల నిషేధం!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వినాయక నిమజ్జనానికి ఆ రోజు సెలవు ప్రకటన

ఈ సారీ కొత్తగా అలా ప్లాన్ చేద్దాం.. గ్లోబల్ సమ్మిట్‌పై శ్రీధర్ బాబు కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×