E-Paper
Advertisement

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆర్‌టీఓ ఆఫీసుల్లో దళారీల నిషేధం!

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆర్‌టీఓ ఆఫీసుల్లో దళారీల నిషేధం!
Advertisement

Uppal RTO: ఆర్టీఓ కార్యాలయ ప్రాంగణంలోకి ఏజెంట్లు, మధ్యవర్తులు (దళారులు) లేదా ఎలాంటి అనధికార వ్యక్తులను అనుమతించొద్దని విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు. కార్యాలయంలో ఏజెంట్లకు అవకాశం కల్పించిన అధికారి లేదా సిబ్బంది వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని, అటువంటి వారిపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తప్పవని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ ఉప్పల్‌లోని ప్రాంతీయ రవాణా కార్యాలయాన్ని (ఆర్.టీ.ఓ.) బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

దళారుల నిషేధం..

కార్యాలయంలో జరుగుతున్న రోజువారీ కార్యకలాపాలను క్షుణ్ణంగా పరిశీలించారు. డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షల నిర్వహణ విధానం, ప్రజలకు అందుతున్న సేవల నాణ్యత, వాహన్ పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిస్థితి, కార్యాలయ ప్రాంగణంలో అనధికార ఏజెంట్ల సంచారం వంటి అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ ఆర్టీఓ కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద, అన్ని కౌంటర్ల వద్ద ఏజెంట్లు, దళారుల నిషేధానికి సంబంధించిన నోటీసులను ప్రజలకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని ఆదేశించారు. ప్రజలు ఎలాంటి మధ్యవర్తుల సహాయం లేకుండా నేరుగా కౌంటర్ల వద్దకు వచ్చి గానీ, లేదావాహన్/ సారధి ఆన్‌లైన్ పోర్టల్స్ ద్వారా గానీ రవాణా శాఖ సేవలను సులభంగా పొందవచ్చన్నారు. సంబంధిత కార్యాలయ ఆర్టీవోలతో పాటు డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్లు తమ పరిధిలోని కార్యాలయాలను నిరంతరం పర్యవేక్షించాలని జేటీసీ సూచించారు.

Advertisement

Also Read: ఆదిలాబాద్ రిమ్స్ బాధితులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం రేవంత్!

డ్రైవింగ్ పరీక్షలు..

రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు పారదర్శకమైన, సమర్థవంతమైన, నాణ్యమైన సేవలు అందించేందుకు రవాణా శాఖ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. సేవల్లో జవాబుదారీతనం పెంచే దిశగా రాష్ట్రంలోని అన్ని ఆర్.టీ.ఓ. కార్యాలయాలపై ఇటువంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. డ్రైవింగ్ పరీక్షలను మరింత కఠినంగా, సమగ్రంగా , నిబంధనల ప్రకారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆర్టీఓ ఆఫీసుకు వచ్చిన దరఖాస్తుదారులు, సాధారణ ప్రజలతో నేరుగా మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకున్నారు.

ఆన్‌లైన్ పోర్టల్..

Advertisement

అందుతున్న సేవలు, పనుల కోసం వేచి ఉండాల్సిన సమయం, సిబ్బంది ప్రవర్తన, ఆన్‌లైన్ పోర్టల్ వినియోగంలో ఎదురవుతున్న ఇబ్బందులు వంటి అంశాలపై ఆరా తీశారు. ప్రతి దరఖాస్తుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, నిర్దేశిత గడువులోగా దరఖాస్తులను పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. వాహనదారులు అనవసరంగా ఇబ్బంది పడకుండా, మరింత వేగంగా మరియు సౌకర్యవంతంగా సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Also read: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వినాయక నిమజ్జనానికి ఆ రోజు సెలవు ప్రకటన

Tags

Related News

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు విడుదల.. ఈ రూట్లన్నీ క్లోజ్..?

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

ముంబయిలో దోపిడికి స్కెచ్.. నగరంలో క్యాబ్ డ్రైవర్ హత్య.. పటాన్ చెరు మర్డర్ కేసులో సంచలన నిజాలు!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వినాయక నిమజ్జనానికి ఆ రోజు సెలవు ప్రకటన

ఈ సారీ కొత్తగా అలా ప్లాన్ చేద్దాం.. గ్లోబల్ సమ్మిట్‌పై శ్రీధర్ బాబు కీలక ఆదేశాలు!

కేటీఆర్ కు గట్టి కౌంటర్ ఇచ్చిన ఎంపీ చామల.. BRS ఫైల్స్ ఓపెన్ చేస్తామంటూ వార్నింగ్!

టీజీఈజేఏసీ ఉద్యోగుల డిమాండ్లపై తేలని పంచాయితీ.. రెండు డీఏలపై సర్కార్ క్లారిటీ!

Big Stories

Advertisement
×