Ganesh Immersion: భాగ్యనరంలో గణేశ్ విగ్రహాల నిమజ్జనం సంతర్బంగా హైదరాబాద్‌లొ ట్రాఫిక్ ఆంక్షలు పోలీసులు విదించారు. ఈ ఆంక్షలు SEP 25 ఉదయం 6 గంటల నుంచి 26వ తేదీ ఉదయం 10 గంటల వరకు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లో ప్రధాన రహదారుల్లో పోలీసులు ఆంక్షలు విదించారు. దీంతో ఊరేగింపుకు ప్రదాన మార్గాల్లైన ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, ఖైరతాబాద్, ఎంజే మార్కెట్, లిబర్టీ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు. దీంతో నగరవాసులు వారి ప్రయాణానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచనలు చేశారు.
గణేశ్ నిమజ్జనానికి సిటీ పోలీస్ సర్వసన్నద్ధమయ్యింది. లక్షలాది మంది పాల్గొనే శోభాయాత్ర సందర్భంగా చిన్నపాటి అవంఛనీయ సంఘటన కూడా జరగకుండా చూసేందుకు పోలీసు ఉన్నతాధికారులు అన్ని చర్యలు తీసుకోనున్నారు. దీనికోసం 20వేల మంది పోలీసులను రంగంలోకి దింపనున్నారు. నిమజ్జన ఊరేగింపు కొనసాగే దారిలో 10వేల సీసీ కెమెరాలతోపాటు 24డ్రోన్లతో నిఘా పెట్టనున్నారు. ప్రతీ సంవత్సరంలానే ఈసారి కూడా హైదరాబాద్ లో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా సాగిన విషయం తెలిసిందే..
Also read: గణేష్ నిమజ్జనం స్పెషల్ ఈవెంట్.. సందడి చేసిన సెలబ్రిటీస్!
హైదరాబాద్ తో పాటు సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ, పొరుగు జిల్లాల నుంచి లక్షల మంది శోభాయాత్రలో పాల్గొంటారు. లక్షలాది మంది భక్తుల జయజయ ధ్వానాల మధ్య తరలివచ్చే వేలాది విగ్రహాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ సిటీ పోలీసులు బందోబస్తు వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ, విద్యుత్, వాటర్ బోర్డు, వైద్య తదితర అన్ని శాఖల అధికారుల సమన్వయంతో అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రశాంత వాతావరణంలో లంబోదరునికి వీడ్కోలు పలికేలా కార్యాచరణ సిద్ధం చేశారు. ఇప్పటివరకు ఖైరతాబాద్ బడా గణేష్ ను 25 లక్షలు, బాలాపూర్ వినాయకుడిని 15 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. నిమజ్జన చివరి రోజున ఈ రెండు ప్రాంతాల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో అక్కడ భద్రతా పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
Also read: ఆదిలాబాద్ రిమ్స్ బాధితులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం రేవంత్!