E-Paper
Advertisement

Kishan Reddy: దుబ్బాకలో కమలం జెండా ఎగరాలి.. కొమురవెల్లిలో రైల్వే స్టేషన్, కిషన్ రెడ్డి కీలక ప్రకటన

Kishan Reddy: దుబ్బాకలో కమలం జెండా ఎగరాలి.. కొమురవెల్లిలో రైల్వే స్టేషన్, కిషన్ రెడ్డి కీలక ప్రకటన
Advertisement

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై, గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకటేనని, తెలంగాణను దోచుకోవడంలో ఆ రెండు పార్టీలు పోటీ పడుతున్నాయని ఆయన విమర్శించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, తీరా గద్దెనెక్కిన తర్వాత ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును తప్పుబడుతూ.. ‘నన్ను కోసినా డబ్బులు లేవు’ అని ముఖ్యమంత్రి చెప్పడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని కిషన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నా, క్షేత్రస్థాయిలో అభివృద్ధి మాత్రం శూన్యమని ఎద్దేవా చేశారు. గత రెండేళ్ల కాంగ్రెస్ హయాంలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధి ఏమీ లేదని.. పైగా గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది పేదల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోందని ఆయన విమర్శించారు.

Advertisement

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దోచుకున్న డబ్బులను పంచుకోవడంలోనే ఆ కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతున్నాయని.. అందుకే వారు నేడు రోడ్డున పడ్డారని అన్నారు. లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కవితే వారి బండారాన్ని త్వరలోనే బయటపెడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో ‘సారు.. కారు.. 16’ అంటూ ప్రచారం చేసిన కేసీఆర్‌కు చివరికి గుండు సున్నాయే మిగిలిందని గుర్తు చేశారు.

దేశాభివృద్ధి కేవలం నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీతోనే సాధ్యమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కేంద్ర నిధులతోనే సాగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. జాతీయ రహదారుల నిర్మాణం మోదీ ప్రభుత్వ కృషి వల్లనే వేగవంతమైందని తెలిపారు. ఈ క్రమంలోనే భక్తులకు శుభవార్త చెబుతూ, త్వరలోనే కొమురవెల్లిలో రైల్వే స్టేషన్‌ను ప్రారంభిస్తామని వెల్లడించారు. కరోనా కష్టకాలంలో పేద ప్రజల ప్రాణాలను కాపాడటమే కాకుండా, ఉచిత బియ్యం అందించి వారి అభ్యున్నతికి మోదీ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని గుర్తు చేశారు.

Advertisement

దుబ్బాకలో గతంలో రఘునందన్ రావు ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించారని, అదే ఊపును ఇప్పుడు కూడా కొనసాగించాలని పిలుపునిచ్చారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో దుబ్బాకలో కమలం పువ్వు జెండా ఎగరేసి మరోసారి చరిత్ర తిరగరాయాలని కోరారు. అవినీతిమయమైన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు బుద్ధి చెప్పి, అభివృద్ధిని కాంక్షించే బీజేపీ అభ్యర్థులను భారీ మె కిజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

ALSO READ: Bhatti Vikramarka: ఉపాధి హామీ పథకంలో గాంధీజీ పేరు తొలగించడం దారుణం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×