Kishan Reddy: కల్వకుంట్ల కవితకు లిక్కర్ కేసులో క్లీన్ చిట్ రావడం తర్వాత ఏం జరుగుతుందనేది చెప్పాల్సింది తాను కాదని, సీబీఐ చెబుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని బౌద్ధనగర్, సీతాఫల్ మండి, మెట్టుగూడ డివిజన్లలో కిషన్ రెడ్డి బస్తీ వాసులతో కలిసి గల్లీల్లో కలియతిరిగారు. ఈ సందర్భంగా పేదల సంక్షేమం, స్థానికుల మౌలిక సమస్యలపై దృష్టి సారించి, ప్రజలను స్వయంగా కలుసుకుని సమస్యలు తెలుసుకున్నారు. వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకురావడమే ఏకక లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. హైదరాబాద్ లో ఆలయాలపై దాడులు జరగడానికి మజ్లిస్ కారణమని ఆరోపించారు. ఓల్డ్ సిటీలో ఏ ఒక్క పోలీసు అధికారిని నియమించాలన్నా, ఎవరైనా మంత్రి తిరగాలన్నా దారుస్సలాంలో నిర్ణయం తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు. జనాభా పెరుగుదలతో హైదరాబాద్ కాంక్రీట్ జంగల్ గా మారిపోతోందన్నారు.
Also Read: Kavitha vs BRS: కడిగిన ముత్యమైన కవిత.. బీఆర్ఎస్‌కు బురద.. కారు పని ఖేల్ ఖతమేనా?
మౌలిక వసతుల కల్పనలో బీఆర్ఎస్, కాంగ్రెస్ విఫలమయ్యాయన్నారు. ఎల్ అండ్ టీని టేకోవర్ చేసి.. పాత మెట్రో, కొత్త మెట్రో కలిపి డీపీఆర్ తయారుచేయాలని, డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు వచ్చిన తర్వాత అప్పుడు కేంద్రానికి పంపాలని సీఎంకు సూచించారు. మూసీ ప్రక్షాళనను బీజేపీ వ్యతిరేకిస్తుందని అబద్ధాలు ఆడుతున్నారని, 60 ఏండ్లుగా ఉంటున్న వారిని నిరాశ్రయులు చేయడానికి మాత్రమే తాము వ్యతిరేకమన్నారు. ఇదిలా ఉండగా చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు డాక్టర్ సౌందరరాజన్ మృతిపై కిషన్ రెడ్డి సంతాపం వ్యక్తంచేశారు.
Also Read: Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. చట్టసభల్లో ఆ కీలక మావోయిస్టులకు సీట్లు..?